News


రూ.40,600 పైకి పెరిగిన పుత్తడి

Monday 27th January 2020
Markets_main1580098568.png-31227


గత మూడు నాలుగు రోజులుగా బంగారం ధర స్వల్పంగా పెరుగుతూ వస్తూ సోమవారం నాటికి రూ.40,600  చేరింది. చైనాలో వ్యాపిస్తున్న కరోనా వైరస్‌ దాటికి స్టాక్‌ మార్కెట్లు పతనం  కావడంతో ఇన్వెస్టర్లు రక్షణాత్మక పెట్టుబడులపై దృష్టి పెట్టడంతో మరోసారి బంగారం ధర పెరిగింది. సోమవారం దేశీయ ఎంసీఎక్స్‌లో  10 గ్రాముల బంగారం  ధర మధ్యహ్నం 3 గంటల ప్రాంతంలో రూ.309 పెరిగి రూ.40,661.00 వద్ద ట్రేడ్‌ అవుతోంది. కాగా  శుక్రవారం రాత్రి మార్కెట్‌ ముగిసే సమయానికి 10 గ్రాముల పసిడి ధర 69 రూపాయలు పెరిగి రూ.40,352.00 వద్ద ముగిసింది.అంతర్జాతీయ మార్కెట్‌లోనూ పసిడి ధర 11 డాలర్లు పెరిగి ఔన్స్‌ ధర 1572 డాలర్ల నుంచి 1583 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. 



You may be interested

ఏపీఎల్‌ జూమ్‌- వెండిట్‌, బీవోబీ బోర్లా

Monday 27th January 2020

క్యూ3(అక్టోబర్‌-డిసెంబర్‌) ఫలితాల ఎఫెక్ట్‌ ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తున్న కరోనా వైరస్‌ కారణంగా దేశీ స్టాక్‌ మార్కెట్లలో అమ్మకాలు తలెత్తాయి. దీంతో బలహీనంగా ప్రారంభమైన మార్కెట్లు నేలచూపులతో కదులుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2019-20) మూడో త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించడంతో ఏపీఎల్‌ అపోలో ట్యూబ్స్‌ కౌంటర్‌కు డిమాండ్‌ కనిపిస్తోంది. అయితే మరోపక్క ఈ ఏడాది క్యూ3(అక్టోబర్‌-డిసెంబర్‌)లో సాధించిన ఫలితాలు ఇన్వెస్టర్లను నిరాశపరచడంతో వెండిట్‌ ఇండియా, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా కౌంటర్లు అమ్మకాలతో

12430 పాయింట్లు దాటితేనే ర్యాలీ!

Monday 27th January 2020

నిఫ్టీపై నిపుణుల అంచనా దేశీయ మార్కెట్లు సోమవారం నెగిటివ్‌గా ఆరంభమయ్యాయి. నిఫ్టీ దాదాపు 70 పాయింట్ల నష్టంతో ట్రేడవుతోంది. నిఫ్టీకి దాదాపు 12100- 12150 పాయింట్ల రేంజ్‌లో 50 రోజుల డీఎంఏ వద్ద మద్దతు దొరుకుతోంది. ప్రస్తుతానికి నిఫ్టీ స్వల్పకాలిక 5,10, 20 డీఎంఏలకు దిగువన ఉంది. నిఫ్టీకి తక్షణ నిరోధం 12290, 12335 పాయింట్ల వద్ద ఎదురవుతుందని ఎంఎస్‌టీఏ నిపుణుడు మిలాన్‌ వైష్ణవ్‌ చెప్పారు. ఆర్‌ఎస్‌ఐ ప్రస్తుతం న్యూట్రల్‌ నుంచి

Most from this category