News


రూ. 40,300పైకి పుత్తడి

Saturday 25th January 2020
Markets_main1579926632.png-31192


మళ్లీ పెరిగిన బంగారం ధర..

గత రెండు మూడురోజులుగా స్వల్పంగా పెరుగుతూ వస్తున్న బంగారం ధర శుక్రవారం మరింత పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్స్‌ బంగారం ధర గత రాత్రి ప్రపంచ మార్కెట్లో1,560 నుంచి 1,575.20 గరిష్టస్థాయికి చేరింది. చివరకు గత రాత్రి న్యూయార్క్‌లో 1571 డాలర్ల వద్ద ముగిసింది. ఇదే ట్రెండ్‌ను అనుసరిస్తూ శుక్రవారం రాత్రి ఇండియాలోని ఎంసీఎక్స్‌ లో రూ.300పైగా పెరిగి 40352.00 వద్ద స్థిరపడింది. వివిధ దేశాల కరెన్సీలు బలహీనపడడం, ఇన్వెస్టర్లంతా రక్షణాత్మక పెట్టుబడుల వైపు మొగ్గు చూపడంతో పసిడి ధర పెరిగింది.



You may be interested

ఐసీఐసీఐబ్యాంకు ఫలితాలు ఎలా ఉండొచ్చు?

Saturday 25th January 2020

మూడో త్రైమాసికంలో ఐసీఐసీఐ బ్యాంకు లాభం దాదాపు 200 శాతం పెరగవచ్చని అనలిస్టులు అంచనా వేస్తున్నారు. బ్యాంకుకు చెందిన పెద్ద ఎన్‌పీఏ ఎస్సార్‌ స్టీల్‌కు సంబంధించిన బకాయిలు వసూలు కావడం లాభాలను పెంచుతుందని భావిస్తున్నారు. క్యు3లో బ్యాంకు నికర వడ్డీ ఆదాయంలో 30 శాతం వరకు పెరుగుదల ఉండొచ్చని భావిస్తున్నారు. అదేవిధంగా స్థిరమైన ఎన్‌ఐఎం, ప్రీప్రొవిజన్‌ లాభంలో 20 శాతం పెరుగుదల ఉంటాయని అంచనా వేస్తున్నారు. శనివారం బ్యాంకు ఫలితాలు

యూఎస్‌ మార్కెట్లకు కరోనా వణుకు

Saturday 25th January 2020

ఇంట్రాడేలో డోజోన్స్‌ పతనం ఎయిర్‌లైన్స్‌ కౌంటర్లు డీలా టాటా మోటార్స్‌ 1.4 శాతం డౌన్‌ చైనాను వణికిస్తున్న కరోనా వైరస్‌ తాజాగా ఇల్లినాయిస్‌లో ఒక వ్యక్తికి సోకినట్లు వెల్లడికావడంతో వారాంతాన అమెరికా స్టాక్‌ మార్కెట్లు ఒక్కసారిగా కుదేలయ్యాయి. అమ్మకాలు ఊపందుకోవడంతో డోడోన్స్‌ ఇండెక్స్‌ తొలుత 300 పాయింట్లు పతనమైంది. తదుపరి కొంతమేర కోలుకుంది. చివరికి శుక్రవారం డోజోన్స్‌ 170 పాయింట్లు(0.6 శాతం) నీరసించి 28,990 వద్ద నిలవగా.. ఎస్‌అండ్‌పీ 30 పాయింట్లు(0.9 శాతం) తక్కువగా

Most from this category