News


రికవరి బాటలో పసిడి ధర

Wednesday 12th June 2019
Markets_main1560330156.png-26252

రికవరి బాటలో పసిడి ధర
క్రితం ట్రేడింగ్‌లో వారం కనిష్టానికి పతనమైన పసిడి ధర బుధవారం రికవరీ బాట పట్టింది. నేటి ఆసియా ట్రేడింగ్‌లో 10డాలర్లు లాభపడింది. మధ్యాహ్నం ట్రేడింగ్‌ సెషన్‌లో ఔన్స్‌ పసిడి ధర 1,341.35డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. చైనా, అమెరికా దేశాల మధ్య వాణిజ్య యుద్ధ భయాలు మళ్లీ తెరపైకి రావడంతో మార్కెట్ల సెంటిమెంట్‌ బలహీనపడింది. ఇన్వెస్టర్లు రక్షణాత్మకంగా పసిడి కొనుగోళ్లకు మొగ్గుచూపుతున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు ఈ వారం(18, 19) తేదిల్లో జరిగే అమెరికా ఫెడ్‌ రిజర్వ్‌ ద్రవ్య పరపతి సమావేశాల్లో వడ్డీరేట్లను తగ్గింపు అంచనాలకు పసిడి ఫ్యూచర్లకు డిమాండ్‌ పెంచుతున్నాయి. అమెరికా - మెక్సికో వాణిజ్య చర్చలు వాయిదా పడిన నేపథ్యంలో నిన్నటి అమెరికా మార్కెట్లో ఔన్స్‌ పసిడి ధర 1,324 డాలర్ల వద్ద స్ధిరపడింది. 

దేశీయంగా పెరుగుదలే:- 
అంతర్జాతీయ ట్రెండ్‌కు అనుగుణంగానే దేశీయ మార్కెట్లో పసిడి ఫ్యూచర్లకు డిమాండ్‌ పెరిగింది. దేశీయ ఈక్విటీ మార్కెట్ల నష్టాల ట్రేడింగ్‌ పసిడి ఫ్యూచర్లకు కొనుగోళ్లకు సహకరిస్తుంది. ఎంసీఎక్స్‌ మార్కెట్లో మధ్యాహ్నం ట్రేడింగ్‌ సెషన్‌లో 10గ్రాముల పసిడి ధర రూ.189.00లు నష్టపోయి రూ.32821.00ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇదే సమయానికి ఫారెక్స్‌ మార్కెట్లో డాలర్‌ మారకంలో రూపాయి విలువ 11 బలపడి  69.32 స్థాయి వద్ద ట్రేడ్‌ అవుతోంది. 



You may be interested

యస్‌ బ్యాంక్‌ 4 శాతం ఢౌన్‌

Wednesday 12th June 2019

రేటింగ్‌ను తగ్గించే అవకాశం ఉందని అంతర్జాతీయ రేటింగ్‌ సంస్థ మూడీస్‌ ప్రకటించడంతో యస్‌ బ్యాంక్‌ షేర్లు బుధవారం ట్రేడింగ్లో 4శాతం నష్టపోయాయి. నేడు ఈ కంపెనీ షేరు బీస్‌ఈలో రూ.136.40ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. బ్యాంకింగేతర సంస్థలకు అధిక స్థాయిలో రుణాలను మంజూరీ చేసిన నేపథ్యంలో బ్యాంక్‌ రేటింగ్‌ తగ్గే అవకాశం ఉందని అంతర్జాతీయ రేటింగ్‌ సంస్థ మూడీస్‌ సంకేతాలిచ్చింది. ప్రస్తుతం ఈ బ్యాంకుకు ‘బీఏ1’ రేటింగ్‌ ఉండగా.. ఇందులో సవరణ జరిగే

4నెలల కనిష్టానికి ఇండియాబుల్స్‌హౌసింగ్‌

Wednesday 12th June 2019

రెండు రోజుల్లో 15శాతం క్రాష్‌ 10కోట్ల కోట్ల మార్కెట్‌ క్యాప్‌ హుష్‌కాకి..! దేశంలో రెండో అతిపెద్ద హౌసింగ్‌ రుణాల సంస్థ ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ షేర్ల పతనం బుధవారం 4నెలల కనిష్టానికి పతనమయ్యాయి. రూ.96 వేల కోట్ల ప్రజాధనాన్ని డైరెక్టర్లు, ఛైర్మన్‌ దారి మళ్లించారని ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ ఇన్వెస్టర్‌గా చెప్పుకుంటున్న అభయ్‌ యాదవ్‌ సోమవారం సుప్రీం కోర్టులో పిటిషన్‌ ధాఖలు చేశారు.  ఈ నిధుల దుర్వినియోగంపై లోతైన విచారణ జరిపించాలని పిటిషర్‌

Most from this category