News


రూ.40,000పైకి పసిడి

Friday 24th January 2020
Markets_main1579848460.png-31163


 శుక్రవారం బంగారం ధర మరోసారి స్వల్పంగా పెరిగి రూ.40,000 పైకి చేరింది. దేశీయ ఎంసీఎక్స్‌లో  ఉదయం 11.30 గంటలకు  10 గ్రాముల పసిడి ధర  రూ.40036.00 వద్ద ట్రేడ్‌ అవుతోంది. కాగా అంతర్జాతీయ మార్కెట్‌లో కరోనా వైరస్‌ ప్రభావంతో ఇన్వెస్టర్లు రక్షణాత్మక పసిడి కొనుగోలుపై దృష్టి పెట్టడంతో క్రితం రోజుతో పోలిస్తే పసిడి  ధర ఐదు డాలర్లు పెరగడంతో ఔన్స్‌ బంగారం ధర 15,60.35 వద్ద ట్రేడ్‌ అవుతోంది.  చైనాలో హల్‌ చల్‌ చేస్తోన్న కరోనా వైరస్‌ ఇంటర్నేషనల్‌ ఎమర్జెన్సీ కాదని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) వెల్లడించడంతో శుక్రవారం బంగారం, వెండి ధరలు స్వల్పంగా పడిపోయే అవకాశాలు ఉన్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. 
 



You may be interested

ఇన్ఫీ పద్దులపై ఫోరెన్సిక్‌ ఆడిట్‌?

Friday 24th January 2020

కోరనున్న సెబి ఇన్ఫోసిస్‌ ఆడిట్‌ పుస్తకాలపై ఫోరెన్సిక్‌ ఆడిట్‌ నిర్వహించాలని సెబి ఆదేశించనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇన్ఫోసిస్‌ టాప్‌ మేనేజ్‌మెంట్‌ పద్దు పుస్తకాల్లో అవకతవకలకు పాల్పడ్డారని గతేడాది కొందరు విజిల్‌బ్లోయర్లు సెబికి, యూఎస్‌ సెక్‌కు ఫిర్యాదులు చేసిన సంగతి తెలిసిందే. వీటిపై విచారణ జరుపుతున్న సెబి, కంపెనీ ఆడిట్‌పుస్తకాలపై ఫోరెన్సిక్‌ ఆడిట్‌కు మొగ్గు చూపుతుందని తెలిసింది. త్వరలో ఈమేరకు ఇన్ఫోసిస్‌కు సెబి ఆదేశాలు జారీ చేయవచ్చని, ఆరోపణల పూర్తి స్వరూపం,

ఎల్‌ఐసీ ఈటీఎఫ్‌కి డీహెచ్‌ఎఫ్‌ఎల్‌, అనిల్‌ అంబానీ గ్రూప్‌ దెబ్బ..!

Friday 24th January 2020

దేశంలో అతిపెద్ద రుణ పత్రాల కొనుగోలుదారుగా పేరుపొందిన లైఫ్ ఇన్సూరెన్స్ కార్పోరేషన్‌ వద్దనున్న రూ.11,000 కోట్ల విలువైన బాండ్లు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి అర్థభాగంలో డిఫాల్ట్‌ అయ్యాయి. ఎల్‌ఐసీ నుంచి భారీ మొత్తంలో రుణాలు తీసుకున్న హెచ్‌ఎఫ్‌ఎల్‌, రిలయన్స్‌ క్యాపిటల్‌, రిలయన్స్‌ హోమ్స్‌ ఫైనాన్స్‌, సింటెక్స్‌ ఇండస్ట్రీస్‌కు చెందిన కంపెనీల కమర్షియల్‌ పేపర్లను రేటింగ్‌ సంస్థలు డౌన్‌గ్రేడ్‌ చేయడం ఇందుకు కారణమైంది. లైఫ్, పెన్షన్ ఫండ్ల నుంచి డిహెచ్ఎఫ్ఎల్లో రూ .6,500 కోట్ల పెట్టుబడులు పెట్టడానికి ఎల్ఐసి కేటాయింపులు

Most from this category