News


పసిడి 10 డాలర్ల ర్యాలీ

Friday 9th August 2019
Markets_main1565326092.png-27653

ప్రపంచమార్కెట్లో పసిడి ధర పరుగులు ఆగడం లేదు. ఆసియాలో శుక్రవారం మరో 10డాలర్లు ర్యాలీ చేసింది. నేటి ఉదయం సెషన్‌లో ఔన్స్‌ పసిడి ధర 10డాలర్లు(0.65శాతం) పెరిగి (0.65శాతం) 1,519.90డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. ప్రస్తుత పరిణామాలు ఈక్విటీ మార్కెట్లకు ప్రతికూలంగా ఉండటంతో పసిడి ధరలకు కలిసొస్తుంది. వాణిజ్య ఉద్రిక్తతలు పెరుగున్న నేపథ్యంలో ఆయా ఆయాదేశాలు వడ్డీరేట్ల తగ్గింపునకు మొగ్గుచూపడం పసిడి డిమాండ్‌ను పెంచుతుందని మార్కెట్‌ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఆర్థిక వృద్ధి ఆందోళనలు, వాణిజ్య యుద్ధ ఉద్రికత్తలు, పలు దేశాల సెంట్రల్‌ బ్యాంకు వడ్డీరేట్ల తగ్గింపు తదితర కారణాలతో ఈ ఏడాదిలో పసిడి ధర 17శాతం ర్యాలీ చేసింది. అలాగే వారంలో రోజుల్లో 100డాలర్లపైకి లాభపడింది. 
దేశీయంగా రూ.38000 దిగువన ట్రేడింగ్‌:-
ఇక దేశీయంగా ఎంసీఎక్స్‌ మార్కెట్లో పసిడి ఫ్యూచర్ల ధర రూ.38000 స్థాయికి దిగివచ్చింది. నిన్నటి ట్రేడింగ్‌లో గరిష్టస్థాయిల వద్ద పసిడిలో లాభాల స్వీకరణకు చోటు చేసుకోవడంతో అక్టోబర్‌ కాంట్రాక్టు 10గ్రాముల పసిడి ధర రూ.461లు(1.21శాతం నష్టపోయి రూ.38000 దిగువను రూ.37, 757 వద్ద స్థిరపడింది. నేడు అంతర్జాతీయంగా పసిడి ఫ్యూచర్లు ర్యాలీ చేస్తున్న నేపథ్యంలో దేశీయంగా ఉదయం ట్రేడింగ్‌లో 10గ్రాముల పసిడి ధర రూ.165.00 స్వల్పంగా రూ.37922.00 వద్ద ట్రేడ్‌ అవుతోంది.



You may be interested

కియా సెల్టో్స్ వచ్చేసింది..

Friday 9th August 2019

అనంతపురం ప్లాంటులో తొలి కారు ఆవిష్కరణ మూడు వారాల్లోనే 23వేల పైచిలుకు ప్రీ–బుకింగ్స్‌ ఆగస్టు 22 నుంచి డెలివరీలు భారత్‌లో 2 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు అనంతపురం ప్లాంటుపై 1.1 బిలియన్‌ డాలర్లు 11,000 మందికి ఉపాధి అవకాశాలు సాక్షి ప్రతినిధి, అనంతపురం: - దక్షిణ కొరియా ఆటోమొబైల్‌ దిగ్గజం కియా మోటార్స్‌ తాజాగా భారత్‌లో తమ తొలి కారు 'సెల్టోస్‌'ను ఆవిష్కరించింది. అనంతపురం ప్లాంటులో గురువారం జరిగిన ఆవిష్కరణ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్‌ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన

బ్యాంక్‌ నిఫ్టీ జోరు

Friday 9th August 2019

ప్రభుత్వం, విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లను (ఎఫ్‌పీఐ) అధిక సర్‌చార్జి నుంచి మినహాయించడం, మూడేళ్లు దాటిన హొల్డింగ్స్‌పై దీర్ఘకాల మూలధన లాభాలపై(ఎల్‌టీసీజీ) విధించే ట్యాక్స్‌ ను తొలగించడం, డివిడెండ్‌ డిస్ట్రీబ్యూషన్‌ ట్యాక్స్‌ను(డీడీటీ) సులభతరం చేయడం వంటి మార్కెట్‌ ప్రెండ్లీ నిర్ణయాలను తీసుకునే అవకాశం ఉండడంతో శుక్రవారం మార్కెట్లు పాజిటివ్‌గా కదులుతున్నాయి. నిఫ్టీ బ్యాంక్‌ ఇం‍డెక్స్‌ ఉదయం 9.57 సమయానికి 212.05 పాయింట్లు లాభపడి 28343.60 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ బ్యాంక్‌

Most from this category