News


మరో రూ.1800 తగ్గిన బంగారం!

Saturday 14th March 2020
Markets_main1584161388.png-32477

గత కొన్నివారాలుగా గరిష్ట స్థాయిలో పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు శుక్రవారం ఒక్కసారిగా పడిపోయాయి. కోవిడ్‌-19 ప్రభావంతో రక్షణాత్మక పెట్టుబడులవైపు పరుగులు పెట్టిన ఇన్వెస్టర్లు, తాజాగా ఆర్థిక అనిశ్చితి నెలకొనడంతో తమ పెట్టుబడులను సురక్షిత సాధనాల నుంచి  ఈక్విటీల్లోకి మళ్లించడంతో బంగారం ధర శుక్రవారం సాయంత్రం ఎంసీఎక్స్‌ ట్రేడింగ్‌లో రూ.1800 తగ్గి, 10 గ్రాముల బంగారం రూ.40.348.00 వద్ద ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్లోనూ 61.20 డాలర్లు పతనమై ఔన్స్‌ బంగారం 1,529.10 డాలర్ల వద్ద ముగిసింది.

ఇంకా పడిపోయే అవకాశం..
సాధారణంగా బంగారాన్ని సురక్షితమైన ఇన్వెస్ట్‌మెంట్‌ సాధనంగా భావిస్తారు. అయితే గ్లోబల్‌ మార్కెట్ల పతనం కారణంగా పసిడిపై కూడా ప్రతికూల ప్రభావం పడడంతో బంగారం ధరలు దిగివస్తున్నాయి. కరోనా వైరస్‌ దెబ్బకి ప్రపంచంలోని సెంట్రల్‌ బ్యాంకులు తీసుకుంటున్న చర్యల వల్ల ప్రయోజనం ఉండకపోవచ్చనే అంచనాలు నెలకొన్నాయి.దీంతో ఆర్థిక మాంద్యం సంభవించవచ్చనే భయాలు మొదలయ్యాయి.అందువల్ల అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర మరింత పడిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. 2011 నుంచి వారంలో బంగారం ధర ఈ స్థాయిలో తగ్గడం ఇదే తొలిసారి. ఇటీవలే అంతర్జాతీ మార్కెట్‌లో బంగారం ధర ఏడేళ్ల గరిష్ట స్థాయికి చేరిన విషయం తెలిసిందే.

(శుక్రవారం బంగారం(స్పాట్‌) ముగింపు ధరల కోసం ఆయా నగరాల గుర్తులపై క్లిక్‌ చేయగలరు)


 



You may be interested

ఫ్లాష్‌... ఫ్లాష్‌... పెట్రోల్‌, డీజిల్‌ పై స్పెషల్‌ ఎక్సైజ్‌ సుంకం పెంపు

Saturday 14th March 2020

భారత్‌లో మరోసారి పెట్రోల్‌ డీజిల్‌ ధరలు పెరిగాయి. అంతర్జాతీయంగా క్రూడ్‌ ధరలు తగ్గుతుండడంతో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు భాగా తగ్గుతాయని భావిస్తున్న వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం భారీ షాకిచ్చింది. పెట్రోల్‌ డీజిల్‌పై ఎక్సైజ్‌ సుంకాన్ని పెంచూతు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం పెట్రోల్‌పై స్పెషల్‌ ఎక్సైజ్‌ సుంకం రూ.2 పెరుగుదలతో లీటరుకు రూ.8కు, డీజిల్‌పై రూ.4కు పెంచింది. అలాగే పెట్రోల్‌ డీజిల్‌పై రోడ్‌ సెస్‌ రూ.1 పెరుగుదలతో రూ.10 కు  చేరింది.

యూఎస్‌లో ఎమర్జెన్సీ- స్టాక్స్‌ రికార్డ్‌

Saturday 14th March 2020

10 శాతం దూసుకెళ్లిన డోజోన్స్‌ మార్కెట్‌ చరిత్రలో కొత్త రికార్డ్‌ 2008 తదుపరి అతిపెద్ద ర్యాలీ గత వారం నికరంగా భారీ నష్టాలు ఇండియన్‌ ఏడీఆర్‌లు జూమ్‌ వారాంతాన అమెరికా స్టాక్‌ మార్కెట్లు ఒక్కసారిగా హైజంప్‌ చేశాయి. కోవిడ్‌-19 విస్తృతిని అడ్డుకోవడం కోసం ప్రెసిడెంట్‌ ట్రంప్‌ జాతీయ అత్యయిక పరిస్థితి(నేషనల్‌ ఎమర్జెన్సీ)ని ప్రకటించారు. ఈ నేపథ్యంలో స్టాక్‌ మార్కెట్లు డ్రమటిక్‌గా కోలుకున్నాయి. రెండు రోజుల భారీ పతనాల నుంచి బయటపడిన మార్కెట్లు రివ్వున పైకెగశాయి. డోజోన్స్‌ 1985

Most from this category