News


రూ.43,000 పైకి బంగారం!

Wednesday 4th March 2020
Markets_main1583295824.png-32260

బుధవారం ఒక్కసారిగా బంగారం రూ.1000కిపైగా పెరిగింది. కోవిడ్‌-19 చైనాతోపాటు వివిధ దేశాలను వణికిస్తుండడంతో మార్కెట్లు పతనమవుతున్న సంగతి తెలిసిందే. అయితే కోవిడ్‌-19 ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపకుండా ఉండేందుకు అమెరికా ఫెడ్‌ రేటును తగ్గించడంతో ఒక్కసారిగా అమెరికా మార్కెట్లు పడిపోయాయి. దీంతో మరోసారి బంగారం ధర భారీగా పెరిగింది. ఇండియాలో కూడా కరోనా కేసులు నమోదవుతుండడం, రూపాయి బలహీనపడడంతో బుధవారం దేశీయ మల్టీకమోడిటీ మార్కెట్‌లో నిన్నటితో పోలిస్తే ఒక్కరోజే రూ.1,100 పెరిగి 10 గ్రాముల బంగారం 43,397 వద్ద ట్రేడ్‌ అవుతోంది.అమెరికా ఫెడ్‌ ఎమర్జెన్సీగా వడ్డీరేటును అరశాతం తగ్గించడంతో అంతర్జాతీయ మార్కెట్‌లో నిన్నటితో పోలిస్తే 50డాలర్ల పెరుగుదలతో ఔన్స్‌ బంగారం ధర 1,640.00 వద్ద ట్రేడ్‌ అవుతోంది. 

(మంగళవారం బంగారం(స్పాట్‌) ముగింపు ధరల కోసం ఆయా నగరాల గుర్తులపై క్లిక్‌ చేయగలరు)


 

 



You may be interested

మహిళలకు రూ. 17వేల కోట్ల రుణాలు

Wednesday 4th March 2020

స్టాండప్ ఇండియా స్కీమ్ కింద మంజూరు న్యూఢిల్లీ: 'స్టాండప్ ఇండియా' పథకం కింద రుణాలు పొందిన వారిలో దాదాపు 81 శాతం మంది మహిళలు ఉన్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది. నాలుగేళ్ల వ్యవధిలో వారు రూ. 16,712 కోట్ల రుణాలు పొందినట్లు వివరించింది. "2020 ఫిబ‍్రవరి 17 నాటికి స్టాండప్ ఇండియా స్కీమ్‌ కింద ఖాతాదారుల్లో 81 శాతం మంది మహిళలు ఉన్నారు. 73,155 ఖాతాలు మహిళల పేరిట ఉన్నాయి.

ఫెడ్‌ రేట్‌ కట్‌- ఆగని డోజోన్స్‌ పతనం

Wednesday 4th March 2020

కరోనా వైరస్‌ ఎఫెక్ట్‌  ఫండ్స్‌ రేటులో 0.5 శాతం కోత పెట్టిన ఫెడరల్‌ రిజర్వ్‌ అయినా 3 శాతం పతనమైన అమెరికా స్టాక్‌ మార్కెట్లు సరికొత్త కనిష్టానికి జారిన 10 ఏళ్ల ట్రెజరీ బాండ్ల ఈల్డ్స్‌ టెక్‌ దిగ్గజాలు యాపిల్‌ ఇంక్‌, మైక్రోసాఫ్ట్‌ కుదేల్‌ అమెరికా రేటింగ్‌ను తగ్గించిన ఎస్‌అండ్‌పీ ఇటీవల ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్‌ ధాటికి తాజాగా అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ సైతం దిగివచ్చింది. ఈ నెల 17-18న పాలసీ సమావేశాలు నిర్వహించనున్నప్పటికీ అమెరికా

Most from this category