News


భారీగా తగ్గిన పసిడి ధర!

Tuesday 25th February 2020
Markets_main1582604499.png-32065

గత ఐదురోజులుగా పెరుగుతూ వస్తున్న బంగారం ధర మంగళవారం ఒక్కసారిగా రూ.584 తగ్గింది. కొద్ది రోజులుగా 10 గ్రాముల పసిడిపై రూ.3000 వరకూ పెరిగి రూ.43,900 కు కూడా చేరింది. మంగళవారం 10 గంటల ప్రాంతంలో దేశీయ మల్టీ కమోడిటీ మార్కెట్‌లో రూ.581 తగ్గి 10 గ్రాముల పసిడి రూ.42,999.00 వద్ద ట్రేడ్‌ అవుతోంది.అంతర్జాతీయ మార్కెట్‌లో 18 డాలర్లు తగ్గి ఔన్స్‌ బంగారం ధర 1,659 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది.

(సోమవారం బంగారం(స్పాట్‌) ముగింపు ధరల కోసం ఆయా నగరాల గుర్తులపై క్లిక్‌ చేయగలరు)
 

 



You may be interested

ఈ కౌంటర్లవైపు విదేశీ ఇన్వెస్టర్ల చూపు

Tuesday 25th February 2020

ఇదీ జాబితా.. అశోక్‌ లేలాండ్‌, రైట్స్‌, సీజీ కన్జూమర్‌ టాటా స్టీల్‌, శ్రీ సిమెంట్స్‌, టాటా గ్లోబల్‌ గత ఆరు నెలలుగా అమ్మకాలకే కట్టుబడుతున్న విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) ఇటీవల కొనుగోళ్ల యూటర్న్‌ తీసుకుంటున్నారు. దీంతో ఈ ఆర్థిక సంవత్సరం(2019-20) మూడో త్రైమాసికంలో కొన్ని ఎంపిక చేసిన కౌంటర్లలో ఎఫ్‌పీఐల పెట్టుబడులు పెరిగాయి. క్యూ3(అక్టోబర్‌-డిసెంబర్‌)లో కంపెనీలు సాధించిన ప్రోత్సాహకర ఫలితాలు, ఇకపై టర్న్‌అరౌండ్‌ సాధించనున్న అంచనాలు వంటి అంశాలు ఎఫ్‌పీఐలను ఆకట్టుకుంటున్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు.

11850పైన నిఫ్టీ ప్రారంభం

Tuesday 25th February 2020

134 పాయింట్ల లాభంతో మొదలైన సెన్సెక్స్‌  భారీ పతనం నేపథ్యంలో షార్ట్‌ కవరింగ్‌ కలిసొచ్చిన క్రూడాయిల్‌ పతనం ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలో కరోనా వైరస్‌ వ్యాధి ప్రకంపనలతో నిన్నరాత్రి రోజున రెండు వారాల కనిష్టానికి పతమైన భారత మార్కెట్‌ మంగళవారం లాభంలో మొదలైంది. సెన్సెక్స్‌ 134 పాయింట్ల లాభంతో 40,497.72  వద్ద, నిఫ్టీ 48 పాయింట్లు పెరిగి 11,877.50 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. నిన్నటి రోజున భారీ పతనాన్ని చవిచూసిన ఈక్విటీ మార్కెట్లో నేడు

Most from this category