News


రూ.39,500 దిగువకు బంగారం

Tuesday 14th January 2020
Markets_main1578978868.png-30916

దేశీయంగా బంగారం ధర మంగళవారం రూ.39500 దిగువకు చేరుకుంది. అంతర్జాతీయంగా బంగారం ధరలు వారంరోజుల గరిష్టం నుంచి వెనక్కిరావడం, దేశీయ ఫారెక్స్‌మార్కెట్లో డాలర్‌ మారకంలో రూపాయి విలువ వరుసగా ఆరోరోజూ బలపడటంతో తదితర అంశాలు బంగారానికి డిమాండ్‌ను తగ్గించాయి. నిన్నరాత్రి ఎంసీఎక్స్‌ మార్కెట్‌ ముగింపు సరికి రూ.350లు నష్టపోయి రూ.39546 వద్ద స్థిరపడింది. నేడు రూ.39,500 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఉదయం ట్రేడింగ్‌లో 10గ్రాముల పసిడి ధర నిన్నటి ముగింపు తో పోలిస్తే రూ.232.00లు నష్టపోయి రూ.39314.00 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ప్రపంచ ఈక్విటీల ర్యాలీ, రూపాయి బలపడుతున్న నేపథ్యంలో బంగారం ధర స్వల్పకాలానికి ఒడిదుడుకులకు లోనయ్యే అవకాశం ఉందని బులియన్‌ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కాబట్టి ట్రేడర్లు రూ.39000 స్థాయిని లక్ష్యంగా పెట్టుకుని షార్ట్‌ చేసుకోవడం ఉత్తమని సలహానిస్తున్నారు.
 అంతర్జాతీయంగా వారంరోజుల గరిష్టం నుంచి పతనం:-
అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర వారం రోజుల గరిష్టం నుంచి పతనమయ్యాయి. రెండు రోజుల్లో అమెరికా-చైనా మధ్య వాణిజ్య ఒప్పందం కుదరనుండడం, ఈ తరుణంలో చైనాపై వేసిన 'కరెన్సీ మ్యానిపులేటర్‌' ముద్రను అమెరికా తొలగించడంతో ఇన్వెస్టర్లు ఈక్విటీల్లో పెట్టుబడులకు మొగ్గచూపుతున్నారు. ఫలితంగా నేడు ఆసియాలో ట్రేడింగ్‌లో  ఔన్స్‌ బంగారం ధర ఏకంగా 14డాలర్ల క్షీణించింది. నేటి ఉదయం ఆసియా ట్రేడింగ్‌లో ఔన్స్‌ బంగారం ధర 1,536.65 డాలర్ల వద్ద కదలాడుతుంది. నిన్నరాత్రి అమెరికా మార్కెట్లో యెన్‌ మారకంలో డాలర్‌ బలపడం, యూఎస్‌ బాండ్‌ ఈల్డ్‌ బలపడటం పెరగడం తదితర కారణాలతో 9.50 డాలర్ల నష్టంతో 1,550.60 వద్ద స్థిరపడింది. 



You may be interested

అమ్మకాల ఒత్తిడిలో పీఎస్‌యూ బ్యాంక్‌ షేర్లు

Tuesday 14th January 2020

అరశాతానికి పైగా నష్టపోయి నిఫ్టీ పీఎస్‌యూ ఇండెక్స్‌ ప్రభుత్వరంగ బ్యాంకింగ్‌ షేర్లు బుధవారం ఉదయం ట్రేడింగ్‌ సెషన్‌లో అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కోంటున్నాయి. ఫలితంగా ఎన్‌ఎస్‌లోని పీఎస్‌యూ బ్యాంక్‌ ఇండెక్స్‌ అరశాతానికి పైగా నష్టపోయింది. నేడు ఈ ఇండెక్స్‌ 2,467.75 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. బ్యాంకింగ్‌ రంగ షేర్ల అమ్మకాల్లో భాగంగా ప్రభుత్వరంగ బ్యాంక్‌ షేర్లకు అమ్మకాల సెగ తగిలింది. ఫలితంగా ఒకదశలో అరశాతం నష్టపోయి 2,456.05 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని నమోదు

యస్‌ బ్యాంక్‌ డీలా- ఐఆర్‌సీటీసీ అప్‌

Tuesday 14th January 2020

యస్‌ బ్యాంక్‌ షేరు 7 శాతం పతనం 4 శాతం జంప్‌చేసిన ఐఆర్‌సీటీసీ లిమిటెడ్‌ ఇటీవల సరికొత్త గరిష్టాలను తాకుతున్న దేశీ స్టాక్‌ మార్కెట్లు నేటి(14న) ట్రేడింగ్‌లో ఒడిదొడులకులను ఎదుర్కొంటున్నాయి. కొద్ది రోజులుగా ర్యాలీ చేయడంతో స్వల్ప హెచ్చుతగ్గుల మధ్య కన్సాలిడేట్‌ అవుతున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. ట్రేడర్లు లాభాల స్వీకరణకు ప్రాధాన్యమివ్వడం ప్రభావం చూపుతున్నట్లు తెలియజేశారు. ఉదయం 10.20 ప్రాంతంలో సెన్సెక్స్‌ 15 పాయింట్లు బలపడి 41,874కు చేరగా.. నిఫ్టీ 8 పాయింట్లు

Most from this category