News


పసిడికి ఆర్థిక మాంద్య ఆందోళన అండ

Thursday 29th August 2019
Markets_main1567057750.png-28083

ఆర్థిక మాంద్య భయాల నేపథ్యంలో గురువారం పసిడి ధర తిరిగి లాభాల బాట పట్టింది. వడ్డీరేట్ల తగ్గింపుపై ప్రపంచ బ్యాంకుల సానుకుల వైఖరి, చైనా అమెరికా దేశాల వాణిజ్య చర్చలు తదితర అంశాలు పసిడి ర్యాలీకి మద్దతుగా నిలుస్తున్నాయి. ఫలితంగా ఆసియా ట్రేడింగ్‌లో ఔన్స్‌ పసిడి ధర 3డాలర్లు పెరిగి 1,551.35డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. ట్రేడ్‌వార్‌పై మరింత సమాచారం కోసం ట్రేడర్లు ఎదురుచూస్తున్నారు. ట్రేడ్‌వార్‌ పసిడి ర్యాలీకి దిశానిర్దేశం చేస్తుంది.ట్రేడ్‌వార్‌లో భాగంగా అమెరికాకు దిగుమతయ్యే 300 బిలియన్‌ డాలర్ల చైనా ఉత్పత్తులపై ట్రంప్‌ అదనంగా 5శాతం పన్ను విధింపు ఆదివారం(సెప్టెంబర్‌1) నుంచి అమల్లోకి రానుంది. బ్రెగ్జిట్‌ ప్రక్రియకు ముందు బ్రిటన్‌ పార్లమెంట్‌ను నెలరోజు పాటు సస్పెండ్‌ చేయాలని ఆ దేశ ప్రధానిక బోరీస్‌ జాన్సస్‌ నిర్ణయం తీసుకోవడంతో ఈక్విటీ మార్కెట్లో అనిశ్చితి మరింత పెరిగింది. రిసెల్యూషన్‌ అనేది వృద్ధికి సానుకూలంగా అదే సమయంలో పసిడి ర్యాలీకి ఆంటకంగా ఉంటుందని సీఎంసీ మార్కెట్‌ స్ట్రాటజిస్ట్‌ చీఫ్‌ మైకెల్‌ అభిప్రాయపడ్డారు. వచ్చేనెలలో జరిగే పాలసీ సమావేశాల్లో యూఎస్‌ ఫెడరల్‌ రిజర్వ్‌ బ్యాంక్‌, యూరోపియన్‌ సెంట్రల్‌ బ్యాంక్‌ వడ్డీరేట్ల కోత ఉంటుందని ఇన్వెస్టర్లు ఇప్పటికే అంచనాకు వచ్చారు మార్కెట్‌ సెంటిమెంట్‌ ఇలాగే బలహీనంగా కొనసాగితే జపాన్‌ కేంద్ర బ్యాంకు కూడా వడ్డీరేట్ల రేట్లపై కోత విధింపు ఉండవచ్చనే అశావహనాన్ని ఇన్వెస్టర్లు వ్యక్తం చేస్తున్నారు. 
దేశీయంగానూ లాభాల్లోనే:- 
అంతర్జాతీయ ట్రెండ్‌కు అనుగుణంగా దేశీయ ఈక్విటీ మార్కెట్లో పసిడి ధర లాభాల్లో ట్రేడ్‌ అవుతోంది. దేశీయ ఈక్విటీ మార్కెట్లు నష్టాల ట్రేడింగ్‌, రూపాయి బలహీనత తదితర అంశాలు పసిడికి మద్దతినిస్తున్నాయి. నేడు ఎంసీఎక్స్‌ మార్కెట్లో అక్టోబర్‌ కాంటాక్డు 10గ్రాముల పసిడి ధర క్రితం గతవారం ముగింపు ధర(రూ.39165)తో పోలిస్తే రూ.160.00 ల స్వల్ప నష్టంతో రూ.39325.00 వద్ద ట్రేడ్‌ అవుతోంది. You may be interested

ఎఫ్‌డీఐ 2.0

Thursday 29th August 2019

విదేశీ పెట్టుబడులకు మరో విడత రెడ్‌కార్పెట్‌ బొగ్గు మైనింగ్‌, కాంట్రాక్టు తయారీలో నూరు శాతం ఎఫ్‌డీఐలు సింగిల్‌ బ్రాండ్‌ రిటైలర్లకు స్థానిక సమీకరణలో వెసులుబాటు డిజిటల్‌ మీడియాలోకి 26 శాతం ఎఫ్‌డీఐలకు అనుమతి పంచదార రైతులకు పూర్తి మద్దతు కేంద్ర కేబినెట్‌ నిర్ణయాలు న్యూఢిల్లీ: నీరసించిన ఆర్థిక వ్యవస్థకు ఉత్తేజాన్నిచ్చేందుకు ప్రభుత్వం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు (ఎఫ్‌డీఐ) మరోసారి ద్వారాలు తెరిచింది. బొగ్గు మైనింగ్‌, కాంట్రాక్టు తయారీ రంగాల్లోకి నూరు శాతం ఎఫ్‌డీఐలను ప్రభుత్వం అనుమతి అవసరం లేని

స్వల్పకాలానికి స్టాక్‌ సిఫార్సులు

Thursday 29th August 2019

నిపుణులు స్వల్పకాలానికి సిఫార్సులు చేస్తున్న స్టాకులు: సుదర్శన్‌ సుఖాని, ఎస్‌2ఎనలటిక్స్‌.కామ్‌ రికమండేషన్లు నెస్లే ఇండియా: కొనచ్చు; స్టాప్‌ లాస్‌: రూ. 12,100; టార్గెట్‌ ధర: రూ. 13,200 టాటా కన్సల్టెన్సి సర్వీసెస్‌(టీసీఎస్‌): కొనచ్చు; స్టాప్‌ లాస్‌: రూ. 2,200; టార్గెట్‌ ధర: రూ. 2,300 టాటా మోటర్స్‌: అమ్మొచ్చు; స్టాప్‌ లాస్‌: రూ. 121; టార్గెట్‌ ధర: రూ.109 టాటా స్టీల్‌: అమ్మొచ్చు; స్టాప్‌ లాస్‌: రూ. 341; టార్గెట్‌ ధర: రూ. 331 మితెష్‌ థక్కర్‌, మితెష్‌థక్కర్‌.కామ్‌

Most from this category