News


ట్రేడ్‌వార్‌ ఎఫెక్ట్‌ : పసిడి మరో 10డాలర్ల ర్యాలీ

Tuesday 3rd September 2019
Markets_main1567487749.png-28160

అగ్రరాజ్యాల మధ్య కొనసాగుతున్న వాణిజ్య యుద్ధం పసిడి ధరకు బాగా కలిసొస్తుంది. ప్రపంచమార్కెట్లోని పసిడి ధర నేటి ఆసియా ట్రేడింగ్‌లో 10డాలర్లు పెరిగింది. ఈ వారంలో పసిడికిది వరుసగా రెండోరోజూ లాభాల ర్యాలీ కావడం విశేషం. అయితే డాలర్‌ ఇండెక్స్‌ రెండేళ్ల గరిష్టాన్ని తాకడం పసిడి ర్యాలీకి కొద్దిమేర అడ్డుకుంటుంది. ఈ సెప్టెంబర్‌ 01 నుంచి చైనా దేశాల నుంచి దిగుమతి అవుతున్న టెలివిజన్లు, షూ లపై 15శాతం అదనపు పన్ను అమెరికా విధించింది. దీనికి ప్రతీకారంగా అమెరికా నుంచి దిగుమతయ్యే క్రూడాయిల్‌ ఇతర వస్తువులపై చైనా పన్నును విధించింది. ఇరు దేశాల మధ్య డిసెంబర్‌ నుంచి మరింత అదనపు పన్నులను విధించుకోనున్నాయి. ఈ నెలలో ప్రారంభం కావల్సిన వాణిజ్య చర్యల తేదీని ఖరారు చేయడానికి ఇరు దేశాల వాణిజ్య అధికారులు ఇంకా కష్టపడుతున్నారు. అంతర్జాతీయ అనిశ్చితిపై ఆందోళనలు, అగ్రరాజ్యాల మధ్య ఉన్నత స్థాయిలో చర్చలపై నెలకొన్న సందేహాల నేపథ్యంలో ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను సంక్షోభ సమయాల్లో రక్షణాత్మక సాధనమైన పసిడిపై వైపునకు మొగ్గుచూపతున్నారు. ఫలితంగా ఆసియా ట్రేడింగ్‌లో ఔన్స్‌ పసిడి ధర 4డాలర్లు పెరిగి 1,533.35 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. 
దేశీయంగా స్థిరంగానే:- 
అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధర భారీ లాభపడుతున్నప్పటికీ.., దేశీయంగా స్థిరంగా ట్రేడ్‌ అవుతోంది. నేడు ఎంసీఎక్స్‌ మార్కెట్లోని అక్టోబర్‌ కాంటాక్టు 10గ్రాముల పసిడి ధర క్రితం రాత్రి ముగింపు(రూ.39087)తో పోలిస్తే ఉదయం గం.10:30ని.లకు రూ.12ల స్వల్పలాభంతో 39099.00 వద్ద ట్రేడ్‌ అవుతోంది. నిన్న వినాయక చవితి సందర్భంగా ఎంసీఎక్స్‌ పసిడి ఫ్యూచర్‌ ట్రేడింగ్‌ సాయంత్రం నుంచి ప్రారంభంది. ట్రేడింగ్‌ ముగిసే సరికి రూ.431లు లాభపడి రూ.39087 వద్ద స్థిరపడింది.

 



You may be interested

నష్టాల్లో ప్రతిపాదిత విలీన బ్యాంకింగ్‌ షేర్లు

Tuesday 3rd September 2019

బ్యాంకింగ్‌ వ్యవస్థను చక్కదిద్దే ప్రక్రియలో భాగంగా కేంద్రం ప్రభుత్వ రంగ బ్యాంకుల మెగా విలీనానికి తెరతీసింది. మొత్తం 10బ్యాంకుల విలీనం చేసి 4బ్యాంకులకు పరిమితం చేయాలని నిర్ణయించింది. తాజా విలీనంతో పీఎస్‌బీల సంఖ్య 12కు పరిమితం కానుంది. విలీనం అవుతున్న బ్యాంకుల్లో కొన్నింటికి తగినంత మూలధనం లేకపోవడం, విలీనం అనంతరం మొండిబకాయిలు మరింత పెరగవచ్చనే భయాలు పెరిగాయి. ఈ నేపథ్యంలో మంగళవారం ట్రేడింగ్‌లో పీఎన్‌బీ రంగ షేర్లు భారీగా క్షీణించాయి.

తగ్గిన దక్షిణ కొరియా వృద్ధి..నష్టాల్లో చమురు

Tuesday 3rd September 2019

యుఎస్‌-చైనా ట్రేడ్‌వార్‌లో భాగంగా ఇరు దేశాలు విధించుకున్న తాజా సుంకాల సెప్టెంబర్‌ 1 నుంచి అమలులోకి రావడంతో ట్రేడ్‌ వార్‌ భయాలు పెరిగాయి. అంతేకాకుండా ఎగుమతులు తగ్గడంతో దక్షిణ కొరియా రెండవ త్రైమాసికపు వృద్ధి మందగించించింది. ఫలితంగా మంగళవారం ట్రేడింగ్‌లో చమురు ధరలు తగ్గాయి. బ్రెంట్‌ క్రూడ్‌ 7 సెంట్లు తగ్గి బారెల్‌ 58.59 డాలర్లకు, డబ్యూటీఐ క్రూడ్‌ 32 సెంట్లు తగ్గి బారెల్‌ 54.78 డాలర్లకు పడిపోయాయి.  చైనా

Most from this category