STOCKS

News


కొనసాగుతున్న బ్రెగ్జిట్‌ అనిశ్చితి : 6 డాలర్లు పెరిగిన పసిడి

Wednesday 23rd October 2019
Markets_main1571808943.png-29078

యూరోజోన్‌లో కొనసాగున్న బ్రెగ్జిట్‌ అనిశ్చితి కారణంగా బుధవారం పసిడి ఫ్యూచర్లకు డిమాండ్‌ నెలకొంది. ఆసియాలో ఉదయం సెషన్‌లో ఔన్స్‌ పసిడి ధర 6డాలర్లు పెరిగి 1,493.55డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. బ్రెగ్జిట్‌కు సంబంధించిన బిల్లుకు బ్రిటన్‌ శాసనసభ్యులు ఓటువేశారు. అయితే మూడు రోజుల్లోగా ఆమోదించాలన్న ప్రధాని బోరిస్‌ జాన్సస్‌ టైమ్‌ టేబిల్‌ను తిరస్కరించారు. అనుకున్న గడువు అక్టోబర్‌ 31న లోగా బిట్లు ఆమోదం కాకపోతే, బ్రెగ్జిట్‌ బిల్లు రద్దు చేసుకుని, క్రిస్మస్‌లోగా ఎన్నికలకు వెళ్లాల్సి ఉంటుందని జాన్సస్‌ హెచ్చరించారు. మరోవైపు బ్రెగ్జిట్‌ ప్రక్రియ సజావుగా పూర్తయ్యేందుకు తమ పరిధిలో చేయాల్సిందంతా చేశామని యూరోపియన్‌ కమిషన్‌ అధ్యక్షుడు జీన్‌క్లాడ్‌ జంకర్‌ తెలిపారు. యూరోజోన్‌ నెలకొన్న ఈ రాజకీయ అస్థిరతతో నేటి ట్రేడింగ్‌లో ఇన్వెస్టర్లు రక్షణాత్మకంగా పసిడి ఫ్యూచర్ల వైపు మొగ్గుచూపారు. నేడు పసిడి ధర 1,496-1,500డాలర్ల శ్రేణిని పరీక్షించే అవకాశం ఉందని, 1484 డాలర్ల వద్ద కీలక మద్దతు స్థాయిని ఏర్పాటు చేసుందని బులియన్‌ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. నిన్నరాత్రి అమెరికా మార్కెట్లు నష్టాల ముగింపు నేపథ్యంలో పసిడి ఫ్యూచర్లు అరశాతం డాలరు స్వల్ప పతనంతో 1,487.50 డాలర్ల వద్ద స్థిరపడింది. 
దేశీయ మార్కెట్లో రూ.38000 పైకి:- 
ఇక దేశీయ ఫారెక్స్‌ మార్కెట్లో పసిడి ఫ్యూచర్లు మూడు రోజుల వరుస పతనం తరువాత లాభాల బాట పట్టాయి. అంతర్జాతీయంగా పసిడి ఫ్యూచర్ల డిమాండ్‌ పెరగడం, ఫారెక్స్‌ మార్కెట్లో రూపాయి ఫ్లాట్‌గా ప్రారంభం కావడంతో ఉదయం ట్రేడింగ్‌ సెషన్‌లో డిసెంబర్‌ కాంటాక్టు 10గ్రాముల పసిడి ధర రూ.38000పై రూ.150ల లాభంతో రూ.38030.00 వద్ద కదలాడుతుంది. ఇక పసిడి ఫ్యూచర్లు రూ.38,000-38,050 స్థాయిని పరీక్షించే అవకాశం ఉంది. రూ.37,680 వద్ద కీలక మద్దతు ధర ఏర్పాటైంది. అంతర్జాతీయ ట్రెండ్‌కు అనుగుణంగా నిన్న ఎంసీఎక్స్‌ మార్కెట్‌ ముగిసే సరికి పసిడి ధర రూ.10ల స్వల్ప నష్టంతో రూ.37,880 వద్ద స్థిరపడింది. 

బంగారం ధర ఏ నగరంలో ఎంత? నగరంపై క్లిక్‌ చేయండి...(మంగళవారంనాటి క్లోజింగ్‌ ధర)You may be interested

పీఎస్‌యూ బ్యాంక్‌ షేర్ల ర్యాలీ

Wednesday 23rd October 2019

గత కొన్ని నెలల నుంచి దిద్దుబాటుకు గురవుతున్న ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ షేర్లకు కనిష్ఠ స్థాయిల వద్ద కొనుగోలు మద్ధతు లభిస్తోంది. దీంతో పాటు ఈ వారంలో ఎస్‌బీఐ క్యూ2 ఫలితాలు వెలువడడనుండడంతో ఎస్‌బీఐ షేరు పాజిటివ్‌గా ట్రేడవుతోంది. ఫలితంగా బుధవారం సెషన్‌లో నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్‌ ఇండెక్స్‌​ ఉదయం 10.58 సమయానికి 1.54 శాతం లాభపడి 2,295.90 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. ఈ ఇండెక్స్‌లో ఇండియన్‌ బ్యాంక్‌ 4.24

ఇన్ఫీ టార్గెట్‌ తగ్గింపు... ఇప్పటికైతే లేదు!

Wednesday 23rd October 2019

బ్రోకరేజ్‌ల అభిప్రాయాలు విజిల్‌బ్లోయర్‌ దెబ్బతో ఇన్ఫోసిస్‌ షేరు భారీ నష్టాలు చవిచూసిన సంగతి తెలిసిందే. కంపెనీ టాప్‌మేనేజ్‌మెంట్‌పై వచ్చిన ఫిర్యాదుల పర్యవసానం ఎలా ఉంటుందోనని మదుపరులు ఆందోళన పడుతున్నారు. ఆరోపణలు నిజమని తేలితే షేరు డీరేటింగ్‌తో ఉండొచ్చని, విచారణ పూర్తయ్యేవరకు షేరుపై సందిగ్ధత కొనసాగుతుందని బ్రోకరేజ్‌లు చెబుతున్నాయి. టాప్‌మేనేజ్‌మెంట్‌లో ఎలాంటి మార్పులు సంభవించినా, లేదా విక్రయ వ్యూహాలు మార్చుకున్నా కంపెనీ వృద్దిపై నెగిటివ్‌ ప్రభావం ఉంటుందని హెచ్చరిస్తున్నాయి. అయితే కేవలం ఆరోపణల

Most from this category