News


స్థిరంగా పసిడి

Monday 23rd September 2019
Markets_main1569219975.png-28492

పసిడి ధర సోమవారం స్థిరంగా కదులుతుంది. నేడు ఔన్స్‌ పసిడి ధర 3డాలర్ల లాభంతో 1,527 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. అంతర్జాతీయ ఉద్రికత్తలు పసిడి ర్యాలీకి మద్దతినిస్తున్నాయి. అలాగే అమెరికా-చైనాల మధ్య వాణిజ్య చర్చలపై సరైన స్పష్టత కొరుకు ఎదురుచూస్తున్నారు. పసిడి ప్రస్తుతం మిశ్రమ జోన్‌లో ఉందని ఓసీబీసీ బ్యాంక్‌ ఆర్థికవేత్త హవాయి లీ అభిప్రాయపడ్డారు. సౌది అరేబియాలో ఉద్రిక్తతలు పెరగడం, వాణిజ్య చర్చల్లో భాగంగా గతవారాంతంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ చైనాతో పాక్షిక ఒప్పందాన్ని నిరాకరించడం లాంటి అంశాలతో రానున్న రోజుల్లో పసిడి మరింత మెరిసే అవకాశం ఉంది. రానున్న రోజుల్లో పసిడి ధర 1,480-1580 డాలర్ల రేంజ్‌లో కదలాడే అవకాశం ఉందని బులియన్‌ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
దేశీయ మార్కెట్లో రూ.100లు అప్‌:- 
అంతర్జాతీయ ట్రెండ్‌కు అనుగుణంగా దేశీయ బులియన్‌ మార్కెట్‌లో పసిడి ధర మెరుస్తుంది. ఎంసీఎక్స్‌ మార్కెట్‌లో అక్టోబర్‌ కాంటాక్టు 10గ్రాముల పసిడి ధర రూ.123లు లాభపడి రూ.37820.00 వద్ద ట్రేడ్‌ అవుతోంది. శుక్రవారం 10గ్రాముల పసిడి ధర రూ.11.00ల స్వల్పలాభంతో రూ.37697.00 వద్ద స్థిరపడిన సంగతి తెలిసిందే. అంతర్జాతీయ అనిశ్చితి వాతావరణం నుంచి పసిడికి మద్దతు లభించే అవకాశం ఉంది. రానున్న రోజుల్లో పసిడి ధర రూ.38,050 నిరోధాన్ని పరీక్షించే అవకాశం ఉందని ఇండియానివేశ్‌ కమోటిడీ ప్రైవేట్‌ లిమిటెడ్‌ డైరెక్టర్‌ మనోజ్‌ కుమార్‌ జైన్‌ అభిప్రాయపడ్డారు. 



You may be interested

బుల్‌ రన్‌..సెన్సెక్స్‌ 1237, నిఫ్టీ 384 పాయింట్లు అప్‌

Monday 23rd September 2019

‍ప్రభుత్వం దేశీయ కంపెనీలపై విధిస్తున్న కార్పోరేట్‌ ట్యాక్స్‌ను 30 శాతం నుంచి 22 శాతానికి తగ్గించడంతో దేశీయ ఈక్విటీ మార్కెట్‌లు భారీ స్థాయిలో లాభపడి ట్రేడవుతున్నాయి. గత సెషన్‌లో మొదలైన బుల్స్‌ ఆధిపత్యం సోమవారం ట్రేడింగ్‌లో కూడా స్పష్టంగా కనిపిస్తోంది. మధ్యాహ్నాం 12.15 సమయానికి దేశీయ బెంచ్‌మార్క్‌ సూచీలు నిఫ్టీ 50 384.20 పాయింట్లు లేదా 3.41 శాతం పెరిగి 11,658.40 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. అదేవిధంగా బీఎస్‌ఈ సెన్సెక్స్‌

లాభాల మార్కెట్లో ఐటీ షేర్ల డీలా..!

Monday 23rd September 2019

రూపాయి బలపడటంతో లాభాల మార్కెట్లో ఐటీ షేర్లు తీవ్ర నష్టాలను ఎదుర్కోంటున్నాయి. ఎన్‌ఎస్‌ఈలో ఐటీ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిప్టీ ఐటీ ఇండెక్స్‌ సోమవారం ఉదయం సెషన్‌లో దాదాపు 5శాతం నష్టపోయింది. నేడు నిఫ్టీ ఐటీ ఇండెక్స్‌ 15,611.80 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. డాలర్‌ మారకంలో రూపాయి విలువ నష్టంతో ప్రారంభమైనప్పటికీ.., తిరిగి లాభాల్లోకి మళ్లింది. ఫలితంగా డాలర్ల రూపాయి ఆదాయాలను ఆర్జించే ఐటీ కంపెనీల షేర్లు షేర్లు తీవ్ర

Most from this category