News


స్థిరంగా పసిడి ధర

Monday 17th June 2019
Markets_main1560752733.png-26346

ప్రపంచమార్కెట్లో పసిడి ధర సోమవారం స్థిరంగా ట్రేడ్‌ అవుతోంది. ఆసియాలో ఉదయం ట్రేడింగ్‌ సెషన్స్‌లో ఔన్స్‌ పసిడి ధర  1.35డాలరు స్వల్ప నష్టంతో 1,343.15 కదలాడుతోంది. ఇన్వెస్టర్లు రేపటి నుంచి ప్రారంభం కానున్న ఫెడ్‌ రిజర్వ్‌ సమావేశంలో​కీలక వడ్డీరేట్లపై ఫెడ్‌ నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నారు. అమెరికా మే నెల రిటైల్‌ గణాంకాలు అంచనాలకు మించి నమోదుకావడంతో పసిడి ధరను ప్రభావితం చేసే డాలర్‌ ఇండెక్స్‌ కనిష్టస్థాయిల రికవరిని సాధించింది. నేడు ఆరు ప్రధాన కరెన్సీ విలువల్లో డాలర్‌ ఇండెక్స్‌ 2వారాల గరిష్టస్థాయి 97.50ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇక ఫెడ్‌ వడ్డీరేట్ల తగ్గింపుతో యూఎస్‌ ట్రెజరీ ఈల్డ్‌ పెరిగింది. 
దేశీయంగానూ అక్కడక్కడే:-
ఇక దేశీయ మార్కెట్లో పసిడి ఫ్యూచర్లు ధర అక్కడక్కడే ట్రేడ్‌ అవుతోంది. నేడు ఎంసీఎక్స్‌ మార్కెట్లో 10గ్రాముల పసిడి ధర రూ.16.00లు స్వల్ప నష్టంతో రూ.33029.00ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఫారెక్స్‌మార్కెట్లో డాలర్‌ మారకంలో రూపాయి ఫ్లాట్‌ ట్రేడింగ్‌, దేశీయ ఈక్విటీ మార్కెట్ల నష్టాల ట్రేడింగ్‌ పసిడి ఫ్యూచర్ల ర్యాలీకి అవరోధంగా మారాయి. 



You may be interested

శ్రీరామ్‌ట్రాన్స్‌పోర్ట్‌ ఫైనాన్స్‌లో మొత్తం వాటా అమ్మేసిన పిరమల్‌

Monday 17th June 2019

 శ్రీరామ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ ఫైనాన్స్‌(ఎస్‌టీఎఫ్‌సీ)లోని తమ మొత్తం వాటాను పిరమల్‌ ఎంటర్‌ప్రైజెస్‌ రూ. 2,305కోట్లకు విక్రయించింది. ‘శ్రీరామ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ ఫైనాన్స్‌లోని తమ 9.96శాతం ప్రత్యక్ష పెట్టుబడులను స్టాక్‌ ఎక్సెంజ్‌ల ద్వారా థర్డ్‌పార్టీ ఇన్వెస్టర్ల్‌కు అమ్మేశాం’ అని పిరమల్‌ ఎంటర్‌ప్రైజెస్‌ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది. 2019 మార్చి 31 నాటికి పిరమల్‌ ఎంటర్‌ప్రైజస్‌ వద్ద 2.26కోట్ల  శ్రీరామ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ ఫైనాన్స్‌ షేర్లున్నాయి. సోమవారం ట్రేడింగ్‌ ప్రారంభంలో శ్రీరామ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ ఫైనాన్స్‌ షేరు విలువ

మోస్తరు రిస్క్‌... రాబడులు ఎక్కువ!

Monday 17th June 2019

ఎస్‌బీఐ ఈక్విటీ హైబ్రిడ్‌ ఫండ్‌ కాస్త అధిక రాబడుల కోసం మోస్తరు రిస్క్‌ తీసుకునే ఇన్వెస్టర్ల ముందున్న ఎంపికల్లో ఎస్‌బీఐ ఈక్విటీ హైబ్రిడ్‌ ఫండ్‌ కూడా ఒకటి. తమవద్దనున్న మిగులు నిల్వలను ఈ పథకంలో ఇన్వెస్ట్‌ చేసుకోవడం ద్వారా మెరుగైన రాబడులు సొంతం చేసుకునేందుకు అవకాశం ఉంది. ఇది అగ్రెస్సివ్‌ హైబ్రిడ్‌ ఈక్విటీ పథకం. అంటే 65 శాతం పెట్టుబడులను ఈక్విటీలకు కేటాయించి, మిగిలిన 35 శాతాన్ని డెట్‌లో ఇన్వెస్ట్‌ చేస్తుంది.

Most from this category