News


స్థిరంగా పసిడి

Thursday 25th July 2019
Markets_main1564029173.png-27297

అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధర గురువారం స్థిరంగా ట్రేడ్‌ అవుతోంది. అసియాలో ట్రేడింగ్‌లో ఔన్స్‌ పసిడి ధర 1.35డాలరు స్వల్ప నష్టంతో 1,422.25డాలరు వద్ద ట్రేడ్‌ అవుతోంది. పసిడి ధరకు వ్యతిరేక దిశలో ట్రేడయ్యే డాలర్‌ ఇండెక్స్‌ రెండు నెలల గరిష్టం వద్ద ట్రేడ్‌ అవుతుండటం పసిడి ఫ్యూచర్లపై ఒత్తిడిని పెంచుతోంది. పలు దేశాల రిజర్వ్‌ బ్యాంకులు కీలక వడ్డీరేట్లను ప్రకటించనున్న నేపథ్యంలో ట్రేడర్లు పసిడి ఫ్యూచర్లలో లాభాల స్వీకరణకు మొగ్గుచూపుతున్నారు. నేడు(జూలై 25)యూరోపియన్‌ సెంట్రల్‌ బ్యాంక్‌, వచ్చేవారంలో బుధ, గురువారాల్లో అమెరికా ఫెడ్‌రిజర్వ్‌ బ్యాంకు వడ్డీరేట్లపై తమ వైఖరిని ప్రకటించనున్నాయి. ‘‘గతమూడు రోజులుగా పసిడి ధరలు పరిమితి శ్రేణిలో కదలాడుతున్నాయి. మనీ మేనేజనర్లు కొంతమంది వడ్డీరేట్లపై రిజర్వ్‌ బ్యాంకుల వైఖరి కోసం, ఎదురుచూస్తుండగా, మరికొంత లాభాల స్వీకరణ పూనుకుంటున్నారు. ఓవరాల్‌గా చూస్తే ధీర్ఘకాలికానికి పసిడి ఇప్పటికి బుల్లిష్‌గానే ఉంది. అని బులియన్‌ విశ్లేషకులంటున్నారు. పశ్చిమాసియా దేశాల ఉద్రిక్తతలు, అమెరికా-చైనాల మధ్య వాణిజ్య యుద్ధం, వడ్డీరేట్లపై పలు దేశాల సెంట్రల్‌ రిజర్వ్‌ బ్యాంక్‌లు మెతకవైఖరి తదితర కారణాలతో పసిడి ధర ఈ ఏడాది కనిష్టస్థాయి(1,265.85) నుంచి 12శాతం (150డాలర్లు) లాభపడింది. 
దేశీయంగా స్వల్ప తగ్గుదల:-
ఇక దేశీయంగానూ పసిడి ధర స్వల్పంగా నష్టపోయింది. నేడు ఎంసీఎక్స్‌ మార్కెట్లో 10గ్రాముల పసిడి ఆగస్ట్‌ ఫ్యూచర్‌ కాంట్రాక్టు ధర రూ.72.00లు నష్టపోయి రూ.34955.00ల దిగువున రూ.34971 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఐదురోజుల వరుస పతనం తరువాత ఈక్విటీ మార్కెట్లకు కొనుగోళ్ల మద్దతు లభించడటం, డాలర్‌ మారకంలో రూపాయి బలపడటం తదితర అంశాలు పసిడి ధరకు ప్రతికూలాంశాలుగా మారాయి. నిన్న రాత్రి ఎంసీఎక్స్‌ మార్కెట్‌ ముగిసే సరికి 10గ్రాముల పసిడి ధర రూ.6 స్వల లాభంతో రూ.35,027ల వద్ద స్థిరపడింది.



You may be interested

ప్రభుత్వ తప్పుడు ఆర్థిక లోటు లెక్క?

Thursday 25th July 2019

 ఆర్థిక సంవత్సరం 2018 లో భారత ప్రభుత్వం ప్రకటించిన ఆర్థిక లోటు 3.46 శాతం కంటే కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్‌) ప్రకటించిన ఆర్థిక లోటు 5.85 శాతంగా ఉండడం చర్చనీయాంశంగా మారిందని ఎకనామిక్‌ టైమ్స్‌లో వార్త వచ్చింది. ఆర్థిక సంవత్సరం 2020 బడ్జెట్‌లో ప్రకటించిన ఆర్థిక లోటులో అదనపు బడ్జెట్‌ వనరులు (ఈబీఆర్‌) ప్రతిబింబిస్తాయా? అని 15 వ ఫైనాన్స్‌ కమిషన్‌కు జులై 8 న ఇచ్చిన

68.98 వద్ద రూపీ ప్రారంభం..

Thursday 25th July 2019

రూపీ డాలర్‌ మారకంలో 3 పైసలు బలహీనపడి గురువారం ట్రేడింగ్‌లో  68.98 వద్ద ప్రారంభమైంది. విదేశి పెట్టుబడుల ఔట్‌ ఫ్లోతో పాటు మేజర్‌ కరెన్సీలతో పోల్చితే డాలర్‌ బలపడడంతో గత కొన్ని సెషన్‌ల నుంచి రూపీ డాలర్‌ మారకంలో బలహీనపడుతోంది. గత సెషన్‌లో 4 పైసలు బలహీనపడి 68.95 వద్ద ముగిసింది. ఈ రోజు డాలర్‌ మారకంలో రూపీ 68.60-69.30 పరిధిలో కదలాడవచ్చని విశ్లేషకులు తెలిపారు. 

Most from this category