News


తగ్గుముఖం పట్టిన పసిడి

Thursday 27th June 2019
Markets_main1561614065.png-26608

చైనాతో వాణిజ్య యుద్ధ చర్చలపై అమెరికా సానుకూల అభిప్రాయాన్ని వ్యక్తం చేయడంతో గురువారం పసిడి ధర స్వల్పంగా తగ్గుముఖం పట్టింది. ఆసియాలో ట్రేడింగ్‌లో ఔన్స్‌ పసిడి ధర 7డాలర్లు నష్టపోయి 1,408 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. రేపటి నుంచి ప్రారంభమయ్యే జీ-20 సదస్సులో చైనా- అమెరికా దేశాధ్యక్షులు వాణిజ్య యుద్ధంపై చర్చించనున్నారు. ఈ కీలక పరిణామాణ నేపథ్యంలో నిన్న యూఎస్‌ ట్రెజరీ అధికారి స్టీవెన్‌ మాట్లాడుతూ ఇరుదేశాలకు ఆమోదయోగ్యంగా 90శాతం చర్చలు ఇప్పటికే పూర్తి అయ్యాయి. ఆదివారం చైనాతో జరిగే చర్చలు సఫలమయ్యేందుకే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయాన్నారు. స్టీవెన్‌ వాఖ్యలతో ట్రేడర్లు తమ పెట్టుబడులను ఈక్విటీ మార్కెట్ల వైపు మళ్లిస్తుండటంతో పసిడి ఫ్యూచర్లకు డిమాండ్‌ తగ్గింది. ఫెడ్‌ వడ్డీరేట్ల దూకుడు అంచనాలపై ఛైర్మన్‌ పావెల్‌ నీళ్లు చల్లడంతో నిన్నటి ట్రేడింగ్‌లో పసిడి ధర నిన్నటి ట్రేడింగ్‌లో దాదాపు 1శాతం క్షీణించి 1,415.40 డాలర్ల వద్ద ముగిశాయి. 
దేశీయంగానూ తగ్గుముఖం:-
అంతర్జాతీయ ట్రెండ్‌కు అనుగుణంగానే దేశీయంగానూ పసిడి ధరలు తగ్గుముఖం పట్టాయి. ఇది పసిడికి వరుసగా రెండోరోజూ నష్టాల ట్రేడింగ్‌ కావడం గమనార్హం. నేడు ఎంసీక్స్ లో ఆగ‌స్ట్ ఫ్యూచ‌ర్ కాంట్రాక్టు ప‌సిడి ధ‌ర క్రితం ట్రేడింగ్‌ ముగింపు(రూ.34, 387)తో పోలిస్తే రూ.169లు నష్టపోయి రూ.34236ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. రూపాయి ఒడిదుడుకుల ట్రేడింగ్‌, దేశీయ ఈక్విటీ మార్కెట్లలో అస్థిరత వాతావరణం పసిడి ట్రేడింగ్‌పై ప్రతికూల ప్రభావాన్ని చూపుతున్నాయి. నిన్నటి ఫారెక్స్‌ ముగింపు సమయానికి 10గ్రాముల పసిడి ధర రూ.169లు నష్టపోయి రూ.34, 387 వద్ద స్థిరపడింది.



You may be interested

ప్రైవేట్‌ బ్యాంకు షేర్ల ర్యాలీ: లాభాల్లో నిఫ్టీ బ్యాంకు

Thursday 27th June 2019

మార్కెట్‌ ర్యాలీ భాగంగా ఎన్‌ఎస్‌ఈలోని కీలకమైన బ్యాంక్‌ నిఫ్టీ బ్యాంక్‌ లాభాల బాటపట్టింది. బ్యాంకింగ్‌ రంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించిస్తున్న ఈ ఇండెక్స్‌ నేడు 31,192.10 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. మార్కెట్‌ ప్రారంభం నుంచి ప్రైవేట్‌ రంగ బ్యాంకింగ్‌ షేర్లు లాభపడటంతో బ్యాంక్‌ నిఫ్టీ 236 పాయింట్లు (0.75శాతం) లాభపడి 31,398.45 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకాయి. ఇండెక్స్‌లో అధిక వెయిటేజీ కలిగిన ఐసీఐసీఐ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ షేరు

ఇండియా టారీఫ్‌లపై ట్రంప్‌ ట్వీట్‌

Thursday 27th June 2019

‘ఇండియా , అమెరికా దిగుమతులపై గత కొంత కాలం నుంచి అధికంగా సుంకాలను విధిస్తునే ఉంది. తాజాగా కూడా సుంకాలను పెంచింది. ఇది మంచిది కాదు దీనిని మేం అంగీకరించం. ఈ సుంకాలను ఇండియా ఉపసంహరించుకోవాలి. ఈ విషయంపై ఇండియా ప్రధాని నరేంద్రమోదీతో చర్చలకై ఎదురుచూస్తున్నా’ అని అమెరికా  అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ గురువారం ట్వీట్‌ చేశారు. ఈ వారం చివరిలో జీ 20 సమావేశం జరగనున్న నేపథ్యంలో  ఈ

Most from this category