News


1480డాలర్ల వద్ద స్థిరపడిన పసిడి

Saturday 21st December 2019
news_main1576909128.png-30350

అమెరికా మూడో త్రైమాసికపు వృద్ధి గణాంకాలు మార్కెట్‌ అంచనాలను అందుకోవడంతో పసిడి ధర శుక్రవారం నష్టాలతో ముగిసింది. అమెరికాలో రాత్రి ఔన్స్‌ పసిడి ధర 3.50డాలర్లు  పతనమై 1,480.90డాలర్ల వద్ద స్థిరపడింది. అమెరికా చైనాల మధ్య పాక్షిక ఒప్పందం కుదిరిన నేపథ్యంలో అమెరికా ఆర్థిక వ్యవస్థ స్థిరమైన వృద్ధిని కనబరుస్తోంది. ఫలితంగా ఇన్వెస్టర్లు రిస్క్‌ అసెట్స్‌లైన  ఈక్విటీల్లో పెట్టుబడులు పెట్టేందుకు మొగ్గచూపుతుండంతో పసిడికి డిమాండ్‌ తగ్గుతోంది. మరోవైపు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌పై అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టిన నేపథ్యంలో నెలకొన్న రాజకీయ అనిశ్చితి పసిడికి అండగా నిలిచాయి. ఇక ఈ వారం మొత్తం మీద పసిడి స్వల్పంగా 0.02శాతం లాభపడింది.

నవంబర్‌ మొదటి వారం నుంచి పసిడి పరిమిత శ్రేణిలో కదలాడుతుంది. ఈ ఏడాదిలో ఈక్విటీ పలు మార్కెట్లు రికార్డు అందుకున్నప్పటికీ.., డాలర్‌ బలపడినప్పటికీ పసిడి ధర ఈ ఏడాది చెప్పుకోదగిన ర్యాలీ చేయడం విశేషమని పెర్త్‌ మింట్‌ కన్సల్టెన్సీ కెవిన్‌ రిచ్‌ తెలిపారు. 

ఈ ఏడాదిలో పసిడి శుక్రవారం ముగింపు నాటికి 12.6శాతం లాభపడింది. ఇటీవల పసిడి ధర 1475 డాలర్ల శ్రేణికి దిగివచ్చింది. అయితే ‍ప్రభుత్వ బాండ్‌ ఈల్డ్స్‌తో క్షీణత పసిడి ధరకు కలిసొచ్చింది. బాండ్‌ ఈల్డ్స్‌ పసిడి ధరలు నిరంతరం వ్యతిరేక దిశలో ట్రేడ్‌ అవుతున్నాయి.

దేశీయంగానూ నష్టాల ముగింపే:- 
అంతర్జాతీయ ట్రెండ్‌కు తగ్గట్టుగానే పసిడి ధర దేశీయంగా నష్టాల్లో ముగిసింది. నిన్నరాత్రి ఎంసీఎక్స్‌ మార్కెట్‌ ముగిసే సరికి రూ.118.00లు నష్టపోయి రూ.37991.00 వద్ద స్థిరపడింది. అంతర్జాతీయంగా పసిడి ధర అమ్మకాల ఒత్తిడికి లోనవడం‍, డాలర్‌ మారక విలువలో రూపాయి స్థిరమైన ట్రేడింగ్‌ పసిడికి ప్రతికూలాంశాలుగా మారాయి. ఇక వారం మొత్తంగా చూసినట్లైతే పసిడి ధర రూ.218లు లాభపడింది. 

 



You may be interested

ట్రేడ్‌డీల్‌పై సంతకాలకు రెడీ!

Saturday 21st December 2019

వాణిజ్యయుద్ధానికి ముగింపు పలుకుతూ తయారైన ట్రేడ్‌డీల్‌ తొలిదశ ఒప్పందంపై సంతకాలు చేసేందుకు యూఎస్‌, చైనా తయారవుతున్నాయి. ఈమేరకు చైనా అధ్యక్షుడితో చర్చల అనంతరం అమెరికా అధ‍్యక్షుడు ట్రంప్‌ ఒక ప్రకటన చేశారు. ‘‘ట్రేడ్‌డీల్‌పై చైనా ప్రెసిడెంట్‌తో మంచి చర్చలు జరిగాయి. ఇ‍్పపటికే పలు అగ్రిఉత్పత్తులను భారీగా కొనేందుకు చైనా అంగీకరించింది. త్వరలో డీల్‌పై సంతకాలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.’’అని ట్రంప్‌ ఒక ట్వీట్‌లో తెలిపారు. హాంకాంగ్‌, నార్త్‌కొరియాపై సైతం తామిరువురం చర్చించామన్నారు.

ఈ రికార్డులే కాదు... ప్రీబడ్జెట్‌ర్యాలీ కూడా!

Saturday 21st December 2019

మార్కెట్‌ పరుగులు కొనసాగుతాయి నిపుణుల అంచనా దేశీయ మార్కెట్లు ఈవారం రికార్డు స్థాయిలను తాకి, రికార్డు స్థాయిల్లో ముగిశాయి. ఈ నేపథ్యంలో సూచీల్లో పరుగు జనవరిలో కూడా కొనసాగుతుందని, బడ్జెట్‌పై ఆశలు సూచీలను పరుగు పెట్టిస్తాయని నిపుణులు భావిస్తున్నారు. మధ్యలో కొంత కన్సాలిడేషన్లున్నా మార్కెట్‌ ముందుకే సాగుతుందన్నారు. మార్కెట్లో అధిక ప్రీమియం వాల్యూషన్లున్నా, విదేశీ నిధుల ప్రవాహం కారణంగా వాల్యూషన్లను పట్టించుకోకుండా అప్‌మూవ్‌ ఉంటుందన్నారు. ప్రభుత్వం బడ్జెట్లో మరిన్ని సంస్కరణలు తీసుకువస్తుందన్న నమ్మకాలు

Most from this category