News


9నెలల్లో 25శాతం పెరిగిన పసిడి

Saturday 19th October 2019
Markets_main1571472688.png-29005

దేశీయ పసిడి ధరకు రానున్న రోజుల్లో రూపాయి కదలికలు, అమెరికా-చైనాల వాణిజ్య చర్చలు కీలకం కానున్నట్లు జియోజిత్‌ ఫైనాన్షియల్‌ కమోడిటీ అధిపతి హరీష్‌ వీ అభిప్రాయపడ్డారు. దేశీయ ఈక్విటీ మార్కెట్ల పతనం,  వాణిజ్య ఉద్రిక్తతలు, రూపాయి ట్రేడింగ్‌లో అస్థిరత వంటి కారణాలతో పసిడి ధర 9నెలల్లో 25శాతం ర్యాలీ జరిపింది.  రెండో త్రైమాసికపు చివర్లో 10గ్రాముల పసిడి ధర రూ.39,699 వద్ద జీవితకాల గరిష్టాన్ని అందుకుంది. సెప్టెంబర్‌-డిసెంబర్‌ మధ్య వివాహాలు, పండుగలుండంతో దేశీయ బులియన్‌ మార్కెట్లో ఈ కాలంలో పసిడి ధరకి డిమాండ్‌ పెరుగుతుంది. ఈ కీలక సమయంలో డాలర్‌ మారకంలో రూపాయి బలపడితే పసిడి ర్యాలీపై ప్రతికూల ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది. అలాగే అమెరికా-చైనాల మధ్య ట్రేడ్‌వార్‌ చర్చలు, ప్రపంచమార్కెట్ల మార్కెట్ల పసిడి గమనం, ఈక్విటీ మార్కెట్ల ర్యాలీ... రానున్న రోజుల్లో కీలకంగా మారనున్నట్లు హరీష్‌ తెలిపారు. 

ఇక అం‍తర్జాతీయ పసిడి ధరలపై స్పందిస్తూ... అమెరికా చైనా మధ్య జరిగే తదుపరి వాణిజ్య చర్చలు పసిడికి కీలకం. ఒకవేళ చర్చలు విజయవంతమైనట్లైతే రానున్న రోజుల్లో పసిడి మరింత అమ్మకాల ఒత్తిడికి లోనమయ్యే అవకాశం ఉంది. యుఎస్-చైనా వాణిజ్య వివాదం పూర్తిగా సమిసి పోనంత వరకు, ప్రపంచ భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు తగ్గముఖం పట్టనంత కాలం పసిడి ధరపై పాజిటివ్‌ అవుట్‌లుక్‌ కొనసాగుతుందని అభిప్రాయపడ్డారు. బలహీనమైన అంతర్జాతీయ ఆర్థిక అవుట్‌లుక్‌, అమెరికా చైనాల మధ్య వాణిజ్య యుద్ధం తీవ్రతరం కావడం, పలు దేశాల సెంట్రల్‌ బ్యాంకు వడ్డీరేట్ల తగ్గింపుపై ఆశావహన అంచనాలు, బ్రెగ్జిట్‌ అనిశ్చితితో పాటు ఇతర భౌగోళిక ఉద్రికత్తలు పసిడి ఫ్యూచర్లకు డిమాండ్‌ను పెంచాయి. ఫలితంగా అం‍తర్జాతీయ మార్కెట్లో పసిడి ఫ్యూచర్ల 6 ఏళ్ల గరిష్టాన్ని తాకాయి. అనంతరం వాణిజ్య యుద్ధ ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టడం, పసిడి ధరపై వ్యతిరేక ప్రభావాన్ని చూపే డాలర్‌ ఇండెక్స్‌ స్థిరమైన ర్యాలీ, గరిష్ట స్థాయిలో లాభాల స్వీకరణ చోటు చేసుకోవడంతో పసిడి ధర తగ్గుముఖం పట్టాయి. అయినప్పటికీ 1500 డాలర్ల స్థాయి వద్ద ట్రేడ్‌ అవుతున్నాయి.You may be interested

దీపావళికి ముందే మరో బుల్‌రన్‌?!

Saturday 19th October 2019

పండుగ నాటికి పన్నెండు వేలకు నిఫ్టీ నిపుణుల అంచనా దేశీయ మార్కెట్లో క్రమంగా సంస్థాగత ఇన్వెస్టర్ల పెట్టుబడులు ఊపందుకుంటున్నాయి. పాజిటివ్‌ సెంటిమెంట్‌ పెరుగుతోంది. వరుసగా రెండో వారం కూడా వీఐఎక్స్‌ తరుగుదల నమోదు చేసింది. మరోవైపు ఎఫ్‌పీఐలు షార్ట్‌ పొజిషన్లు కవర్‌ చేసి, స్పాట్‌లో కొనుగోళ్లకు ప్రాధాన్యమిస్తున్నారు. ఇవన్నీ మార్కెట్‌పై బుల్స్‌ పట్టు మరింత పెరుగుతుందనేందుకు సంకేతాలని నిపుణులు అంచనా వేస్తున్నారు. అనుకున్నదానికన్నా ముందే అంచనాలను అందుకోగలదని భావిస్తున్నారు. మార్కెట్లో రిస్కులు తీసుకునేందుకు

మిశ్రమంగా ముగిసిన ఏడీఆర్‌లు

Saturday 19th October 2019

అమెరికాలో ట్రేడయ్యే ఇండియా ఏడీఆర్‌లు శుక్రవారం అక్కడి మార్కెట్లో మిశ్రమంగా ముగిశాయి. ఫార్మారంగానికి చెందిన డాక్టర్‌ రెడ్డీస్‌ ఏడీఆర్‌ అత్యధికంగా 2శాతం లాభపడింది. ఐసీఐసీఐ ఏడీఆర్‌ అరశాతం ర్యాలీ చేసింది. హెచ్‌డీఎఫ్‌సీ ఏడీఆర్‌ 1శాతం నష్టపోయింది. టాటామోటర్స్‌ ఏడీఆర్‌ 0.21శాతం, ఇన్ఫోసిస్‌ ఏడీఆర్‌ 0.20శాతం నష్టపోగా, విప్రో ఏడీఆర్‌ మాత్రం ఎలాంటి లాభ, నష్టాలకు లోనుకాకుండా స్థిరంగా ముగిసింది నష్టాల్లో ముగిసిన అమెరికా మార్కెట్లు:-  టెక్నాలజీ, ఇండస్ట్రీస్‌, కన్జూమర్‌ సేవల షేర్లలో అమ్మకాలతో

Most from this category