News


పసిడి @ రూ.42,000

Friday 21st February 2020
Markets_main1582258025.png-31978

గురువారం అంతర్జాతీయ మార్కెట్‌లో ఏడేళ్ల గరిష్టానికి చేరిన బంగారం ధర శుక్రవారం మరోసారి భారీగా పెరిగి, కొత్త రికార్డును నెలకొల్పింది. దేశీయ మల్టీ కమోడిటీ ఎక్స్‌ఛేంజ్‌లో బుధవారం ముగింపుతో పోలిస్తే గురువారం రాత్రి రూ.500 పెరిగి 10 గ్రాముల పసిడి రూ. 42,039.00 వద్ద ట్రేడ్‌ ముగిసింది. ఎంసీఎక్స్‌లో బంగారం ధర ఈ స్థాయికి చేరడం ఇదే ప్రధమం. కాగా దేశీయ ఎంసీఎక్స్‌కు ఈరోజు ఉదయం సెలవు. సాయంత్రం మార్కెట్‌ ఓపెన్‌ అయ్యాక పసిడి ట్రేడ్‌ అవుతుంది. అంతర్జాతీయ మార్కెట్లో  శుక్రవారం గత ముగింపుతో పోలిస్తే ఔన్స్‌ బంగారం ధర 7 డాలర్లు పెరిగి 1,627.45 వద్ద ట్రేడ్‌ అవుతోంది. 

(గురువారం బంగారం(స్పాట్‌) ముగింపు ధరల కోసం ఆయా నగరాల గుర్తులపై క్లిక్‌ చేయగలరు)



You may be interested

ఏజీఆర్‌తో టెలికం రంగంలో అసాధారణ సంక్షోభం...

Friday 21st February 2020

బాకీల చెల్లింపులపై సుప్రీం ఆదేశాలకు కట్టుబడి ఉన్నాం భారతి ఎయిర్‌టెల్ చైర్మన్ సునీల్ మిట్టల్ వెల్లడి కేంద్ర టెలికం మంత్రి రవి శంకర్‌ ప్రసాద్‌తో భేటీ న్యూఢిల్లీ: సవరించిన స్థూల ఆదాయాల (ఏజీఆర్‌) ప్రాతిపదికన టెల్కోలు భారీ బకాయిలు కట్టాల్సి రావడం .. టెలికం పరిశ్రమలో గతంలో ఎన్నడూ చూడని విధంగా, అసాధారణ సంక్షోభం తలెత్తిందని భారతి ఎయిర్‌టెల్ చైర్మన్ సునీల్‌ మిట్టల్ వ్యాఖ్యానించారు. అయితే, సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం బాకీలను కట్టేందుకు

జనవరిలో తగ్గిన ప్యాసింజర్‌ వాహన విక్రయాలు

Friday 21st February 2020

రిజిస్ట్రేషన్ల ఆధారంగా వెల్లడించిన ఎఫ్‌ఏడీఏ న్యూఢిల్లీ: దేశీ ప్యాసింజర్‌ వాహన అమ్మకాలు ఈ ఏడాది జనవరిలో తగ్గుదలను నమోదుచేసినట్లు ఆటోమొబైల్‌ డీలర్స్‌ అసోసియేషన్స్‌ సమాఖ్య (ఎఫ్‌ఏడీఏ) వెల్లడించింది. గతనెల్లో 2,90,879 యూనిట్ల విక్రయాలు నమోదుకాగా, అంతక్రితం ఏడాది ఇదే కాలంలోని 3,04,929 యూనిట్ల అమ్మకాలతో పోల్చితే 4.61 శాతం క్షీణత ఉన్నట్లు ప్రకటించింది. దేశవ్యాప్తంగా ఉ‍న్న 1,432 ప్రాంతీయ రవాణా కార్యాలయాలు (ఆర్‌టీఓ) ఉండగా.. 1,223 ఆర్‌టీఓల్లో నమోదైన వాహన రిజిస్ట్రేషన్ల

Most from this category