News


పసిడి ధరకు ఫెడ్‌ అండ..!

Monday 22nd July 2019
Markets_main1563773492.png-27217

ఫెడ్‌రిజర్వ్‌ బ్యాంకు వడ్డీరేట్ల కోత అంచనాలతో పసిడి ధర సోమవారం స్వల్పంగా లాభపడింది. నేడు ఆసియా ట్రేడింగ్‌లో ఔన్స్‌ పసిడి ధర 2డాలర్ల లాభంతో 1,428.65డాలర్ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. గతవారంలో డాలర్‌ అధిక వ్యాల్యూమ్స్‌తో ట్రేడ్‌ అవుతోందని ఐఎంఎఫ్‌ వ్యాఖ్యానించడటం, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కీలక వడ్డీరేట్ల కోతకు పిలుపునివ్వడంతో పాటు ఆసియా మార్కెట్ల నష్టాల ట్రేడింగ్‌ పసిడి ధరకు మద్దతునిస్తున్నాయి. ఫలితంగా ఒకదశలో 3డాలర్లు పెరిగి 1,429.50డాలర్ల స్థాయిని అం‍దుకున్నాయి. ఉదయం గం.10:30ని.లకు ఔన్స్‌ పసిడి ధర 2.25డాలర్ల లాభంతో 1,428.95 వద్ద ట్రేడింగ్‌ అవుతోంది. ఫెడ్‌ రిజర్వ్‌ ఈసారి కీలక వడ్డీరేట్లపై పావుశాతం కోత విధింపు యోచనలో ఉంది. 
దేశీయంగా పెరుగుదల:- 
పసిడి ధర దేశీయ మార్కెట్లోనూ అంతర్జాతీయ ట్రెండ్‌ను కొనసాగిస్తుంది. నేడు ఎంసీఎక్స్‌లో  పసిడి ఆగస్ట్‌ ఫ్యూచర్‌ కాంట్రాక్టు ధర రూ.124.00లు లాభంతో రూ.35160.00 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఫారెక్స్‌ మార్కెట్లో రూపాయి 18పైసలు క్షీణించడటం, ఈక్విటీ మార్కెట్‌ భారీ పతనం పసిడి ధరకు దున్నగా నిలుస్తున్నాయి. నేడు పసిడి ధర రూ.34739 - 35557 రేంజ్‌లో కదలాడవచ్చని బులియన్‌ నిపుణలు అంచనా వేస్తున్నారు.



You may be interested

ఈ టైంలో లాంగ్‌పుట్‌ బటర్‌ఫ్లై స్ప్రెడ్‌ వ్యూహం బెటర్‌!

Monday 22nd July 2019

నిపుణుల సలహా నిఫ్టీ కీలక 11460 పాయింట్ల నిరోధాన్ని కోల్పోయింది. దీంతో నిఫ్టీ క్రమంగా 11300 పాయింట్ల వరకు పతనమవుతుందని, ఈ స్థాయిని కాపాడుకోలేకుంటే క్రమంగా 11200 పాయింట్లను కూడా చూడవచ్చని నిపుణులు చెబుతున్నారు. పైకి 11500 పాయింట్లకు వచ్చినప్పుడు అమ్మకాల ఒత్తిడి పెరగనుంది. తాజా బ్రేక్‌డౌన్‌తో నిఫ్టీపై బుల్స్‌ పట్టు జారినట్లు కనిపిస్తోంది. ఈ సమయంలో బేరిష్‌ లాంగ్‌పుట్‌ బటర్‌ఫ్లై వ్యూహాన్ని అవలంబించడం మంచిదని సూచిస్తున్నారు.  ఇది ఒక రేంజ్‌బౌండ్‌ వ్యూహం.

యస్‌ బ్యాంక్‌ 7 శాతం అప్‌

Monday 22nd July 2019

గత కొన్ని సెషన్‌లలో నష్టపోయిన యస్‌ బ్యాంక్‌ షేరు  సోమవారం ట్రేడింగ్‌లో 7.69  శాతం లాభపడి రూ. 89.65 వద్ద ట్రేడవుతోంది. ఈ  షేరు రూ. 83.30 వద్ద ప్రారంభమవ్వగా గత సెషన్‌లో రూ. 83.25 వద్ద ముగిసింది. ఇంట్రాడే గరిష్ఠస్థాయి, కనిష్ఠస్థాయి  రూ. 90.45, రూ. 81.70లకు చేరుకుంది. ఉదయం 10.51 సమయానకి 6.43 శాతం లాభపడి 88.60 వద్ద ట్రేడవుతోంది. 

Most from this category