News


పసిడికి ఫెడ్‌ మద్దతు

Thursday 12th December 2019
Markets_main1576127591.png-30187

ఫెడ్‌ రిజర్వ్‌ బ్యాంకు కీలక వడ్డీరేట్లను యథాతథంగా ఉంచుతున్నట్లు ప్రకటించడంతో ప్రపంచమార్కెట్లో పసిడి ధర పెరిగింది. ఆసియా ట్రేడింగ్‌లో గురువారం ఔన్స్‌ పసిడి ధర 5డాలర్లు బలపడి 1,480 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. అలాగే అమెరికా-చైనాల మధ్య వాణిజ్య చర్చల సఫలవంతపై కొనసాగుతున్న అనిశ్చితి, నేడు బ్రిటన్‌ సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఇన్వెస్టర్ల అప్రమత్తత తదితర అంశాలు పసిడి బలపడేందుకు కారణమవుతున్నాయి. రెండురోజుల పాటు జరిగిన ఫెడ్‌ రిజర్వ్‌ బ్యాంక్‌ పాలసీ సమావేశం నిన్న రాత్రి ముగిసింది. అమెరికా ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడం, బలమైన లేబర్‌ మార్కెట్ పరిస్థితుల్లో వడ్డీరేట్లలో ఎలాంటి మార్పు లేకుండా కొనసాగిస్తున్నట్లు ఫెడ్‌ ఛైర్మన్‌ పావెల్‌ ప్రకటించారు. ఫండ్‌ రేటును 1.5శాతం -1.75శాతం లక్ష్య పరిధిలో ఉంచున్నట్లు పావెల్‌ తెలిపారు. ఈ ఏడాదిలో ఇప్పటికే మూడుసార్లు వడ్డీరేట్ల కోత విధించిన సంగతి తెలిసిందే. ద్రవ్యోల్బణ దిగివస్తున్న తరుణంలో వచ్చే పాలసీ సమావేశాల్లో సైతం వడ్డీరేట్లలో ఎలాంటి మార్పు ఉండకపోవచ్చనే సంకేతాలను ఇచ్చింది. వడ్డీరేట్లలో ఎలాంటి మార్పు లేకపోవడంతో ఆరు ప్రధాన కరెన్సీ విలువల్లో డాలర్‌ ఇండెక్స్‌ నష్టాల బాట పట్టింది. ఈ అంశం పసిడికి కలిసొచ్చింది. దీంతో రాత్రి అమెరికా మార్కెట్లో ఔన్స్‌ పసిడి ధర 7డాలర్లు బలపడి 1,475డాలర్ల వద్ద స్థిరపడింది.
దేశీయంగా స్వల్ప లాభాల్లోనే:-
ప్రపంచమార్కెట్లో పసిడి ధర పెరిగినప్పటికీ.., దేశీయ మార్కెట్లో మాత్రం స్థిరంగా ట్రేడ్‌ అవుతోంది. డాలర్‌ మారకంలో రూపాయి బలపడటం, దేశీయ ఈక్విటీలకు కొనుగోళ్ల మద్దతు ఇందుకు కారణవుతున్నాయి. నేడు ఎంసీఎక్స్‌లో ఫిబ్రవరి కాంటాక్టు 10గ్రాముల పసిడి ధర రూ.36.00లు లాభంతో రూ.37735.00 వద్ద ట్రేడ్‌ అవుతోంది. నిన్నరాత్రి మార్కెట్‌ ముగిసే సరికి రూ.37699 వద్ద స్థిరపడింది. You may be interested

రెండు స్టాకులపై మోర్గాన్‌స్టాన్లీ బుల్లిష్‌

Thursday 12th December 2019

గెయిల్‌ ఇండియా, గోద్రేజ్‌ కన్జూమర్‌ ప్రొడక్ట్స్ షేర్లపై ఓవర్‌వెయిట్‌గా ఉన్నట్లు అంతర్జాతీయ బ్రోకరేజ్‌ మోర్గాన్‌స్టాన్లీ వెల్లడించింది. ఈ షేర్లలో 26-67 శాతం అప్‌సైడ్‌ ఉండొచ్చని అంచనా వేసింది. గోద్రేజ్‌ కన్జూమర్‌ షేరుకు రూ. 845 టార్గెట్‌గా నిర్ణయించింది. గెయిల్‌ ఇండియాకు రూ. 188 టార్గెట్‌గా పేర్కొంది. గోద్రేజ్‌ కన్జూమర​ దేశీయ వాల్యూం వృద్ధిలో వేగాన్ని నమోదు చేయగలదని, ఆపరేటింగ్‌ మార్జిన్లలో విస్తరణ చూపుతుందని అంచనా వేసింది. గెయిల్‌ ఇండియా తన

నిఫ్టీలో కాల్‌ లాడర్‌ వ్యూహం!

Thursday 12th December 2019

మార్కెట్లు బుధవారం చివరిలో పాజిటివ్‌ మూడ్‌లోకి మారాయి. దీంతో ఈ నెల్లో మరోమారు నిఫ్టీ తన ఆల్‌టైమ్‌ హైని తాకొచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇలాంటి స్వల్పశ్రేణి అప్‌మూవ్‌ కదలికల సమయంలో బుల్‌కాల్‌ లాడర్‌ స్ప్రెడ్‌ వ్యూహం అవలంబించాలని డెరివేటివ్స్‌ నిపుణులు సూచిస్తున్నారు. ఈ వ్యూహంలో 11900 కాల్‌ను కొని 12100, 12200 కాల్స్‌ను(డిసెంబర్‌  నెల ఆప్షన్స్‌) విక్రయించడం జరుగుతుంది. బుధవారం ధరల ప్రకారం చూస్తే 11900 కాల్‌కు రూ. 138రూపాయలు

Most from this category