News


వడ్డీరేట్ల కోత అంచనాలతో పెరిగిన పసిడి

Monday 9th September 2019
Markets_main1568011962.png-28267

వడ్డీరేట్ల కోత అంచనాలు పెరగడంతో సోమవారం పసిడి ధర లాభాల బాట పట్టింది. ఆసియాలో ఔన్స్‌ పసిడి ధర 5డాలర్లు పెరిగి 1,520 వద్ద ట్రేడ్‌ అవుతోంది. అమెరికా ఎగుమతుల తిరోగమనం కారణంగా ఆగస్టులో చైనా ఎగుమతులు పడిపోయాయి. యూరోజోన్‌ బ్రిగ్జిట్‌ సంక్షోభం కొనసాగుతుండటం, అమెరికాలో ఉద్యోగ వృద్ధి ఆగస్టులో ఊహించిన దానికంటే మందగించింది. చైనాతో వాణిజ్య వివాదాలు పరిష్కరించడానికి కొన్ని ఏళ్లు పట్టవచ్చని వైట్ హౌస్ ఆర్థిక సలహాదారు లారీ కుడ్లో హెచ్చరికలు తదితర అంశాలు  ఆర్థిక మాంద్యానికి దారి తీస్తున్నాయి. ఆర్థిక మాంద్య భయాలతో రానున్న పలు దేశాల కేంద్ర బ్యాంకులు వడ్డీరేట్లను తగ్గించవచ్చని మార్కెట్‌ విశ్లేషకులు భావిస్తున్నారు. తక్కువ వడ్డీరేట్లు నాన్‌ ఈల్డ్‌ బులియన్‌పై దిగుమతిని తగ్గిస్తాయి. అలాగే డాలర్‌ ఇండెక్స్‌పై ఒత్తిడి కలుగజేస్తుంది. ఫలితంగా మార్కెట్లో పసిడి ధరలకు డిమాండ్‌ పెరుగుతుంది. బంగారంపై పెట్టుబడి పెట్టడటం ఉత్తమం ఎందుకంటే మనీ సప్లై నమ్మకశ్యం కాని రీతిలో పెరిగింది. రానున్న రోజుల్లో పసిడి ధర ర్యాలీ చేస్తుంది అని మార్క్‌ మోబీస్‌ అభిప్రాయపడ్డారు. అన్ని దేశాల రిజర్వ్‌ బ్యాంకులు వడ్డీరేట్ల తగ్గింపునకు మద్దతినిచ్చాయి. వ్యవస్థలోని ద్రవ్యన్ని విస్తారంగా సరఫరా చేయాలని భావించాయి. వడ్డీరేట్ల తగ్గింపు డిమాండ్‌ను పెంచుతుందని, వృద్ధికి  ప్రేరణనిస్తుందని రిజర్వ్‌బ్యాంకు ఆశిస్తుందని మోబీస్‌ అంటున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో యు.ఎస్. డాలర్ బలహీనంగా ఉంటే పసిడి హోల్డ్‌ చేయమని మోబియస్‌ ట్రేడర్లకు సూచించారు. అలాగే వివిధ ప్రపంచ బ్యాంకులు సైతం పసిడి భారీ ఎత్తున కొనుగోళ్లు చేసున్నాయి. ఈ ఏడాది తొలి అర్థభాగంలో సెంట్రల్ బ్యాంకులు 374 మెట్రిక్ టన్నుల కొనుగోలు చేసినట్లు వరల్డ్‌ గోల్డ్‌ కౌన్సిల్‌ గణాంకాలు చెబుతున్నాయి. 2000 తరువాత ఒక ఏడాది అర్థభాగంలో అతిపెద్ద స్థాయిలో కొనుగోలు జరగడం ఇదే తొలిసారి.
దేశీయంగా స్వల్ప నష్టంతో ట్రేడింగ్‌:-
అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ర్యాలీ కొనసాగుతున్నప్పటికీ.., దేశీయంగా స్వల్ప నష్టంలో ట్రేడ్‌ అవుతోంది. ఫారెక్స్‌ మార్కెట్లో రూపాయి బలపడటం ఇందుకు కారణవుతోంది. నేడు ఎంసీఎక్స్‌ మార్కెట్లోని అక్టోబర్‌ కాంటాక్టు 10 గ్రాముల పసిడి ధర శుక్రవారం రాత్రి ముగింపు (రూ.38,553)తో పోలిస్తే ఉదయం గం.11:30ని.లకు రూ.92.00 స్వల్ప నష్టంతో 38461.00 వద్ద ట్రేడ్‌ అవుతోంది.You may be interested

బ్యాంక్‌ నిఫ్టీ 1శాతం జంప్‌

Monday 9th September 2019

బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ సోమవారం ఉదయం ట్రేడింగ్‌ సెషన్‌లో 1శాతం పెరిగింది. ఎన్‌ఎస్‌ఈలో బ్యాంకింగ్‌ రంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే బ్యాంక్‌ నిఫ్టీ  ఇండెక్స్‌ నేడు 27,240.35 వద్ద ప్రారంభమైంది. మార్కెట్‌ ప్రారంభం నుంచి బ్యాంకింగ్‌ రంగ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభిస్తుండటంతో ఇండెక్స్‌ 1.10శాతం పెరిగి 27539.50 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. మధ్యాహ్నం గం.12:30ని.లకు ఇండెక్స్‌ గతవారం ముగింపు(27,247.90)తో పోలిస్తే 0.95శాతం లాభంతో 27,511.05 వద్ద ట్రేడ్‌

మందగమనంలో మీ ఆర్థిక ప్రణాళిక ఇలా..!

Monday 9th September 2019

పెట్టుబడులు కొనసాగాలి... వీలైతే అదనపు పెట్టుబడులు పెట్టుబడుల్లో వైవిధ్యం అవసరం ప్రాపర్టీ కొనుగోళ్లకు తొందరెందుకు? అత్యవసర నిధి ఏర్పాటుచేసుకోవాలి అనవసర ఖర్చులకు కళ్లెం అవసరమైనా, ఖరీదైనవి వాయిదా కుటంబానికి వైద్య బీమా రుణ చెల్లింపులు ఆపొద్దు దేశ ఆర్థిక వృద్ధి నేల చూపులు చూస్తోంది. జూన్‌తో ముగిసిన మూడు నెలల కాలంలో జీడీపీ వృద్ధి 5 శాతానికి తగ్గింది. ఇది ఆరేళ్లలోనే కనిష్ట వృద్ధి. ఆటోమొబైల్‌ సహా పలు రంగాల్లో ఉద్యోగాలకు కోత పడుతోంది. డిమాండ్‌ పడిపోవడం, మార్కెట్లో నిధుల లభ్యత తగ్గిపోవడం

Most from this category