News


స్వల్పంగా పెరిగిన పసిడి

Friday 26th July 2019
Markets_main1564130542.png-27327

నిన్నటి ట్రేడింగ్‌లో వారం కనిష్టస్థాయికి పతనమైన పసడి ధర శుక్రవారం స్వల్పంగా లాభపడింది. అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లలో నెలకొన్న బలహీన పరిస్థితులు పసిడి బలపడేందుకు మద్దతినిస్తున్నాయి. ఫలితంగా నేటి ఉదయం ఆసియా ట్రేడింగ్‌లో  ఔన్స్‌ పసిడి ధర 3డాలర్లు పెరిగి  1,417.70డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. అయితే.., నేటి రాత్రి అమెరికా క్యూ2 జీడీపీ గణాంకాలు వెల్లడి కానున్న నేపథ్యంలో ట్రేడర్ల అప్రమత్తతతో లాభాలు పరిమితమయ్యాయి. 
దేశీయంగా స్వల్ప తగ్గింపు:- 
దేశీయ ఎంసీఎక్స్‌ మార్కెట్లో పసిడి ధర స్వల్పంగా తగ్గముఖం పట్టింది. నేడు ఎంసీఎక్స్‌ మార్కెట్లో 10గ్రాముల పసిడి ఆగస్ట్‌ ఫ్యూచర్‌ కాంట్రాక్టు ధర రూ.24.00లు నష్టపోయి రూ.34793.00ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. నిన్న రాత్రి ఎంసీఎక్స్‌ మార్కెట్‌ ముగిసే సరికి 10గ్రాముల పసిడి ధర రూ.210 నష్టంతో రూ.34, 817ల వద్ద స్థిరపడింది. 



You may be interested

బ్యాంక్‌ నిఫ్టీ 1శాతం అప్‌

Friday 26th July 2019

1శాతం లాభపడ్డ బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ మార్కెట్లో జరుగుతున్న షార్ట్‌ కవరింగ్‌లో భాగంగా శుక్రవారం ఉదయం ట్రేడింగ్‌ సెషన్‌లో బ్యాంకు నిఫ్టీ ఇండెక్స్‌ దాదాపు 1శాతం లాభపడింది. బ్యాంకింగ్‌ రంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ బ్యాంకు 29,062.50 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఆరు రోజుల వరుస పతనం అనంతరం నేడు మార్కెట్లో జరుగుతున్న కొనుగోళ్లతో బ్యాంకింగ్‌ రంగ షేర్లు లాభాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి. ఫలితంగా ఇండెక్స్ ఒక దశలో 300

శుక్రవారం వార్తల్లోని షేర్లు

Friday 26th July 2019

వివిధ వార్తలకు అనుగుణంగా శుక్రవారం ప్రభావితమయ్యే షేర్ల వివరాలు  సుందరం మల్టీక్యాప్‌:- కేర్‌ రేటింగ్‌ సంస్థ రుణసదుపాయపు సౌకర్యానికి బిబి-(స్థిరత్వం) రేటింగ్‌ను కేటాయించింది అవెన్యూ సూపర్‌మార్ట్‌:- కంపెనీ రూ.30 కోట్ల కమర్షియల్‌ పేపర్ల ఇష్యూను జారీ చేసింది.  జేకే అగ్రి జెనిటిక్‌:- కంపెనీ సీఎఫ్‌ఓగా కుమార్‌ గౌతమ్‌వరమ్‌ నియమితులయ్యారు.  టాటా స్టీల్:- టాటా స్పాంజ్‌ ఐరన్‌లో రైట్స్‌ ఇష్యూ ద్వారా ప్రతి షేరు ధర రూ.500లు చొప్పున మొత్తం 2.6కోట్ల ఈక్విటీ షేర్లను రూ.1292.2 కోట్లకు

Most from this category