News


స్థిరంగా పసిడి

Monday 29th July 2019
Markets_main1564381177.png-27370

డాలర్‌ ఇండెక్స్‌ రెండునెలల గరిష్టానికి చేరుకోవడంతో పసిడి ధర సోమవారం స్థిరంగా ట్రేడ్‌ అవుతోంది. ఆసియాలో ఉదయం ట్రేడింగ్‌ సెషన్‌లో ఔన్స్‌ పసిడి ధర అరడాలరు స్వల్ప నష్టంతో 1419డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. గతవారంలో అమెరికా విడుదల చేసిన రెండో త్రైమాసిక ఫలితాలు మార్కెట్‌ విశ్లేషకుల అంచనాలకు మించి నమోదు కావడంతో డాలర్‌ ఇండెక్స్‌ బలపడింది. అలాగే ఈ వారంలో జరిగే ఫెడ్‌ రిజర్వ్‌ సమావేశాల కొరకు పసిడి ఇన్వెస్టర్లు ఎదురుచూస్తున్నారు. అందరూ ఊహించినట్లుగా యూరోపిన్‌ సెంట్రల్‌ బ్యాంకు వడ్డీరేట్లపై కోత విధించకుండా, యథాతధ పాలసీకే కట్టుబడటంతో పసిడి ధర గతవారం అరశాతానికి పైగా నష్టపోయి 1,419.30డాలర్ల వద్ద స్థిరపడింది. వాస్తవానికి  ఈసారి ఫెడ్‌ రిజర్వ్‌ కీలక వడ్డీరేట్లపై బేసిస్‌ పాయింట్ల వరకు కోత విధించవచ్చని మార్కెట్‌ విశ్లేషకులు అంచనా వేశారు. అయితే శుక్రవారం అమెరికా బలమైన ఆర్థిక గణాంకాలను వెల్లడించడంతో కోత విధింపు అంచనాలు సన్నగిల్లాయి. అయితే, పశ్చిమాసియా దేశాల ఉద్రికత్తలు, అమెరికా - చైనాల మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు పసిడి ధర పతనాన్ని అడ్డుకుంటున్నాయి.
దేశీయంగానూ స్వల్ప తగ్గుదల:- 
దేశీయ ఎంసీఎక్స్‌ మార్కెట్లోనూ పసిడి ధర స్వల్పంగా తగ్గముఖం పట్టింది. నేడు ఎంసీఎక్స్‌ మార్కెట్లో 10గ్రాముల పసిడి ఆగస్ట్‌ ఫ్యూచర్‌ కాంట్రాక్టు ధర రూ.42లు నష్టపోయి రూ.34731ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. క్రితం వారంలో పసిడి ధర 0.86శాతం క్షీణించి రూ.34773ల వద్ద స్థిరపడింది. 



You may be interested

ఇ-స్మార్ట్‌ పాలసీ..!

Monday 29th July 2019

ప్రీమియం వెనక్కి రాదన్న భావన వద్దే వద్దు ప్రీమియం చాలా తక్కువ ఎన్నో అవసరాలకు రక్షణ రుణాలకూ రక్షణనిచ్చే టర్మ్‌ ప్లాన్‌లు ప్రీమియం భారం తగ్గించుకునే మార్గాలూ ఉన్నాయ్‌ ఆర్జన కలిగిన ప్రతీ ఒక్కరూ ఒక్కసారి దృష్టి సారించాల్సిందే జీవిత బీమా... ఇప్పటికీ చాలా మంది దీన్ని పెట్టుబడి సాధనంగానే చూస్తున్నారు. తమకు ఏదైనా జరగరానిది జరిగితే తమ కుటుంబం ఆర్థికంగా కష్టాలు పడకూడదన్న ఆకాంక్ష ఎక్కువ మందిలో ఉన్నప్పటికీ... ఆచరణకు వచ్చే సరికి సరైన కవరేజీ తీసుకుంటున్న

మెటల్‌ షేర్లు నష్టాల్లో ..

Monday 29th July 2019

ఈ వారం ఫెడ్‌ సమావేశంతో పాటు, యూఎస్‌-చైనా మధ్య వాణిజ్య చర్చలు జరగనుండడంతో మదుపర్లు జాగ్రత్త వహించారు. ఫలితంగా ఈక్విటీ మార్కెట్లు సోమవారం నష్టాల్లో ట్రేడవుతున్నాయి. నిఫ్టీ మెటల్‌ ఇండెక్స్‌ ఉదయం 10.25 సమయానికి 2.30 శాతం నష్టపోయి 2,630.65 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. ఈ ఇండెక్స్‌లో వేదాంత లి.4.36 శాతం, వెల్సపన్‌ కార్ప్‌ 3.46 శాతం, జేఎస్‌డబ్యూ స్టీల్‌ 3.24, సెయిల్‌ 2.99 శాతం, జిందాల్‌ స్టీల్‌ 2.83

Most from this category