News


6ఏళ్ల గరిష్టం వద్ద పసిడి ధర

Monday 24th June 2019
Markets_main1561353289.png-26514

ప్రపంచమార్కెట్లో సోమవారం పసిడి ధర 6ఏళ్ల గరిష్టం వద్ద స్థిరంగా ట్రేడ్‌ అవుతుంది. డాలర్‌ ఇండెక్స్‌ పతనం, ఇరాన్‌-అమెరికాల మధ్య కొనసాగుతున్న యుద్ధ ఉద్రిక్తతలు ఇందుకు తోడ్పాటును అందిస్తున్నాయి. నేడు ఆసియాలో మరో 14డాలర్లు పెరిగి 1,414 డాలర్ల వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. అంతర్జాతీయ వృద్ధి మందగమన భయాలతో అమెరికా ఫెడ్‌రిజర్వ్‌ బ్యాంకుతో సహా పలు దేశాలకు చెందిన సెంట్రల్‌ రిజర్వ్‌ బ్యాంకులు కీలక వడ్డీరేట్లపై మెతక వైఖరిని ప్రదర్శిస్తున్నాయి. వడ్డీరేట్లపై మెతకధోరణి డాలర్‌ ఇండెక్స్‌పై ఒత్తిడిని పెంచుతుంది. ఫలితంగా ఆరుప్రధాన కరెన్సీ విలువల్లో డాలర్‌ ఇండెక్స్‌ 3నెలల కనిష్టానికి పతనమైంది. అమెరికా- ఇరాన్‌ దేశాల మధ్య జరుగుతున్న సైబర్‌ యుద్ధంతో ఇన్వెస్టర్లను తన పెట్టుబడులను రక్షణాత్మక సాధనమైన పసిడి ఫ్యూచర్ల కొనుగోళ్ల వైపు మళ్లిస్తున్నారు. ఈ పరిణామాలతో పసిడి ఫ్యూచర్లకు డిమాండ్‌ పెరిగి వరుసగా 5ట్రేడింగ్‌ సెషన్‌లో లాభాల బాట పట్టాయి. ఉదయం గం.:10:15ని.లకు 6డాలర్ల లాభపడి 1,406.75 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది.
దేశీయంగా లాభాల్లోనే:- 
దేశీయంగా పసిడి ధర లాభాల్లోనే ట్రేడ్‌ అవుతోంది. నేడు ఎంసీఎక్స్‌లో ఆగస్టు ఫ్యూచర్‌ కాంట్రాక్టు పసిడి ధర రూ.150లు పెరిగి రూ.34315.00ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఫారెక్స్‌ మార్కెట్లో డాలర్‌ మారకంలో రూపాయి బలహీనత, ఈక్విటీ మార్కెట్లు స్తబ్దుగా కొనసాగుతుండం, ప్రపంచ మార్కెట్లో పసిడి ర్యాలీకి తదితర అంశాలు కలిసొస్తున్నాయి. గతవారంలో మార్కెట్‌ చివరిరోజైన పసిడి ధర రూ.34167.00ల వద్ద స్థిరపడిన సంగతి తెలిసిందే. 



You may be interested

అంతర్జాతీయ అంశాలే దిక్సూచీ..!

Monday 24th June 2019

ఎఫ్‌ అండ్‌ ఓ ముగింపు నేపథ్యంలో ఒడిడుదుకులకు ఆస్కారం  ఇరాన్‌పై యుద్ధం విషయంలో వెనక్కి తగ్గిన అమెరికా జపాన్‌లో జరిగే జి–20 శిఖరాగ్ర సమావేశాలపై ఇన్వెస్టర్లు దృష్టి న్యూఢిల్లీ: అమెరికా, ఇరాన్‌ మధ్య ఉద్రిక్తతలు యుద్ధానికి దారి తీస్తాయని గతవారంలో మార్కెట్‌ వర్గాలు ఆందోళన చెందగా.. వారాంతాన అగ్రరాజ్యం అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఈ విషయంపై వెనక్కి తగ్గినట్లు ప్రకటించి ఊరటనిచ్చారు. అయితే, ఇప్పటికీ ఇరుదేశాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థాయిలో ఉద్రిక్త

ఆర్బీఐ డిప్యూటి గవర్నర్‌ విరాల్‌ రాజీనామా

Monday 24th June 2019

రిజర్వ్‌ బ్యాంక్‌ స్యయం ప్రతిపత్తి కోసం ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిన ఆర్బిఐ డిప్యూటీ గవర్నర్‌ విరాల్‌ ఆచార్య తన పదవికి రాజీనామా చేశారు. మాజీ ఆర్బీఐ గవర్నర్‌ ఉర్జిత్‌ పటేల్‌ రాజీనామా తర్వాత ఇబ్బందిగానే పదవిలో కొనసాగిన ఈయన తన పదవి కాలం ముగియడానికి ఆరు నెలల ముందే వైదొలిగారు. ఆర్థిక సరళీకరణ తర్వాత తక్కువ వయుసున్న డిప్యూటీ గవర్నర్‌గా పేరుపొందిన ఆచార్య 2017 జనవరి 23న పదవిని స్వీకరించారు.

Most from this category