News


పసిడి పైపైకి

Friday 19th July 2019
Markets_main1563516915.png-27172

ప్రపంచమార్కెట్లో కొద్దిరోజుల క్రితం నమోదుచేసిన ఆరేళ్ల గరిష్టస్థాయి(1450 డాలర్లు)ని పసిడి ధర తొలిసారి అధిగమించింది. ఫెడ్‌ రిజర్వ్‌ వడ్డీరేట్ల కోత విధింపు అంచనాలు మరింత బలపడటంతో పాటు, తాజాగా పశ్చిమాసియా దేశాల్లో ఉద్రిక్తతలు మరోసారి తెరపైకి రావడంతో నేటి ఆసియా ట్రేడింగ్‌లో 26 డాలర్ల మేర లాభపడింది. ఆసియాలో ఉదయం సెషన్స్‌లో ఔన్స్‌ పసిడి ధర గత ముగింపు ధర(అమెరికాలో) 1428 డాలర్లలో పోలిస్తే 17డాలర్లు పెరిగి 1445 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. నిన్న రాత్రి న్యూయార్క్‌ ఫెడ్‌ ఛైర్మన్‌ విలియమ్స్‌ మాట్లాడుతూ ‘‘​కీలక వడ్డీరేట్లు తక్కువగా ఉన్నప్పుడే ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కోనేందుకు విధాన నిర్ణేతలు ఉద్దీపన చర్చలు అమలుపరచాలి. అంతేకాని ఆర్థిక విపత్తు బయటపడే వరకు వేచి ఉండాల్సి అవసరం లేదు’’ అని తెలిపారు. ఫెడ్‌ వడ్డీరేట్ల తగ్గింపునకు సూచనప్రాయంగా ఉన్న విలియన్స్‌ వాఖ్యలతో పసిడి ధరను ప్రభావితం చేసే డాలర్‌ ఇండెక్స్‌ రెండు వారాల కనిష్టానికి పతనమైంది. నేడు మరింత క్షీణించి 97 స్థాయిని కోల్పోయింది. అలాగే బాండ్‌ ఈల్డ్‌ సైతం కనిష్టస్థాయిలను తాకింది. మరోవైపు ఇరాన్‌ - అమెరికా దేశాల మధ్య ఉద్రికత్తలు తారాస్థాయికి చేరాయి. అమెరికా మిలటరీకి చెందిన డ్రోన్‌ను ఇరాన్‌ సైన్యం కూల్చివేసిందని యూఎస్‌ అధికారులు ఆరోపించారు. అయితే ఇరాన్‌ ఉన్నాధికారులు డ్రోన్‌ కూల్చివేతపై ఇప్పటికి వరకు తమకు ఎలాంటి సమాచారం అందలేదని తెలిపారు. "పసిడి ధర ప్రస్తుతం 1,400 డాలర్ల పైన ట్రేడవుతోంది. తిరిగి 1,360- 1,375 డాలర్ల శ్రేణికి పతనమయ్యే అవకాశాలు ఇప్పట్లో లేవు. రానున్న రోజుల్లో కూడా పసిడి ర్యాలీ ఇలాగే కొనసాగవచ్చు’’ అని బులియన్‌ విశ్లేషకుడు స్టీఫెన్‌ అభిప్రాయపడ్డారు.
దేశీయంగా రూ.35000ల పైన:- 
క్రితం ట్రేడింగ్‌ సెషన్‌లో తొలిసారి రూ.35000లపై ముగిసిన పసిడి ధర నేడు కూడా ఈ స్థాయిపైనే ట్రేడ్‌ అవుతోంది. ఎంసీఎక్స్‌లో ఆగస్టు ఫ్యూచర్‌ కాంట్రాక్టు 10 గ్రాముల పసిడి ధర ఉదయం గం.11:00ని.లకు రూ.169.00 లు పెరిగి రూ.35325 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఫారెక్స్‌ మార్కెట్లో డాలర్‌ మారకంలో రూపాయి విలువ రికవరి అవుతుండటం పసిడి ర్యాలీ కొంతమేర అడ్డుకుంటుంది. నిన్నరాత్రి ఎంసీఎక్స్‌ మార్కెట్‌ ముగింపు సమయానికి 10గ్రాముల పసిడి ధర రూ.278లు పెరిగి రూ.35590 వద్ద స్థిరపడింది.You may be interested

సెన్సెక్స్‌ 400 పాయింట్లు క్రాష్‌..

Friday 19th July 2019

ఆరంభ లాభాల్ని కోల్పోయిన సూచీలు భారీ నష్టాలను మూటగట్టుకుంటున్నాయి. అన్ని రంగాలకు చెందిన షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తుడటంతో సూచీల పతనం కొనసాగుతుంది. ముఖ్యంగా అటో, బ్యాంకింగ్‌, ఫైనాన్స్‌రంగాలకు చెందిన షేర్లు ఎక్కువగా అమ్మకాల ఒత్తిడికి లోనవుతున్నాయి. మిడ్‌ సెషన్‌ సమయానికి సెన్సెక్స్‌ 419 పాయింట్లు నష్టపోయి 38,478 వద్ద, నిఫ్టీ 131 పాయింట్లు క్షీణించి 11500 స్థాయిని కోల్పోయి 11,466.45 వద్ద ఇంట్రాడే కనిష్టాలను నమోదు చేశాయి. అంతర్జాతీయ మార్కెట్లలో

ప్రభుత్వ బ్యాంక్‌ షేర్లు నష్టాల్లో

Friday 19th July 2019

నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్‌ ఇండెక్స్‌ 1.84 శాతం నష్టపోయి 3,019.80 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. ఈ ఇండెక్స్‌లో బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా 2.80 శాతం,  బ్యాంక్‌ ఇండియా 2.13 శాతం, యూనియన్‌ బ్యాంక్‌ 1.93 శాతం,  సిండికేట్‌ బ్యాంక్‌ 1.81 శాతం, సెంట్రల్‌ బ్యాంక్‌1.80 శాతం, ఎస్‌బీఐ 1.80 శాతం నష్టపోయాయి. వీటితో పాటు అలహాబాద్‌ బ్యాంక్‌ 1.67 శాతం, ఇండియన్‌ బ్యాంక్‌ 1.52 శాతం, కెనరా బ్యాంక్‌ 1.32

Most from this category