News


రూ.1200 పతనమైన పసిడి

Thursday 9th January 2020
Markets_main1578548814.png-30795

దేశీయ బులియన్‌ మార్కెట్లో బంగారం ధర రికార్డు స్థాయి నుంచి భారీగా వెనక్కి వచ్చింది. ఒక్కరోజు వ్యవధిలోనే ఏకంగా రూ.1200లు నష్టాన్ని చవిచూసింది. నిన్నటి రోజున బంగారం ధర రూ.41,293 వద్ద రికార్డు గరిష్టాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. మెరికా, ఇరాన్‌ మధ్య యుద్ధ ఉ‍ద్రిక్తతలు తగ్గముఖం పట్టడంతో అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధర దిగిరావడం, దేశీయంగా ఫారెక్స్‌ మార్కెట్లో డాలర్‌ మారకంలో రూపాయి అనూహ్య రికవరి, రికార్డు ధర గరిష్టస్థాయికి అందుకున్న నేపథ్యంలో ట్రేడర్లు లాభాల స్వీకరణకు పూనుకోవడం తదితర అంశాలు బంగారం దిగివచ్చేందుకు కారణమయ్యాయి. ఫలితంగా నేటి ఉదయం ట్రేడింగ్‌ సెషన్‌లో నిన్నటి రికార్డు స్థాయి(రూ.41,293) నుంచి రూ.1211లు నష్టంతో రూ.40082.00 వద్ద ట్రేడ్‌ అవుతోంది. బంగారం ధరలు మరింత దిగివచ్చే అవకాశం ఉందని, అప్‌సైడ్‌ ట్రెండ్‌ కనబరిచే రూ.40,300 వద్ద నిరోధస్థాయిని, డౌన్‌ సైడ్‌ను కనబరిస్తే రూ.39,800 వద్ద మద్దతు స్థాయిని కలిగి ఉందని బులియన్‌ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

అంతర్జాతీయంగా ఏడేళ్ల గరిష్టం నుంచి 55డాలర్ల నష్టం:- 
అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర ఏడేళ్ల గరిష్టస్థాయి( 1612 డాలర్లు) నుంచి దిగివచ్చింది. ఇరాన్ జరిపిన క్షిపణి దాడులతో తమ సైనికులెవరూ చనిపోలేదని, తమ మిలటరీ స్థావరాలకు కొంత నష్టం మాత్రం వాటిల్లిందని బుధవారం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ వెల్లడించారు. శాంతిని కోరుకునే అందరితో అమెరికా సామరస్యపూర్వక సంబంధాలనే కోరుకుంటుంది’ అని ఇరాన్‌ నాయకత్వానికి, ప్రజలకు స్పష్టం చేశారు. అమెరికా ఇరాన్‌కు శాంతి సందేశం పంపడంతో ఇరుదేశాల మధ్య యుద్ధ ఉద్రిక్తతలు తగ్గముఖం పట్టాయి. ఫలితంగా నిన్నరాత్రి అమెరికాలో బంగారం ధర 11రోజుల వరుస లాభాలకు ముగింపు పలుకుతూ తొలిసారి నష్టాలతో ముగిసింది. దాదాపు 14డాలర్ల నష్టంతో 1,560 డాలర్ల వద్ద స్థిరపడింది. ఇక నేటి ఉదయం ఆసియా ట్రేడింగ్‌లో 2.50డాలర్ల నష్టంతో 1,557.50డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. అంటే అంతర్జాతీయంగా బంగారం ధర ఏడేళ్ల గరిష్టం నుంచి 55డాలర్లు నష్టాన్ని చవిచూసింది. 



You may be interested

సన్‌టెక్‌, ఐబీ హౌసింగ్‌.. జూమ్‌

Thursday 9th January 2020

సెన్సెక్స్‌ 530 పాయింట్లు అప్‌ 150 పాయింట్లు ఎగసిన నిఫ్టీ పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రికత్తలు చల్లబడుతున్న సంకేతాలతో ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్టర్లకు హుషారొచ్చింది. దీంతో బుధవారం అమెరికా స్టాక్‌ మార్కెట్లు సరికొత్త గరిష్టాలను అందుకోగా.. దేశీయంగానూ సెంటిమెంటు బలపడింది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో ట్రేడింగ్‌ ప్రారంభంలోనే మార్కెట్లు జోరందుకున్నాయి. ఉదయం 11 ప్రాంతంలో సెన్సెక్స్‌ 529 పాయింట్లు జంప్‌చేసింది. 41,347 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ సైతం 153 పాయింట్లు ఎగసి 12,178కు చేరింది.

ఇండస్‌ఇండ్‌, ఎయిర్‌టెల్‌, మారుతీ అప్‌

Thursday 9th January 2020

సెన్సెక్స్‌ 445 పాయింట్లు జూమ్‌ నిఫ్టీ 135 పాయింట్లు ప్లస్‌ పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రికత్తలు చల్లబడుతున్న సంకేతాలతో ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్టర్లకు హుషారొచ్చింది. దీంతో బుధవారం అమెరికా స్టాక్‌ మార్కెట్లు సరికొత్త గరిష్టాలను అందుకోగా.. దేశీయంగానూ సెంటిమెంటు బలపడింది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో ట్రేడింగ్‌ ప్రారంభంలోనే మార్కెట్లు జోరందుకున్నాయి. ఉదయం 10.15 ప్రాంతంలో సెన్సెక్స్‌ 445 పాయింట్లు జంప్‌చేసింది. 41,263 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ సైతం 135 పాయింట్లు ఎగసి 12160కు చేరింది.

Most from this category