News


ఆరంభలాభాలు ఆవిరి: అరడాలరు లాభంతో ముగిసిన పసిడి

Saturday 26th October 2019
Markets_main1572078963.png-29166

ఇంట్రాడేలో ఆర్జించిన లాభాలను నిలుపుకోవడంలో విఫలం కావడంతో పసిడి ధర శుక్రవారం రాత్రి అమెరికా మార్కెట్లో కేవలం అరడాలరు స్వల్ప లాభంతో 1,505.30 డాలర్ల వద్ద ముగిసింది. అమెరికా కన్జూ‍్యమర్‌ గణాంకాలు సెప్టెంబర్‌లో బలహీనంగా నమోదయ్యాయి. ఈ బలహీన గణాంకాలు వచ్చేవారంలో ఫెడ్‌రిజర్వ్‌తో పాటు పలు కేంద్ర బ్యాంకుల వడ్డీరేట్ల తగ్గింపునకు పురిగొల్పవచ్చని మార్కెట్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. వడ్డీరేట్ల తగ్గింపు అనేది పసిడి ర్యాలీకి తోడ్పాటును ప్రోత్సహించే అంశం. వడ్డీరేట్ల తగ్గింపు అంచనాలతో పసిడి ధర క్రితం ముగింపు ధర(1,505డాలర్లు)తో పోలిస్తే 25 డాలర్లు లాభపడి 1530డాలర్ల స్థాయికి ఎగిసింది. అనంతరం అమెరికా-చైనాల మధ్య జరుగుతున్న మొదటి దశ వాణిజ్య చర్చల ఒప్పందం దాదాపు కుదిరినట్లే అనే వార్తలు వెలుగులోకి రావడంతో పసిడికి ప్రతికూలంగా మారాయి. అలాగే గరిష్టస్థాయి వద్ద పసిడి ఫ్యూచర్లలో లాభాల స్వీకరణ చోటు చేసుకోవడంతో ఇంట్రాడేలో ఆర్జించిన లాభాలన్ని హరించుకుపోయాయి. ఫలితంగా ఇంట్రాడే గరిష్టం(1530డాలర్లు) నుంచి దాదాపు 27 డాలర్లు నష్టపోయి 1,503.10 డాలర్ల కనిష్టానికి పతనమైంది. చివరికి అరడాలరు స్వల్ప లాభంతో 1,505.30 డాలరు వద్ద స్థిరపడింది. అక్టోబర్‌ 09 తరువాత ఒకరోజు ట్రేడింగ్‌ సెషన్‌లో అధిక వాల్యూమ్స్‌తో ట్రేడ్‌ అవుడం నిన్నటి రోజే. అయినప్పటికీ పసిడి  సాంకేతికంగా కీలకమైన 1500డాలర్ల స్థాయిపైనే ఈ వారాన్ని ముగించడటం సానుకూలాశం.ఇక వారం పరంగా చూస్తే పసిడి ధర 0.8శాతం లాభపడింది. వరసగా రెండో వారమూ లాభాల ముగింపే కావడం విశేషం. వచ్చేవారంలో ఫెడ్‌రిజర్వ్‌ ద్రవ్యపరపతి సమావేశాలు, బ్రెగ్జిట్‌ అంశం, అమెరికా చైనాల మధ్య వాణిజ్య చర్చల తుది ఫలితాలు పసిడికి కీలకం కానున్నాయి. పసిడి స్వల్పకాలానికి 1,475 - 1,525డాలర్ల స్థాయిలో కదలాడవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
దేశీయంగానూ ఒడిదుడకుల ట్రేడింగ్‌:- 
అంతర్జాతీయ ట్రెండ్‌కు అనుగుణంగానే దేశీయ పసిడి ఫ్యూచర్ల ట్రేడింగ్‌ ఒడిదుడుకులమయంగా సాగింది. నిన్నటి డిసెంబర్‌ కాంటాక్టు 10గ్రాముల పసిడి ధర రూ.38,332.00 వద్ద ప్రారంభమైంది. ఇంట్రాడేలో తొలుత పసిడి ధరకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో గురువారం ముగింపు (రూ.38352)తో పోలిస్తే రూ.264 వరకు లాభపడి రూ.38,618.00 వద్ద ఇంట్రాడే గరిష్టస్థాయికి ఎగిశాయి. అనంతరం అమ్మకాల ఒత్తిడికి లోనై ఇంట్రాడే గరిష్టం(రూ.38,618.00) నుంచి రూ.403లు నష్టపోయి రూ.38,618.00 స్థాయికి పతనమయ్యాయి. చివరికి రూ.83.00ల నష్టంతో రూ.38269.00 వద్ద స్థిరపడింది. You may be interested

ఐసీఐసీఐ నికరలాభం రూ. 655 కోట్లు

Saturday 26th October 2019

సెప్టెంబర్‌ త్రైమాసికానికి ఐసీఐసీఐ బ్యాంకు  నికరలాభం గతేడాదితో పోలిస్తే సుమారు 28 శాతం క్షీణించింది. ఈ త్రైమాసికంలో బ్యాంకు రూ. 655 కోట్ల లాభం ప్రకటించింది, గతేడాది ఇదే కాలంలో బ్యాంకు రూ. 909 కోట్ల లాభం నమోదు చేసింది. అనలిస్టులు ఈ క్యు2లో రూ. 975.6 కోట్ల లాభం అంచనా వేశారు.  ఈ త్రైమాసికంలో బ్యాంకు ఆస్తుల నాణ్యత మెరుగైంది. క్యు2లో బ్యాంకు స్థూల ఎన్‌పీఏలు గత త్రైమాసికంలో

మరోసారి బ్రెగ్జిట్‌ గడువును పొడిగించిన ఈయూ

Saturday 26th October 2019

బ్రెగ్జిట్‌ (యూరోపియన్‌ యూనియన్‌ నుంచి బ్రిటన్‌ వైదొలగడం) డెడ్‌లైన్‌ను ఈయూ(యురోపియన్‌ యూనియన్‌) మరోసారి పొడిగించింది. కానీ బ్రిటన్‌లోని రాజకీయ పరిస్థితుల కారణంగా ఈ పొడిగింపునకు ఎటువంటి తేదీని ప్రకటించలేదు. కాగా గత వారం ప్రధాని జాన్సన్‌ బోరిస్‌ బ్రెగ్జిట్‌ డీల్‌, బ్రిటన్‌ పార్లమెంట్‌లోకి వచ్చినప్పటికి, మెజార్టీ ఆమోదం పొందలేకపోయిన విషయం తెలిసిందే. యూరోపియన్‌ యూనియన్‌కు చెందిన 27 దేశాల అంబాసిడర్‌లు బ్రెగ్జిట్‌ ఒప్పందం గడువు పెంచడంపై శుక్రవారం సమావేశమై గడువు పొడిగించాలని నిర్ణయించారు. కాగా

Most from this category