News


1400డాలర్ల వద్దకు పసిడి ధర

Monday 8th July 2019
Markets_main1562559819.png-26878

ఫెడ్‌ రిజర్వ్‌ బ్యాంకు కీలక వడ్డీరేట్ల కోతకు అంచనాలు బలపడటంతో ప్రపంచమార్కెట్లో పసిడి ధర 1400డాలర్ల స్థాయికి చేరుకున్నాయి. ఆసియా ట్రేడింగ్‌లో ఔన్స్‌ పసిడి ధర 1డాలరు స్వల్ప లాభంతో 1,401.35 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. అమెరికా లేబర్‌ డిపార్ట్‌మెంట్‌ శుక్రవారం జూన్‌ నెల ఉద్యోగ గణాంకాలను విడుదల చేసింది. సూమరు 2.24లక్షల కొత్త ఉద్యోగాల కల్పన జరిగింది. అంచనాలకు మించి ఉద్యోగాల కల్పన జరగడంతో ఈ నెలలో జరిగే ఫెడ్‌ రిజర్వ్‌ బ్యాంకు వడ్డీరేట్ల కోత వుండబోదని మార్కెట్‌ వర్గాలు భావిస్తున్నారు. అలాగే శుక్రవారం ఆరు ప్రధాన కరెన్సీ విలువల్లో డాలర్‌ ఇండెక్స్‌ రెండువారాల గరిష్ట స్థాయి 97.443ని అందుకోగా ట్రెజరీ బాండ్‌ ఈల్డ్‌​ సైతం కనిష్టస్థాయి నుంచి కోలుకుంది. ఫలితంగా శుక్రవారం అమెరికా మార్కెట్లో పసిడి ధర 21డాలర్లు(1.50శాతం) నష్టపోయి 1,400.10 డాలర్ల వద్ద స్థిరపడింది.  నేడు ఆసియా ట్రేడింగ్‌లో గత ముగింపు వద్ద  స్థిరంగా ట్రేడ్‌ అవుతోంది. ఈ నేపథ్యంలో నేడు  ఈవారం అమెరికా కాంగ్రెస్‌ ఎదుట ఫెడ్‌ ఛైర్మన్‌ జెరోమి పావెల్‌ చేసే ప్రసంగంపై ట్రేడర్లు దృష్టిని సారించారు. ముఖ్యంగా వడ్డీ రేట్ల కోతపై ఎలాంటి సంకేతాలు ఇస్తారోనని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
దేశీయంగా స్థిరంగానే:- 
క్రితం వారంలో మూడేళ్ల గరిష్టానికి చేరుకున్న ఆగస్టు ఫ్యూచర్‌ కాంట్రాక్టు పసిడి ధర నేటి ట్రేడింగ్లో స్థిరంగా ట్రేడ్‌ అవుతోంది. నేడు ఎంసీఎక్స్‌లో మార్కెట్లో పసిడి ఆగస్టు ఫ్యూచర్‌ కాంట్రాక్టు ధర గత వారం ముగింపు ధర(రూ.34583) రూ.3.00ల స్వల్ప లాభంతో రూ.34586.00ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. నేడు ఫారెక్స్‌ మార్కెట్లో డాలర్‌ మారకంలో బలహీనతతో ఈక్విటీ మార్కెట్లో పతనంతో ఇన్వెస్టర్లు, ట్రేడర్లు పసిడి ఫ్యూచర్ల అమ్మకానికి పూనుకోకుండా అట్టిపెట్టుకున్నారు. ఆర్థిక మంత్రి బడ్జెట్లో పసిడి దిగుమతులపై కస్టమ్స్‌ సుంకం పెంచడంతో రూ.35,100 వద్ద మూడేళ్ల గరిష్ట స్థాయిని నమోదు చేసి, రూ.రూ.34583ల వద్ద ముగిసింది.



You may be interested

మార్కెట్‌పై బడ్జెట్‌ నిర్ణయాల ప్రభావం

Monday 8th July 2019

మార్కెట్‌పై బడ్జెట్‌ నిర్ణయాల ప్రభావం ఐఐపీ, ద్రవ్యోల్బణం, కార్పొరేట్‌ ఫలితాల పాత్ర కూడా ఈ వారం మార్కెట్‌ గమనంపై నిపుణుల అంచనాలు 9న టీసీఎస్‌, 12న ఇన్ఫోసిస్‌ ఫలితాలు న్యూఢిల్లీ: గత శుక్రవారం బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి ప్రవేశపెట్టిన కీలక నిర్ణయాలు, ప్రతిపాదనల ప్రభావం ఈ వారం మార్కెట్‌పై ఉంటుందని, అలాగే ఐఐపీ(పారిశ్రామికోత్పత్తి), ద్రవ్యోల్బణం వంటి స్థూల ఆర్థిక గణాంకాలపైనా ఇన్వె‍స్టర్ల దృష్టి ఉంటుందని అనలిస్టులు అంచనా వేస్తున్నారు. ఇక జూన్‌ త్రైమాసికానికి సంబంధించి విడుదలయ్యే

68.55 వద్ద రూపీ ప్రారంభం​

Monday 8th July 2019

డాలర్‌ మారకంలో రూపీ సోమవారం ట్రేడింగ్‌లో(జులై 8) 5పైసలు బలహీనపడి 68.55 వద్ద ప్రారంభమైంది. బడ్జెట్‌ నేపథ్యంలో గత సెషన్‌లో రూపీ డాలర్‌ మారకం‍లో 39 పైసలు బలపడి 68. 50 వద్ద ముగిసిన విషయం తెలిసిందే.  ఉదయం 9.35 సమయంలో రూపీ డాలర్‌ మారకంలో 0.19 శాతం బలపడి 68.54గా ఉంది. ఈ రోజు డాలర్‌ మారకంలో రూపీ  68.70 -69.35 మధ్య కదలాడవచ్చని నిపుణులంటున్నారు.

Most from this category