News


1500డాలర్ల దిగువకు పసిడి

Monday 30th September 2019
Markets_main1569821671.png-28621

అమెరికా చైనాల మధ్య వాణిజ్య యుద్ధ ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టడంతో ప్రపంచమార్కెట్లో పసిడి ధర 1500డాలర్ల దిగువకు చేరుకుంది. ఆసియాలో సోమవారం ఔన్స్‌ పసిడి ధర 8డాలర్లు (అరశాతం) క్షీణించి 1,498.55 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. బీజింగ్, వాషింగ్టన్‌ లు తమ మధ్య నెలకొన్న వాణిజ్య వివాదాన్ని "ప్రశాంతమైన మరియు హేతుబద్ధమైన వైఖరితో" పరిష్కరించుకుంటాయని చైనా ఉప వాణిజ్యమంత్రి వాంగ్ షౌవెన్ ఆదివారం తెలిపారు.ఇరుదేశాలకు చెందిన  ఉన్నతస్థాయి అధికారుల మధ్య వచ్చేనెల రెండోవారంలో చర్చలు జరుగున్నాయి. అమెరికా స్టాక్‌ ఎక్చ్సేంజీల నుంచి చైనా కంపెనీలను డీలిస్టింగ్‌ చేసేకునేందుకు ట్రంప్‌ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నట్లు శనివారం వార్తలు వెలువడ్డాయి. అయితే డీలిస్టింగ్‌ ఎప్పుడు, ఏ విధంగా చేస్తారో అనే అంశాలపై ఎలాంటి సమాచారం లేదని ట్రెజరీ ఉన్నతాధికారులు తెలిపారు. అమెరికా చైనాల మధ్య సాగుతున్న వాణిజ్య యుద్ధం కారణంగా ఆగస్ట్‌లో యూఎస్‌ కన్జూ‍్యమర్‌ వ్యయం కొద్దిగా పెరిగింది. అలాగే వ్యాపార పెట్టుబడులు తగ్గిన నేపథ్యంలో మూడో త్రైమాసికంలో ఆర్థికవేత్తలు అమెరికా వృద్ధి​అంచనాలను తగ్గించే అవకాశం ఉంది. 
దేశీయంగా రూ.150లు తగ్గుదల:-
అంతర్జాతీయ ట్రెండ్‌కు అనుగుణంగా దేశీయ బులియన్‌ మార్కెట్లో పసిడి ధర తగ్గుముఖం పట్టింది. సోమవారం ఫార్కెట్లో అక్టోబర్‌ కాంటాక్టు 10గ్రాముల పసిడి ధర రూ.150.00లు తగ్గి రూ.37600.00 వద్ద ట్రేడ్‌ అవుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధర 1500 డాలర్ల స్థాయిని కోల్పోవడం, ఫారెక్స్‌ మార్కెట్లో రూపాయి విలువ బలపడం పసిడి ధరకు ప్రతికూలంగా మారింది. 



You may be interested

ఆర్‌బీఐ పీసీఏ అమలు..లక్ష్మీ విలాస్‌ బ్యాంక్‌ లోయర్‌ సర్క్యూట్‌

Monday 30th September 2019

  లక్ష్మీ విలాస్‌ బ్యాంక్‌(ఎల్‌వీబీ)పై దిద్దుబాటు చర్యల(ప్రాంప్టడ్‌ కరెక్టివ్‌ యాక్సన్‌(పీసీఏ))ను ఆర్‌బీఐ(రిజర్వ్‌ బ్యాంక్‌) ప్రారంభించడంతో ఈ బ్యాంక్‌ షేరు విలువ సోమవారం ట్రేడింగ్‌లో 5 శాతం నష్టపోయి లోయర్‌ సర్క్యూట్‌ వద్ద ఫ్రీజ్‌ అయ్యింది. లక్ష్మీ విలాస్‌ బ్యాంక్‌ అధిక మొత్తంలో మొండిబకాయిలను కలిగివుండడంతోపాటు, మూలధనం తగినంత లేకపోవడం, వరుసగా రెండేళ్ల నుంచి ఆస్తులపై ప్రతికూల రాబడులను ఇవ్వడం వలన ఆర్‌బీఐ ఈ దిద్దుబాటు చర్యలను ప్రారంభించింది. దీంతో ఈ

యస్‌బ్యాంక్‌ 13శాతం క్రాష్‌..!

Monday 30th September 2019

ప్రైవేట్‌రంగ బ్యాంక్‌ యస్‌బ్యాంక్‌ షేర్లు సోమవారం ట్రేడింగ్‌ ప్రారంభంలోనే 13శాతం నష్టాన్ని చవిచూశాయి. నేడు ఎస్‌ఈలో ఈ బ్యాంక్‌ షేర్లు రూ.48.25 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. నేడు మార్కెట్లో బ్యాంకింగ్‌ రంగ షేర్ల పతనంలో భాగంగా ఈ బ్యాంకు షేర్లు కూడా తీవ్రమైన అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కోన్నాయి. ఫలితంగా ట్రేడింగ్‌ ప్రారంభంలోనే 13శాతం నష్టపోయి రూ.42.40 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని నమోదు చేసింది. ఉదయం గం.10:10లకు షేర్లు క్రితం ముగింపు(రూ.48.75)తో

Most from this category