News


ఆరేళ్ల గరిష్టం నుంచి దిగొచ్చిన పసిడి ధర

Tuesday 27th August 2019
Markets_main1566886320.png-28046

ప్రపంచమార్కెట్లో పసిడి ధర ఆరేళ్ల గరిష్టం నుంచి దిగివచ్చింది. అమెరికా-చైనాల మధ్య వాణిజ్య పరిష్కార చర్చలు తెరపైకి రావడం ఇందుకు తోడ్పడింది. ఆసియాలో ఉదయం ట్రేడింగ్‌లో ఔన్స్‌ పసిడి ధర 1.25డాలరుతో 1,538.45డాలర్ల వద్ద ట్రేడింగ్‌ అవుతోంది. అయితే.., మంగళవారం వాణిజ్య చర్చలపై చైనా  అమెరికాకు గందరగోళ సంకేతాలను పంపడంతో పాటు అమెరికా చేసే డిమాండ్లకు తాము కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదని చైనా స్పష్టత చేసింది. ఈ వివాస్పద వ్యాఖ్యలు పసిడి ధరకు మద్దతునిస్తున్నాయి. నిన్నరాత్రి ట్రంప్‌ బీజింగ్‌ వాణిజ్య అధికారులు చర్చలు సిద్ధంగా ఉన్నారనే ప్రకటనతో రాత్రి అక్కడి మార్కెట్‌ ముగిసే సరికి 15డాలర్లు క్షీణించి 1,537.20డాలర్ల వద్ద స్థిరపడింది.  
రికార్డు స్థాయి వద్ద స్థిరమైన ట్రేడింగ్‌:-
ఇక దేశీయ ఎంసీఎక్స్‌ మార్కెట్లోనూ పసిడి ధర రికార్డు స్థాయి వద్ద స్థిరంగా ట్రేడ్‌ అవుతోంది. నేడు ఎంసీఎక్స్‌ మార్కెట్లో అక్టోబర్‌ కాంటాక్డు 10గ్రాముల పసిడి ధర క్రితం గతవారం ముగింపు ధర(రూ.38828)తో పోలిస్తే రూ.31ల స్వల్పనష్టంతో రూ. 38,797.00 వద్ద ప్రారంభమైంది. ఉదయం గం.11:15 ని.లకు రూ.50.00 లాభంతో రూ.38878.00 వద్ద ట్రేడ్‌ అవుతోంది. 



You may be interested

సిప్‌తో రిస్కు తగ్గించుకోండి!

Tuesday 27th August 2019

చిన్న స్టాకుల్లో పెట్టుబడులపై నిపుణుల సలహాలు గత కరెక‌్షన్‌లో భారీగా పతనమైన చిన్నస్టాకుల్లో పెట్టుబడులు పెట్టాలనుకునే  ఇన్వెస్టర్లు సిప్‌(సిస్టమేటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌) మార్గాన్ని ఎంచుకోవాలని వెల్త్‌ మేనేజర్లు సూచిస్తున్నారు. గతేడాది జనవరి నుంచి చాలా చిన్న స్టాకులు దాదాపు 70 శాతం మేర పతనమయ్యాయి. దీంతో వీటి వాల్యూషన్లు బాగా చౌకగా మారాయి. అయితే ఎర్నింగ్స్‌ ఆందోళనల నేపథ్యంలో వీటిలో వెనువెంటనే భారీ రికవరీ ఉండకపోవచ్చని నిపుణుల అంచనా. అందువల్ల ఇలాంటి

ముగిసిన ఇన్ఫోసిస్‌ ‘బై బ్యాక్‌’

Tuesday 27th August 2019

ఈ ఏడాది మార్చిలో ప్రారంభమైన రూ. 8,260 కోట్ల బైబ్యాక్ ఆఫర్ ద్వారా 11.05 కోట్ల షేర్లను తిరిగి కొనుగోలు చేశామని దిగ్గజ ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్‌ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో సోమవారం పేర్కొంది. అగష్టు 26 వరకు, 11,05,19,266 ఈక్విటీ షేర్లను, షేరు రూ. 747.38 చొప్పున బై బ్యాక్‌ చేశామని, రూ. 82,59,99,99,430.03 నగదును ఉపయోగించి గరిష్ఠంగా 99.999999 శాతం షేర్లను తిరిగి కొనుగోలు చేయగలిగామని కంపెనీ తెలిపింది.

Most from this category