News


స్థిరంగా పసిడి ధరలు

Friday 5th July 2019
Markets_main1562303552.png-26811

ప్రపంచమార్కెట్లో మార్కెట్లో పసిడి ధరలు స్థిరంగా ట్రేడ్‌ అవుతున్నాయి. డాలర్‌ ఇండెక్స్‌ స్థిరమైన ర్యాలీ, ఆసియా మార్కెట్లు రెండు నెలల గరిష్టం వద్ద ట్రేడ్‌ అవుతుండటం ఇందుకు కారణమవుతున్నాయి. ఆసియా శుక్రవారం ఉదయం ట్రేడింగ్‌లో ఔన్స్‌ పసిడి ధర 1డాలరు స్వల్ప నష్టంతో 1,420డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. అమెరికా నేడు విడుదల చేసే జూన్‌ మాసపు వ్యవసాయేతర ఉద్యోగ గణాంకాల విడుదల కోసం పసిడి ఇన్వెస్టర్లు ఎదురు చూస్తున్నారు. ఫెడ్‌ వడ్డీరేట్లపై ప్రభావాన్ని చూపే గణాంకాలు ఈ జూన్‌లో అంచనాలకు మించిన నమోదు కావచ్చన విశ్లేషకులు భావిస్తున్నారు. జూన్‌లో 1.60లక్షల ఉద్యోగాల కల్పన జరగవచ్చని వారు అంచనా వేస్తున్నారు. ఈ నెల జూన్‌ 30-31 తేదిల్లో ఫెడ్‌ రిజర్వ్‌ బ్యాంక్‌ కీలక వడ్డరేట్లపై 25 బేసిస్‌ పాయింట్ల కోత విధింపు ఉంటుందని మార్కెట్‌ వర్గాలు అంచనా వేస్తున్నారు. ఆరు ప్రధాన కరెన్సీ విలువల్లో డాలర్‌ ఇండెక్స్‌ స్థిరంగా ట్రేడ్‌ అవుతోంది. బుధవారం అమెరికా 10ఏళ్ల ట్రెజరీ ఈల్డ్‌ రెండన్నరేళ్ల కనిష్టానికి పతనమైంది.
దేశీయంగానూ స్వల్ప పెరుగుదల:-
దేశీయంగా పసిడి ధర స్వల్పంగానే పెరిగింది. నేడు ఎంసీఎక్స్‌ మార్కెట్లో ఆగస్ట్‌ ఫ్యూచర్‌ కాంటాక్టు 10గ్రాముల పసిడి ధర ఉదయం గం.10:30లకు రూ.80.00లు లాభపడి రూ.34,297.00ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. నిన్నటి మార్కెట్‌ ఫారెక్స్‌లో డాలర్‌ మారకంలో రూపాయి 39 పైసలు బలపడిన నేపథ్యంలో ఎంసీఎక్స్‌ ముగింపు సమయానికి రూ.6ల స్వల్ప నష్టంతో రూ.34, 240ల వద్ద ముగిసింది.



You may be interested

బడ్జెట్‌-2019 అప్‌డేట్‌: ద్రవ్యలోటు లక్ష్యం 3.3 శాతం

Friday 5th July 2019

కేంద్ర బడ్జెట్‌ 2019ని ఆమోదించిన కేబినెట్‌ . 1.85 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థను గత ఐదేళ్లలో 2.7 ట్రిలియన్‌ డాలర్లకు పెంచాం. ఇది 2020 ఆర్థిక సంవత్సరంలో 3 ట్రిలియన్‌ డాలర్లకు పెరగనుంది. ఇంకొన్నేళ్లలో 5 ట్రిలియన్‌ డాలర్లే లక్ష్యం. మౌలిక, డిజిటల్‌, ఎమ్‌ఎస్‌ఈలలో ఉద్యోగ కల్పనకు అధికంగా పెట్టుబడులు. సాగరమాల, భారతమాల పథకాల వలన మౌలిక రంగం అభివృద్ది. జీఎస్‌టీ నమోదైనా ఎస్‌ఎంఈలకు రూ. 350 కోట్ల రాయితీలు కేటాయించాం. ఒకే దేశం ఒకే పవర్‌ గ్రిడ్‌కు కట్టుబడి

శుక్రవారం వార్తల్లోని షేర్లు

Friday 5th July 2019

వివిధ వార్తలకు అనుగుణంగా శుక్రవారం ప్రభావితమయ్యే షేర్ల వివరాలు  యస్‌ బ్యాంక్‌:- ఎవర్‌గ్రీన్‌ తనఖా పెట్టిన 9.47శాతం వాటాకు సమానమైన ఈక్విటీ షేర్లను స్వాధీనం చేసుకుంది.  డీఎల్‌ఎఫ్‌:- గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి అర్హత కలిగిన షేర్‌ హోల్డర్లకు డివిడెండ్‌ జారీకి రికార్డు తేదికి జూలై 23గా నిర్ణయించింది. మారుతి సుజుకీ:- డీలర్లతో కలిసి కార్ల ధరలను మాన్యుపులేట్‌ ఆరోపణలపై కాంపిటీషన్‌ కమీషన్‌ ఆప్‌ ఇండియా సమగ్ర విచారణకు ఆదేశించింది. జీఎంఆర్‌ ఇన్ఫ్రాస్ట్రక్చర్‌:- జీఎంఆర్‌ చత్తీస్‌ఘడ్‌

Most from this category