News


బంగారం....6ఏళ్ల గరిష్టం నుంచి వెనక్కి

Wednesday 26th June 2019
Markets_main1561522403.png-26573

డాలర్‌ ఇండెక్స్‌ బలపడటంతో ప్రపంచమార్కెట్లో పసిడి ధర బుధవారం 6ఏళ్ల గరిష్టం నుంచి వెనక్కి వచ్చింది. ఆసియా ట్రేడింగ్‌ ఔన్స్‌ పసిడి ధర 9డాలర్లు నష్టపోయి 1,409.35డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. అమెరికా ఫెడ్‌రిజర్వ్‌ ఛైర్మన్‌ పావెల్‌ నిన్న న్యూయార్క్‌ మాట్లాడుతూ కొంతకాలం పాటు కీలక వడ్డీరేట్లపై రాజకీయ ఒత్తిళ్లను పరిగణలోకి తీసుకోవడం లేదని తెలిపారు. పావెల్‌ వ్యాఖ్యలతో ఆ దేశాధ్యక్షుడు ట్రంప్‌ డిమాండ్‌ చేస్తున్న వడ్డరేట్ల కోత విధింపుపై ఆశలు సన్నగిల్లిగాయి. ఫలితంగా డాలర్‌ ఇండెక్స్‌ 3నెలల కనిష్టం స్థాయి నుంచి రికవరి బాట పట్టడంతో పసిడి ఫ్యూచర్లపై అమ్మకాల ఒత్తిడి నెలకొంది. అలాగే 6ఏళ్ల గరిష్టస్థాయి వద్ద పసిడి ట్రేడ్‌ అవుతున్న నేపథ్యంలో ట్రేడర్లు లాభాల స్వీకరణకు పూనుకున్నారు. 
దేశీయంగా లాభాల స్వీకరణ:- గత కొద్దిరోజులుగా దేశీయ బులియన్‌ మార్కెట్లో ర్యాలీ చేస్తున్న పసిడి ఫ్యూచర్లలో నేడు లాభాల స్వీకరణ చోటు చేసుకుంది.  నేడు ఎంసీక్స్ లో ఆగ‌స్ట్ ఫ్యూచ‌ర్ కాంట్రాక్టు ప‌సిడి ధ‌ర క్రితం ట్రేడింగ్‌తో పోలిస్తే రూ.250లు నష్టపోయి 34310.00 వద్ద ట్రేడ్‌ అవుతోంది.  ప్రపంచ‌మార్కెట్లో ప‌సిడి ధ‌ర 6 ఏళ్ల గ‌రిష్టానికి చేరుకోవ‌డం, దేశీయ ఈక్విటీ మార్కెట్లో నెల‌కొన్న అస్థిర‌త, తాజాగా ఇరాన్ పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆంక్షలు విధించ‌డం త‌దిత‌ర ప్రతికూలాంశాల నేపథ్యంలో నిన్నటి ట్రేడింగ్‌లో పసిడి ధర రూ.115లు పెరిగి రూ.34556  ముగిసింది.



You may be interested

పెరిగిన చమురు

Wednesday 26th June 2019

అమెరికా- ఇరాన్‌ దేశాల మధ్య ఉద్రిక్తతలకు తోడు అమెరికా ఆయిల్‌ నిల్వలు అనుకోని రీతిలో తగ్గడంతో బుధవారం (జూన్‌ 26) ట్రేడింగ్‌లో చమురు ధరలు ఒక శాతం పెరిగి ఈ నెలలో గరిష్ఠాన్ని తాకాయి.  బ్రెంట్‌ క్రూడ్‌ 1.4శాతం పెరిగి బ్యారెల్‌కు 65.97 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. మే 31 తర్వాత చమురుకు ఇదే  గరిష్ఠ స్థాయి. గత నెల మే 31న బ్రెంట్‌ ​క్రూడ్‌ బ్యారెల్‌కు 66.00 డాలర్లను

క్షీణించిన రూపాయి

Wednesday 26th June 2019

డాలర్‌ మారకంలో రూపీ బుధవారం(జూన్‌ 26) ట్రేడింగ్‌లో బలహీనపడి 69.40 వద్ద ప్రారంభమైంది. రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గమని ఫెడ్‌ చైర్మన్‌ జెరోమ్‌ పౌల్‌ అనడంతో డాలర్‌ బలపడింది. కానీ అమెరికా సుంకాలు, ఇతర దేశాలతో వాణిజ్య యుద్ధలా వలన రేట్‌ కట్‌ తప్పనిసరిగా అవసరం అని ఆయన తెలిపారు. పశ్చిమాసియా దేశాలలో ఉద్రిక్తతల వలన గత సెషన్‌లో రూపీ ప్లాట్‌గా 69.36 వద్ద ముగిసింది. ఫెడ్‌ వడ్డి రేట్ల కోత

Most from this category