News


స్వల్పంగా పెరిగిన పసిడి

Tuesday 16th July 2019
Markets_main1563257577.png-27088

ప్రపంచమార్కెట్లో పసిడి ధర మంగవారం స్పల్పంగా పెరిగింది . ఆసియాలో ఔన్స్‌ పసిడి ధర 3.50డాలర్లు పెరిగి 1,417 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. అమెరికా ఇవాళ ప్రకటించే రిటైల్‌ అమ్మకాల గణాంకాలు కోసం ట్రేడర్లు ఎదురుచూస్తున్నారు. బలమైన గణాంకాలు నమోదైనట్లేతే పసిడి ధర అమ్మకాల ఒత్తిడికి లోనుకావచ్చని బులియన్‌ మార్కెట్‌ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు డాలర్‌ ఇండెక్స్‌  స్థిరంగా ర్యాలీ చేస్తుండటం కూడా పసిడి ధరపై పెద్దగా ప్రభావాన్ని చూపలేకపోతుంది. ఫెడ్‌ వడ్డీరేట్ల తగ్గింపు అంచనాలు మరింత బలపడంతో నిన్నరాత్రి అమెరికా మార్కెట్లో పసిడి ధర రెండువారాల గరిష్టస్థాయి 1,413.50 డాలర్ల వద్ద ముసింది. పలు దేశాలకు చెందిన సెంట్రల్‌ రిజర్వ్‌ బ్యాంక్‌ వడ్డీరేట్ల తగ్గింపునకు మొగ్గుచూపుతుండటంతో పాటు, ప్రపంచ ఆర్థిక మందగమన భయాలతో పసిడి ధర ఇటీవల ఆరేళ్ల గరిష్టస్థాయి 1,438.63డాలర్లను అధిగమించిన సంగతి తెలిసిందే.
దేశీయంగానూ స్వల్ప పెరుగుదల:- 
అంతర్జాతీయ ట్రెండ్‌కు అనుగుణంగానే దేశీయ బులియన్‌ మార్కెట్లో పసిడి ధర స్వల్పంగానే పెరిగింది. నేడు ఈక్విటీ మార్కెట్ల ర్యాలీ పసిడి ధరపై ఒత్తిడిని పెంచుతోంది. ఎంసీఎక్స్‌ మార్కెట్లో ఆగస్టు ఫ్యూచర్‌ కాంట్రాక్టు 10 గ్రాముల పసిడి ధర ఉదయం గం.11:10ని.లకు రూ.50లు తగ్గి రూ.34,928.00ల వద్ద ట్రేడ్‌ అవుతోంది.



You may be interested

ఈ స్టాకులు పాజిటివ్‌ అంటున్న ఎంఏసీడీ ఇండికేటర్‌!

Tuesday 16th July 2019

ట్రెండ్‌ రివర్సల్‌ గుర్తించేందుకు ఎంఏసీడీ ఇండికేటర్‌ను వాడతారు.  26, 12 రోజుల ఎక్స్‌పొటెన్షియల్‌ మూవింగ్‌ యావరేజెస్‌ మధ్య భేదం ఆధారంగా ఎంఏసీడీ పనిచేస్తుంది. సిగ్నల్‌లైన్‌ ఆధారంగా బై, సెల్‌ అవకాశాలను గణిస్తారు. సిగ్నల్‌లైన్‌కు పైన ఎంఏసీడీ లైన్‌ కదలాడితే బుల్లిష్‌గా, ఈ లైన్‌కు దిగువకు వస్తే బేరిష్‌గా చెప్పవచ్చు. ఎంఏసీడీ రెండు లైన్లు ఒకదానినొకటి క్రాస్‌ చేసే విధానాన్ని బట్టి బేరిష్‌ క్రాసింగ్‌, బుల్లిష్‌ క్రాసింగ్‌గా చెబుతారు.   బుల్లిష్‌ సిగ్నల్స్‌ సోమవారం

మంగళవారం వార్తల్లోని షేర్లు

Tuesday 16th July 2019

వివిధ వార్తలకు అనుగుణంగా మంగళవారం ప్రభావితమయ్యే షేర్ల వివరాలు  కమ్మిన్స్‌ ఇండియా:- కంపెనీ మేనేజింగ్‌ డైరెక్టర్‌గా సందీప్‌ సిన్హా తన పదవికి రాజీనామా చేశారు. బ్రిగేడ్‌ ఎంటర్‌ప్రైజెస్‌:- 1:2 నిష్పత్తిలో షేర్ల బోనస్‌ను ఇష్యూ చేసింది. ప్రమోటర్‌ గ్రూప్‌నకు చెందిన 42.75లక్షల వారెంట్లను ఈక్విటీ షేర్లగా మార్చుకునేందుకు బోర్డు ఆమోదం తెలిపింది. జిందాల్‌ కాటెక్స్‌:- కంపెనీ ఛైర్మన్‌ పదవికి కనిక్‌ శర్మ రాజీనామా చేశారు.  అశోక్‌ లేలాండ్‌:- డిమాండ్‌ తగ్గడంతో పట్నానగర్‌ యూనిట్‌ను జూలై 16

Most from this category