News


పసిడి....మూడేళ్లలో అతిపెద్ద పతనం

Friday 6th September 2019
Markets_main1567747976.png-28234

ప్రపంచమార్కెట్లో పసిడి ధర గురువారం మూడేళ్ల తరువాత ఒకే రోజులో​ అతిపెద్ద పతనాన్ని చవిచూసి రెండువారాల కనిష్టానికి దిగివచ్చింది. వచ్చే నెలలో అమెరికా చైనాల మధ్య మరో దఫా వాణిజ్య చర్చలు జరిపేందుకు ఇరుదేశాలు అంగీకరించడటంతో అమెరికాతో పాటు ప్రపంచ స్టాక్‌ మార్కెట్లకు ఉత్సానిచ్చింది. అమెరికాలోని ప్రైవేట్‌ రంగంలో అంచనాలకు మించి ఉద్యోగాల కల్పన జరిగినట్లు గణాంకాలు వెలువడటం‍తో ఆర్థిక మాంద్య భయాలు తగ్గుముఖం పట్టాయి. ఈ రెండు అంశాలు పసిడి ధరపై ప్రతికూల ప్రభావాన్ని చూపాయి. ఫలితంగా నిన్న రాత్రి అమెరికాలోని డిసెంబర్‌ డెలివరీ కాంటాక్టు ఔన్స్‌ పసిడి ధర 34.90 డాలర్లు(2.2శాతం) క్షీణించి 1,525.50డాలర్ల వద్ద స్థిరపడింది. అమెరికా, చైనా చర్చల బృందం అక్టోబర్‌లో సమావేశం అవుతున్నట్లు గురువారం చైనా కామర్స్‌ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రపంచ ఆర్థిక అవుట్‌లుక్‌ ఆందోళనలు, మాంద్యం భయాలను రేకెత్తిస్తున్న దీర్ఘకాల వాణిజ్య యుద్ధాన్ని అంతం చేయడమే ఈ చర్చల ప్రదాన ఉద్దేశ్యమని తెలిపింది. వాణజ్య చర్చల సఫలంపై ఆశావహనంతో అటు అమెరికా నుంచి యూరప్‌, ఆసియా మార్కెట్లు సైతం లాభాల్లో ముగిశాయి. ‘‘అమెరికా- చైనాల మధ్య వాణిజ్య చర్చల పునఃప్రారంభం అనేది కేవలం అత్యధిక స్థాయిలో పసిడి ఫ్యూచర్ల లాభాల స్వీకరణకు ఒక సాకు మాత్రమే. అమెరికా ఆగస్ట్‌ ఏడీపీ గణాంకాల ప్రకారం ప్రైవేట్‌ రంగంలో 19 లక్షల ఉద్యోగా కల్పన అనేది పసిడి పతనానికి ప్రధాన కారణం. టేడర్లు భావిస్తున్న అమెరికా ఆర్థిక వ్యవస్థ అంత బలహీనంగా లేదు. వడ్డీ రేట్ల తగ్గింపు నెమ్మదిగా ఉండవచ్చు’’ అని ఇన్సిగ్నియా కన్సల్టెంట్స్ చీఫ్ మార్కెట్ అనలిస్ట్ చింతన్ కర్ణాని అభిప్రాయపడ్డారు. నిన్నరాత్రి భారీ పతనాన్ని చవిచూసిన పసిడి ధర శుక్రవారం​ఉదయం ట్రేడింగ్‌లో ఔన్స్‌ పసిడి ధర 1.65డాలర్ల పెరిగి 1,527.15 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది.
దేశీయంగా రూ.929లు పతనం:- 
అంతర్జాతీయ మార్కెట్లో పసిడి మూడేళ్లలో అతిపెద్ద పతనాన్ని చవిచూడటంతో పాటు దేశీయంగా డాలర్‌ మారకపు విలువలో రూపాయి బలపడటంతో నిన్నటి రోజు అక్టోబర్‌ కాంటాక్టు 10గ్రాముల పసిడి ధర రూ.929 నష్టపోయి రూ.38894ల వద్ద స్థిరపడింది. నేడు కూడా రూ.74.00 స్వల్ప పతనంతో రూ.38820.00 వద్ద ట్రేడ్‌ అవుతోంది. 



You may be interested

10900 పాయింట్లే బుల్స్‌కు కీలకం

Friday 6th September 2019

నివేశ్‌ సెక్యూరిటీస్‌ అంచనా నిఫ్టీ 10900 పాయింట్లపైన బలంగా ముగిస్తే బుల్స్‌కు పట్టు చిక్కుతుందని నివేశ్‌ సెక్యూరిటీస్‌ అనలిస్టు మెహుల్‌ కొఠారి చెప్పారు. నిఫ్టీ తదుపరి పయనంపై ఆయన విశ్లేషణ ఇలా ఉంది... రెండు సెషన్లుగా నిఫ్టీ దిగువస్థాయిలకు వెళ్లి బౌన్స్‌ బ్యాక్‌ అవడం, పైస్థాయికి వెళ్లి వెనక్కు రావడం చేస్తోంది. నిఫ్టీకి ప్రస్తుతం 10740 పాయింట్ల వద్ద కీలక మద్దతు ఉంది. ఇక్కడే గత రిలీఫ్‌ ర్యాలీకి 78.6 ఫిబోనాక్కి రిట్రేస్‌మెంట్‌

ఆరంభం అంతంతమాత్రం... కానీ!

Friday 6th September 2019

ముగింపు సమయానికి లాభాల్లోకే.. సెప్టెంబర్‌ సీరిస్‌పై బ్రోకరేజ్‌ల అంచనా వరుసగా మూడు సీరిస్‌లు నెగిటివ్‌గా క్లోజయిన దేశీయ మార్కెట్లు సెప్టెంబర్‌ ఎఫ్‌ అండ్‌ ఓ సీరిస్‌ను పేలవంగా ఆరంభించాయి. దేశీయ ఆర్థిక మందగమనంపై ఆందోళనలు మార్కెట్లో నెగిటివ్‌ సెంటిమెంట్‌కు కారణమవుతున్నాయి. అయితే గతంలో పరిశీలిస్తే సెప్టెంబర్‌ సీరిస్‌ ఎక్కువమార్లు లాభదాయకంగానే ముగిసిందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. నిఫ్టీలో డెరివేటివ్స్‌ను ప్రవేశపెట్టినప్పటి నుంచి కేవలం ఒక్కమారు (2002)లో మాత్రమే సూచీలు వరుసగా నాలుగు సీరిస్‌లు నష్టాలు

Most from this category