News


స్థిరంగా పసిడి ధర

Friday 5th October 2018
Markets_main1538715711.png-20884

పసిడి ధర శుక్రవారం స్థిరంగా ట్రేడ్‌ అవుతోంది. అమెరికా పదేళ్ల బాండ్‌ ఈల్డ్‌ రెండేళ్ల గరిష్టానికి చేరుకోవడం, నేడు అమెరికా ఉద్యోగ గణాంకాలు విడుదల నేపథ్యంలో ఇన్వెస్టర్ల ఎదురుచూపులు ఇందుకు కారణమవుతున్నాయి. ఆసియా ట్రేడింగ్‌లో భారత వర్తమాన కాల ప్రకారం ఉదయం గం.10:00లకు ఔన్స్‌ పసిడి 0.80 డాలర్ల లాభంతో 1,202.40 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. రానున్న రోజుల్లో ఫెడ్‌రిజర్వ్‌ వడ్డీ రేట్లను పెంచుతుందనే అంచనాలతో డాలర్‌ బలపపడంతో పాటు బాండ్‌ ఈల్డ్ పెరుగుతుంది. ఫలితంగా పసిడి ధర స్తబ్దుగా ర్యాలీ చేస్తుంది. మరోవైపు ఆరుకరెన్సీ విలువల్లో డాలర్‌ ఇండెక్స్‌ ఆరువారాల గరిష్టస్థాయి(96.121 స్థాయి) నుంచి స్వల్పంగా తగ్గుముఖం పట్టి 95.76 స్థాయి వద్ద ట్రేడ్‌ అవుతోంది. క్రితం ట్రేడింగ్‌లో ఔన్స్‌ పసిడి 4.50డాలర్లు స్వల్పంగా పెరిగి రాత్రి అమెరికా మార్కెట్లో 1,201.60 డాలర్ల వద్ద ముగిసింది.
దేశీయంగా స్వల్ప తగ్గుదల:-
ఇక దేశీయ మార్కెట్లో పసిడి ధర స్వల్పంగా తగ్గుముఖం పట్టింది. డాలర్‌ మారకంలో రూపాయి ఫ్లాట్‌ ట్రేడింగ్‌, గత రెండు రోజులుగా రూపాయి కనిష్టస్థాయిల నమోదు కారణంగా భారీ లాభపడిన పసిడి ఫ్యూచర్లలో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు పూనుకోవడంతో పసిడి ధర నష్టాల్లో ట్రేడ్‌ అవుతోంది. ఎంసీఎక్స్‌ మార్కెట్‌లో ఉదయం గం.10:30ని.లకు 10గ్రాముల పసిడి రూ.80.00లు లాభపడి రూ.31050.00ల వద్ద ట్రేడ్‌ అవుతోంది.



You may be interested

రికవరీకి సగటున 66 రోజులు?!

Friday 5th October 2018

ఆగస్టు గరిష్ఠాల నుంచి దేశీయ సూచీలు దాదాపు 11 శాతం పతనమయ్యాయి. సెన్సెక్స్‌ దాదాపు 4వేల పాయింట్లు క్షీణించింది. అక్టోబర్‌ వచ్చినా కరెక‌్షన్‌ ఆగకపోవడంతో చిన్న ఇన్వెస్టర్ల నుంచి బడా మదుపరుల వరకు ఆందోళనగా ఉన్నారు. ఇలాగే పరిస్థితి కొనసాగితే ఏం చేయాలని పెద్ద పెద్ద ఫండ్‌ హౌస్‌లు సైతం తలలు బద్దలు కొట్టుకుంటున్నాయి. అయితే గత చరిత్ర పరిశీలిస్తే ఇలాంటి పతనాలు వచ్చినప్పుడల్లా కొత్త పెట్టుబడులు వచ్చి మార్కెట్లు

ఎల్‌ఐసీ ఓపెన్‌ ఆఫర్‌

Friday 5th October 2018

న్యూఢిల్లీ: బీమా దిగ్గజం ఎల్‌ఐసీ, ఐడీబీఐ బ్యాంక్‌లో 26 శాతం వాటా కొనుగోలు ‍కోసం ఓపెన్‌ ఆఫర్‌ను ప్రకటించింది. ఈ ఓపెన్‌ ఆఫర్‌లో భాగంగా రూ.10 ముఖ విలువ గలఒక్కో ఐడీబీఐ బ్యాంక్‌ షేర్‌ను రూ.61.73 ధరకు 26 శాతం వాటాకు సమానమైన 204 కోట్లకు పైగా షేర్లను కొనుగోలు చేస్తామని ఎల్‌ఐసీ పేర్కొంది. ఈ మొత్తం ఓపెన్‌ ఆఫర్‌ రూ.12,602 కోట్లని పేర్కొంది.  కాగా ప్రిఫరెన్షియల్‌ ప్రాతిపదికన ఎల్‌ఐసీకి షేర్లు

Most from this category