News


2 నెలల కనిష్టానికి పసిడి

Tuesday 1st October 2019
Markets_main1569909609.png-28650

అమెరికా మార్కెట్లో నిన్నరాత్రి డాలర్‌ బలపడటం, ఈక్విటీ మార్కెట్ల ర్యాలీ, ఈల్డ్‌ పుంజుకోవడం లాంటి కారణాలతో ప్రపంచమార్కెట్లోని పసిడి ధర 2నెలల కనిష్టానికి పతమనమైంది. అక్కడి మార్కెట్‌ ముగిసే సరికి ఔన్స్‌ పసిడి ధర 33.50డాలర్లు నష్టపోయి 1,472.90 వద్ద స్థిరపడింది. నేటి ఉదయం ఆసియా ట్రేడింగ్‌లో ఔన్స్‌ పసిడి ధర అరశాతం స్వల్ప నష్టంతో 1,472.45 వద్ద ట్రేడ్‌ అవుతోంది. డాలర్‌ పుంజుకోవడం పసిడి ధరకు ప్రతికూలంగా మారింది. సాంకేతికంగా కారణాలు కూడా పసిడి ట్రేడింగ్‌పై ప్రభావాన్ని చూపాయి. పసిడి బేరీష్‌ హెడ్‌ అండ్‌ సోల్డర్స్‌ ప్యాట్రన్‌ను ఏర్పాటు చేసింది. ప్యాట్రన్‌లో భాగంగా నెక్‌లైన్‌ దిగువకు చేరుకోవడంతో పసిడి మరింత అమ్మకాల ఒత్తిడికి లోనైనట్లు బులియన్‌ విశ్లేషకుడు మైఖైల్‌ అభిప్రాయపడ్డారు. సాంకేతిక కారణాలతో స్వల్పకాలంలో పసిడి మరింత కనిష్టాని చేరుకోవచ్చు. అయితే పలుదేశాల సెంట్రల్‌ బ్యాంకులు వడ్డీరేట్లపై సానుకూల వైఖరి కలిగి ఉండటంతో ధీర్ఘకాలానికి పసిడి బుల్లిష్‌ ధోరణి అవలంభించే అవకాశం ఉందని మైఖైల్‌ తెలిపారు.
రెండు రోజుల్లో రూ.900 నష్టం:- 
ఇక దేశీయ ఎంసీఎక్స్‌ మార్కెట్లో పసిడి ధర రెండురోజుల్లోనే రూ.900 నష్టపోయింది. అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధర 2నెలల కనిష్టానికి పతనం కావడంతో నిన్నరాత్రి ఎంసీఎక్స్‌ మార్కెట్లో అక్టోబర్‌ కాంటాక్టు 10గ్రాముల పసిడి ధర రూ.837లు నష్టపోయి రూ.36,913 వద్ద స్థిరపడింది. నేడు రూ.90ల స్వల్ప లాభంతో రూ.37,003 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. రూపాయి బలపడటంతో తిరిగి నష్టాల్లోకి మళ్లింది. ఉదయం గం.11:10లకు పసిడి ధర రూ.80ల నష్టంతో రూ.36834.00 వద్ద ట్రేడ్‌ అవుతోంది. 



You may be interested

24% తగ్గిన మారుతి అమ్మకాలు

Tuesday 1st October 2019

దేశీయ అతిపెద్ద కార్ల తయారి సంస్థయిన మారుతి సుజుకి ఇండియా సెప్టెంబర్‌ నెల అమ్మకాలు విశ్లేషకుల అంచనాల కంటే తగ్గాయి. ఈ కంపెనీ సెప్టెంబర్‌ నెలలో 1.22 లక్షల యూనిట్లను విక్రయించగా, గత ఏడాది ఇదే నెలలో 1.62 లక్షల యూనిట్ల విక్రయాలను నమోదుచేసింది. మొత్తంగా గత ఏడాది సెప్టెంబర్‌ నెలతో పోల్చుకుంటే ఈ సెప్టెంబర్‌లో మారుతి అమ్మకాలు 24.4 శాతం పడిపోవడం గమనార్హం. కానీ తక్కువ బేస్‌ కారణంగా

20% పడిపోయిన బజాజ్‌ అమ్మకాలు

Tuesday 1st October 2019

ద్విచక్ర, త్రి చక్ర వాహనాల తయారి సంస్థయిన బజాజ్‌ ఆటో సెప్టెంబర్‌ అమ్మకాలు గత ఏడాది ఇదే కాలంతో పోల్చుకుంటే 20 శాతం పడిపోయాయి. ఇది విశ్లేషకుల అంచనాల కంటే తక్కువ కావడం గమనార్హం. కాగా డిమాండ్‌ తగ్గడంతో గత కొంత కాలం నుంచి ఆటో కంపెనీల అమ్మకాలు తగ్గుతున్న విషయం తెలిసిందే.    సెప్టెంబర్‌ నెలలో వాహన విక్రయాలు 4.02 లక్షల యూనిట్లుగా నమోదయ్యాయని కంపెనీ బీఎస్‌ఈ ఫైలింగ్‌లో

Most from this category