News


2వారాల కనిష్టం వద్ద పసిడి

Wednesday 22nd May 2019
Markets_main1558502669.png-25873

డాలర్‌ ఇండెక్స్‌ 4వారాల గరిష్టానికి చేరుకోవడంతో ప్రపంచమార్కెట్లో పసిడి 2వారాల కనిష్ట ధర వద్ద స్థిరంగా ట్రేడ్‌ అవుతోంది. ఆసియా మార్కెట్లో బుధవారం ఔన్స్‌ పసిడి ధర అరడాలరు స్వల్పలాభంతో 1,273.65డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. అమెరికా ఇటీవల చైనా టెలికాం దిగ్గజ కంపెనీ హువాయిపై విధించిన సుంకాలను 3నెలల పాటు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. ఫలితంగా ఇరుదేశాల మధ్య కొనసాగుతున్న వాణిజ్య యుద్ధ ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టింది. దీంతో అమెరికా యూఎస్‌ ట్రెజరీ బాండ్‌ ఈల్డ్‌ విపరీతంగా పెరిగి డాలర్‌ బలపడేందుకు సహకరించింది. ఆరు ప్రధాన కరెన్సీ విలువల్లో డాలరు ఇండెక్స్‌ నెలరోజుల గరిష్టానికి చేరడంతో రాత్రి అమెరికా మార్కెట్లో పసిడి రెండు వారాల కనిష్ట స్థాయి 1,273.20 డాలర్ల వద్ద స్థిరపడింది. నేడు ఆసియా మార్కెట్ల మిశ్రమ ట్రేడింగ్‌ నేపథ్యంలో పసిడి స్వల్ప అరశాతం మాత్రమే లాభపడింది. 
దేశయంగానూ అక్కడక్కడే:-
అంతర్జాతీయ ట్రెండ్‌కు అనుగుణంగానే పసిడి ధర దేశీయంగా అక్కడక్కడే ట్రేడ్‌ అవుతోంది. ఎంసీఎక్స్‌ మార్కెట్లో జూన్‌ కాంట్రాక్టు 10గ్రాముల పసిడి ధర రూ.31ల లాభంతో రూ.31447ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. పసిడి ధరను ప్రభావితం చేసే రూపాయి విలువ డాలర్‌ మారకంలో 5పైసలు స్వల్పంగా బలహీనపడి 69.76 స్థాయి వద్ద ట్రేడ్‌ అవుతోంది.



You may be interested

హెచ్‌డీఎఫ్‌సీ గ్రూప్‌.. నెంబర్‌వన్‌!

Wednesday 22nd May 2019

మార్కెట్‌క్యాప్‌ పరంగా అగ్రస్థానం కైవసం మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ పరంగా టాటా గ్రూప్‌ను తోసిరాజని హెచ్‌డీఎఫ్‌సీ గ్రూప్‌ అగ్రస్థానానికి చేరింది. హెచ్‌డీఎఫ్‌సీ గ్రూప్‌నకు చెందిన ఐదు కంపెనీల- హెచ్‌డీఎఫ్‌సీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌, హెచ్‌డీఎఫ్‌సీ ఏఎంసీఅండ్‌గృహ్‌ఫైనాన్స్‌ ఉమ్మడి మార్కెట్‌ వాల్యూ రూ. 11.66 లక్షల కోట్లకు చేరింది. ఇదే సమయంలో టాటా గ్రూప్‌నకు చెందిన 29 కంపెనీల ఉమ్మడి మార్కెట్‌ వాల్యూ రూ.11.64 లక్షల కోట్ల రూపాయలుంది. హెచ్‌డీఎఫ్‌సీ గ్రూప్‌ మార్కెట్‌క్యాప్‌

బుధవారం వార్తల్లో షేర్లు

Wednesday 22nd May 2019

వివిధ వార్తలకు అనుగుణంగా బుధవారం ప్రభావితమయ్యే షేర్ల వివరాలు  సింటెక్స్‌ ప్లాస్టిక్‌: తన అనుబంధ సంస్థ సింటెక్స్‌ -  బీఏపీఎల్‌ కంపెనీ అటో విభాగాన్ని విక్రయించేందుకు ఆమోదం తెలిపింది.  ఎడెల్వీజ్‌ ఫైనాన్స్‌ సర్వీసెస్‌:- తన అనుబంధ సంస్థ ఎడెల్వీజ్‌ ఇన్సూరెన్స్‌ బ్రోకర్స్‌ కంపెనీలో ఆర్థర్‌ జే. గల్లఘేర్ & కో. మైనారిటీ వాటాను కొనుగోలు చేసింది.   ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌:- ఇక్రా రేటింగ్‌ సంస్థ కంపెనీ ధీర్ఘకాలిక రేటింగ్‌ ‘‘ఎఎ’’కు డౌన్‌గ్రేడ్‌ చేసింది.  ఇన్ఫోసిస్‌

Most from this category