News


2వారాల గరిష్టానికి పసిడి

Tuesday 21st January 2020
Markets_main1579584188.png-31067

అంతర్జాతీయంగా పసిడి ఫ్యూచర్ల ధర మంగళవారం ఉదయం ట్రేడింగ్‌ సెషన్‌లో  2వారాల గరిష్టాన్ని అందుకుంది. మధ్య ఆసియాలో మరోసారి నెలకొన్న యుద్ధ ఉద్రిక్తతలు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ఐఎంఎఫ్‌ అవుట్‌లుక్‌ కేటాయింపుతో అంతర్జాతీయంగా పసిడి ఫ్యూచర్లకు డిమాండ్‌ పెరిగింది. నేడు ఆసియాలో ఔన్స్‌ పసిడి ధర 8డాలర్లు లాభపడి 1,568.60 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఈ ధర పసిడికి 2వారాల గరిష్టస్థాయి కావడం విశేషం. 

కొద్ది రోజులుగా నిశబ్దంగా ఉన్న ఇరాన్ మళ్లీ విరుచుకుపడింది. ఇరాక్ రాజధాని బాగ్దాద్‌ హై సెక్యూరిటీ గ్రీన్‌ జోన్‌లో ఉన్న అమెరికా ఎంబసీకి సమీపంలో మూడు రాకెట్లు దూసుకొచ్చాయి. ఈ ఘటనలో కార్యాలయాల సిబ్బందికి ఎలాంటి గాయాలు కాలేదని సమాచారం. గ్రీన్ జోన్ సెంట్రల్ బాగ్దాద్ ప్రాంతంలో ఉంది. ఇక్కడే అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, రాయబార కార్యాలయాలు ఉన్నాయి. బ్యాంక్‌ ఆప్‌ జపాన్‌ ద్రవ్య విధానంలో ఎలాంటి మార్పులు లేకుంగా యథాతధంగా ఉంచేందుకు సన్నద్ధమైంది. 

వర్థమాన దేశాల ఆర్థిక వ్యవస్థలు భారీ పతనాన్ని చూడవచ్చనే అంచనాలతో అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు సైతం నెగిటివ్‌ అవుట్‌లుక్‌ కేటాయించింది దీంతో ఆర్థిక వృద్ధి ఆందోళలు మరోసారి తెరపైకి వచ్చాయి. మరోవైపు బ్యాంక్‌ ఆప్‌ జపాన్‌ ద్రవ్య విధానంలో ఎలాంటి మార్పులు లేకుండా యథాతధంగా ఉంచేందుకు సన్నద్ధమైంది.  

దేశీయంగా రూ.40వేల పైకి:- 
ఎంసీఎక్స్‌ మార్కెట్లో పసిడి ప్యూచర్స్‌ ధర మళ్లీ రూ.40వేలను అందుకుంది. ఎంసీఎక్స్‌లో ఫ్రిబవరి కాంటాక్టు 10గ్రాలు పసిడి ధర మంగళవారం ఉదయం ట్రేడింగ్‌లో రూ.200లు లాభపడి రూ.40147ల వద్ద స్థిరపడింది. అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ఫ్యూచర్లు 2వారాల గరిష్టాన్ని అందుకోవడంతో పాటు భారత ఆర్థిక వృద్ధిపై అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ నెగిటివ్‌ రేటింగ్‌ను కేటాయించడంతో ఫారెక్స్‌ మార్కెట్లో డాలర్‌ మారకంలో రూపాయి బలహీనపడం తదితర అంశాలు దేశీయంగా పసిడి ఫ్యూచర్లకు డిమాండ్‌ను పెంచాయి. ఎంసీఎక్స్‌లో పసిడికి రూ.39,600 వద్ద కీలక మద్దతు ధర ఉంది. కాబట్టి ఈస్థాయి వద్ద స్టాప్‌లాస్‌తో రూ.40,250 టార్గెట్‌ లక్ష్యంతో కొనుగోలు చేయమని బులియన్‌ విశ్లేషకులు సలహానిస్తున్నారు. You may be interested

మంగళవారం వార్తలకు ప్రభావితమయ్యే షేర్లు

Tuesday 21st January 2020

వివిధ వార్తలు, విశ్లేషణలతో మంగళవారం స్టాక్‌ మార్కెట్‌లో ప్రభావితమయ్యే షేర్లు ఇండియన్‌ ఓవర్‌సిస్‌ బ్యాంక్‌: షేర్ల ప్రిఫరెన్షియల్‌ ఇష్యూను ఆమోదించడానికి ఇండియన్‌ ఓవర్‌సిస్‌ బ్యాంక్‌ బోర్డు ఈ రోజు(జనవరి 21)న సమావేశం కానుంది. ఎన్‌బీసీసీ: కేంద్ర బొగ్గు పరిశ్రమల్లో  రూ.720 కోట్ల ప్రాజెక్టుకు ఎన్‌బీసీసీ కన్సల్టెన్సీ ఇవ్వనుంది. కెఈఐ ఇండస్ట్రీస్‌: వార్షిక ప్రాతిపదికన క్యూ3 నికర లాభం 50.4 శాతం పెరిగి రూ.72.5 కోట్లుగా నమోదయ్యింది. మొత్తం ఆదాయం 21 శాతం పెరిగి రూ.1314కోట్లకు

ప్రమోటర్లు వాటా పెంచుకున్న చిన్న షేర్లు!

Tuesday 21st January 2020

జాబితాలో రేమండ్‌ లిమిటెడ్‌ గ్రీవ్స్‌ కాటన్‌, శాస్కన్‌ టెక్నాలజీస్‌ వోల్టాం‍ప్‌ ట్రాన్స్‌ఫార్మర్‌, బేయర్‌ క్రాప్‌సైన్స్‌ మార్కెట్లు అంతగా దృష్టిపెట్టని కొన్ని మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ కంపెనీలలో గత కొంత కాలంగా ప్రమోటర్లు వాటాలు పెంచుకుంటూ వస్తున్నారు. ఈ జాబితాలో డైవర్సిఫైడ్‌ దిగ్గజం రేమండ్‌ లిమిటెడ్‌, ఐటీ సేవల శాస్కన్‌ టెక్నాలజీస్‌, విద్యుత్‌ రంగ కంపెనీ వోల్టాం‍ప్ ట్రాన్స్‌ఫార్మర్‌, అగ్రికెమికల్స్‌ దిగ్గజం బేయర్‌ క్రాప్‌సైన్స్‌, ఇంజిన్ల తయారీ కంపెనీ గ్రీవ్స్‌ కాటన్‌ చోటు సాధించాయి. సాధారణంగా

Most from this category