News


పసిడి @ 1500డాలర్లు

Wednesday 7th August 2019
Markets_main1565153747.png-27589

ఆరేళ్ల సుధీర్ఘకాలం అనంతరం ప్రపంచమార్కెట్లోని పసడి ధరలు 1500డాలర్ల స్థాయిని అందుకుంది. ఆసియాలో బుధవారం ఉదయం ట్రేడింగ్‌ సెషన్స్‌లో ఔన్స్‌ పసిడి ధర 18డాలర్లు ర్యాలీ చేసి 1,502.25డాలర్ల స్థాయిని అందుకుంది. అమెరికా చైనాల మధ్య రోజురోజూకు తీవ్రతరమవుతున్న వాణిజ్య యుద్ధ ఉద్రికత్తలు, అంతర్జాయ ఆర్థిక వృద్ధి మందగమన ఆందోళనలు, పలు ప్రపంచదేశాల రిజర్వ్‌ బ్యాంకు వడ్డీరేట్లపై మెతక వైఖరి తదితర అంశాలు పసిడి ధర 1500డాలర్ల అందుకునేందుకు తోడ్పాటునిచ్చాయి. 2013 తరువాత ఈ స్థాయిని తిరిగి అందుకోవడం ఇదే తొలిసారి. ఈ ఏడాది పసిడి ధర 17శాతం ర్యాలీ చేసింది. అమెరికా తాజాగా చైనా దిగుమతులపై సుంకాలు విధించడటం, అందుకు ప్రతీకారంగా చైనా.. అమెరికా కరెన్సీ డాలర్‌ విలువను తగ్గించేందుకు తన దేశపు కరెన్సీ యువాన్‌ విలువ క్షీణింపజేయడం తదితర కారణాలతో ఆర్థికంగా అగ్రరాజ్యాలైన ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తీవ్రతరమయ్యాయి. వాణిజ్య యుద్ధాలతో అర్థిక మందగమనం ఆందోళనలు తెరపైకి రావడంతో అమెరికా ఫెడ్‌ రిజర్వ్‌ బ్యాంక్‌పై మరోసారి వడ్డీరేట్ల కోత విధింపు ఒత్తిడి ఏర్పడింది. ఈ అస్థిర పరిణామాలతో ప్రపంచమార్కెట్లో పసిడి ఫ్యూచర్లకు డిమాండ్‌ ఊపందుకుంది. భారత వర్తమాన కాలం ఉదయం గం.10లకు ఆసియాలో ఔన్స్‌ పసిడి ధర 16 డాలర్ల లాభంతో 1501 డాలరు వద్ద ట్రేడ్‌ అవుతోంది. వరుసగా మూడోరోజూ లాభపడుతూ నిన్నటి రోజు అమెరికా మార్కెట్లో పసిడి ధర 7.70 డాలర్లు పెరిగి 1,484.20 డాలర్ల వద్ద ముగిసింది.
దేశీయంగా రూ.200 అప్‌:- 
అంతర్జాతీయ ట్రెండ్‌కు అనుగుణంగానే దేశీయ మార్కెట్లో పసిడి ధర పరుగులు పెడుతోంది. నేడు ఎంసీఎక్స్‌ మార్కెట్లో అక్టోబర్‌ కాంట్రాక్టు 10గ్రాముల పసిడి ధర రూ.207.00లు పెరిగి రూ.37704.00ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. నేటి ఫారెక్స్‌ రూపాయి బలహీనపడటంతో పాటు, ప్రపంచమార్కెట్లో పసిడి ధర ర్యాలీతో పసిడి లాభపడేందుకు సహకరిస్తున్నాయి. నిన్నటి ఎంసీఎక్స్‌ మార్కెట్‌ ముగిసే సరికి ఔన్స్‌ పసిడి ధర రూ.152లు లాభంతో రూ.37, 497 వద్ద స్థిరపడింది.



You may be interested

ఇక రిలయన్స్‌, బీపీ పెట్రోల్ బంకులు

Wednesday 7th August 2019

అయిదేళ్లలో దేశవ్యాప్తంగా 5,500కు బంకుల సంఖ్య విమాన ఇంధన విక్రయ కార్యకలాపాలు కూడా రెండు సంస్థల జాయింట్ వెంచర్  2020 ప్రథమార్ధంలో ఒప్పందం పూర్తి  న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా మరిన్ని పెట్రోల్ బంకులు ఏర్పాటు చేసేందుకు, విమాన ఇంధనాన్ని కూడా విక్రయిచేందుకు దిగ్గజ సంస్థలు రిలయన్స్ ఇండస్ట్రీస్‌, బ్రిటన్‌కు చెందిన బీపీ తాజాగా జాయింట్ వెంచర్ (జేవీ) ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నాయి. ఇందుకు సంబంధించి ప్రాథమిక ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఇరు సంస్థలు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపాయి.

డిమాండ్‌ భయాలు..తగ్గిన చమురు

Wednesday 7th August 2019

lయుఎస్‌ చమురు నిల్వలు పడిపోయినప్పటికి రెండు పెద్ద చమురు వినియోగ దేశాలైన యుఎస్‌, చైనా మధ్య కొనసాగుతున్న వాణిజ్య ఘర్షణ, చమురు డిమాండ్‌ ఆందోళనలను పెంచుతోంది. ఫలితంగా బుధవారం చమురు ధరలు పడిపోయాయి. బ్రెంట్‌ క్రూడ్‌ ధర 0.41 శాతం తగ్గి బ్యారెల్‌కు 58.70 డాలర్లకు చేరుకుంది. కాగా ప్రస్తుతం బ్రెంట్‌ క్రూడ్‌ గత ఏడు నెలల కనిష్ఠం వద్ద ట్రేడవుతుంది. అదే విధంగా డబ్యూటీఐ క్రూడ్‌ ధర కూడా

Most from this category