News


త్వరలో రూ.45000 స్థాయికి బంగారం ధర

Thursday 26th March 2020
Markets_main1585215898.png-32693

అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు హెచ్చుతగ్గులకు లోనవుతుండడంతో ఇండియాలో 10 గ్రాముల పసిడి రూ.45,000 స్థాయికి చేరవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. దీంతో గోల్డ్‌ ఎక్సేంజ్‌ ట్రేడెడ్‌ ఫండ్స్, సావర్జీన్‌ గోల్డ్‌ బాండ్స్‌(ఎస్‌జీబీ) కలిగి ఉన్న వారికి ఈ పరిమాణం లాభం చేకూరుస్తుందని అంతర్జాతీయ మార్కెట్‌ కేడియా సలహాదారు అజయ్‌ కేడియా వెల్లడించారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ ఉండడంతో ఇండియన్‌ బులియన్‌ జువెల్లర్స్‌ షాపులు మూసేసారు.  దీంతో బుధవారం దేశీయ మల్టీ కమోడిటీ మార్కెట్‌లో బంగారం రేట్లు 3 శాతం పెరిగి10 గ్రాముల రూ.43,250 వద్ద ముగిసింది. స్పాట్‌ గోల్డ్‌ మార్కెట్‌ మూతపడడంతో ఎస్‌జీబీల రేట్లు పెరిగే అవకాశం ఉందని అజయ్‌ కేడియా వెల్లడించారు. అంతర్జాతీయంగా డాలర్‌కు డిమాండ్‌ పెరగడంతో ఇన్వెస్టర్లంతా బంగారంపై దృష్టి పెట్టారన్నారు. కరోనావైరస్‌ ప్రభావంతో యూకేలోని రిఫైనరీస్‌ అన్ని తక్కువగా పనిచేస్తుండడం కూడా గోల్డ్‌ రేటు పెరగడం ఒక కారణమని ఆయన అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాల్లో రిఫైనరీస్‌ మూతపడడం, కొన్ని తక్కువగా పనిచేస్తున్నాయి. పెరు, చిలీ వంటి దేశాల్లో బంగారం గనులు వైరస్‌ భయంతో మూసేసారు. దీంతో శుద్దిచేసిన బంగారం సరఫరా జరగడం లేదు. స్విట్జర్లాండ్‌లో సైతం బంగారం రిఫైనరీలు పనిచేయకపోవడంతో బంగారం ధరలు పెరుగుతాయని కేడియా వివరించారు. 



You may be interested

ఆల్‌టైమ్‌ కనిష్టానికి 14 స్టాక్‌లు

Thursday 26th March 2020

బీఎస్‌ఈ500 ఇండెక్స్‌లో గురువారం 14 స్టాక్‌లు ఆల్‌టైమ్‌ కనిష్టానికి చేరాయి. దీనిలో ఫ్యూచర్‌ రిటైల్, ఇండియా బుల్స్‌ రియల్‌ ఎస్టేట్, జస్ట్‌ డయిల్, ఏయూ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్, డిష్‌ టీవీ నెట్‌వర్క్, లక్ష్మీ విలాస్‌ బ్యాంక్, శంకరా బిల్డింగ్‌ ప్రోడక్ట్స్, వరోక్‌ ఇంజనీరింగ్‌ షేర్లు ఉన్నాయి. ఫ్యూచర్‌ రిటైల్‌ షేర్లు 5 శాతం పతనమై రూ.91.75 వద్ద వరుసగా 11 రోజు లోవర్‌ సర్క్యూట్‌ను తాకాయి.  ఐడీబీఐ ట్రస్టీషిప్‌

రూ. 1.7 లక్షల కోట్లతో పేదలకు ప్యాకేజీ

Thursday 26th March 2020

కోవిడ్-19 కట్టడికి కేంద్ర ప్రభుత్వం ప్రణాళిక ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటన కరోనా వైరస్‌ రక్కసితో పోరాటంలో భాగంగా  ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తాజాగా రూ. 1.7 లక్షల కోట్ల విలువైన ఆర్థిక ప్యాకేజీని ప్రకటించారు. ప్రధాన మంత్రి గరీబ్‌ కళ్యాణ్ యోజన పథకం పేరుతో పేదలు, కార్మికులకు పలు ప్రయోజనాలను కల్పించారు. కోవిడ్‌-19 విస్తరించకుండా అమలు చేస్తున్న లాక్‌డౌన్‌ కారణంగా ఎదురయ్యే ఇబ్బందుల దృష్టితో పథకాలను రూపొందించినట్లు తెలియజేశారు.

Most from this category