News


నాలుగో రోజూ లాభాల్లోనే పసిడి

Friday 4th October 2019
Markets_main1570165331.png-28712

అమెరికా ఆర్థిక గణాంకాలు అంతంత మాత్రంగా నమోదు కావడంతో ఆర్థిక ఆందోళనలు మళ్లీ తెరపైకి రావడంతో ప్రపంచమార్కెట్లో పసిడి ధర నాలుగో రోజూ లాభాల్లో ట్రేడ్‌ అవతుంది. ఆసియాలో శుక్రవారం ఉదయం ట్రేడింగ్‌లో ఔన్స్‌ పసిడి 2డాలర్లు లాభపడి 1,516 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతుంది. అమెరికా ఫెడ్‌రిజర్వ్‌ బ్యాంక్‌ ఈసారి కూడా వడ్డీరేట్లను తగ్గించవచ్చనే అంచనాలు, ఆరు ప్రధాన కరెన్సీ విలువల్లో డాలర్‌ బలహీన ట్రేడింగ్‌ లాంటి అంశాలు కూడా పసిడి ర్యాలీకి తోడ్పాటును అందిస్తున్నాయి. చైనాతో పాటు ఇతర దేశాలతో వాణిజ్య వివాదాలను కోరి తెచ్చి కోవడంతో అమెరికా సేవల రంగ గణాంకాలు మార్కెట్‌ అంచనాలకు కంటే తక్కువగా నమోదయ్యాయి. సెప్టెంబర్‌లో సేవల రంగ మూడేళ్ల కనిష్టానికి పతనమైంది. నేటిరాత్రి అమెరికాలో విడుదల కానున్న వసాయేతర ఉద్యోగ(నాన్‌ఫామ్‌ పేరోల్స్‌) గణాంకాల కొరకు పసిడి ట్రేడర్లు ఎదురుచూస్తున్నారు. ఆగస్ట్‌లో వ్యవసాయేతర పేరోల్స్‌ 1.30 లక్షలుగా నమోదయ్యాయి. విశ్లేషకులు సెప్టెంబర్‌ నెలలో 1.45 లక్షల పేరోల్స్‌ను అంచనా వేస్తున్నారు. 
దేశీయంగా స్వల్పంగా నష్టాల్లో:- 
దేశీయంగా డాలర్‌ మారకంలో రూపాయి ఫ్లాట్‌గా ప్రారంభం కావడంతో ఎంసీఎక్స్‌ మార్కెట్లో పసిడి ధర స్వల్పంగా నష్టాల్లో ట్రేడ్‌ అవుతోంది. నేడు డిసెంబర్‌ కాంటాక్టు 10గ్రాముల ధర రూ.38,650 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఉదయం గం.10:15ని.లకు రూ.52ల నష్టంతో రూ.38350 వద్ద ట్రేడ్‌ అవుతోంది. స్వల్పకాలికంగా పసిడి ధర రూ.38,050- 38,800 శ్రేణిలో కదలాడే అవకాశం ఉన్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. నిన్నరాత్రి అమెరికా మార్కెట్లో పసిడి ధర సాంకేతికంగా కీలకమైన 1520డాలర్ల స్థాయిని పరీక్షించిన నేపథ్యంలో దేశీయంగా పసిడి ఫ్యూచర్లకు డిమాండ్‌ పెరిగి 1.35శాతం లాభపడి రూ.38,403 వద్ద ముగిసింది. 



You may be interested

20-40 బీపీఎస్‌ రేట్ల కోత ఉంటుందా?

Friday 4th October 2019

ఆర్‌బీఐ(రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా) శుక్రవారం వడ్డీరేట్లను మరింత తగ్గించనుందనే అంచనాలున్నాయి. వడ్డీరేట్ల తగ్గింపు ఉంటుందని, ఇది  20 నుంచి 40 బేసిస్‌ పాయింట్ల మధ్యలో ఉండే అవకాశం ఉందని బ్లూమ్‌బర్గ్‌ ఆర్థిక వేత్తల సర్వే పేర్కొనడం గమనార్హం. కాగా ప్రభుత్వం ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 110 బేసిస్‌ పాయింట్లను తగ్గించి రెపో రేటును 5.4 శాతానికి పరిమితం చేసింది. గత మానిటరీ పాలసీ కమిటీ(ఎంపీసీ) సమావేశంలో 35

పాజిటివ్‌గా క్రూడ్‌ ఆయిల్‌!

Friday 4th October 2019

చమురు ధరలు శుక్రవారం ట్రేడింగ్‌లో పాజిటివ్‌గా ఉన్నాయి. అయినప్పటికి అంతర్జాతీయంగా ఆయిల్‌ డిమాండ్‌ తగ్గడంతో పాటు, సౌదీ చమురు ఉత్పత్తి సామర్ధ్యం తిరిగి సాధరణ స్థాయికి రావడంతో చమురు ధరలు బేరిష్‌ ట్రెండ్‌లోనే ఉన్నాయని విశ్లేషకులు తెలిపారు.  ఉదయం 9.45 సమయానికి బ్రెంట్‌ క్రూడ్‌ 0.35 శాతం లాభపడి బారెల్‌ 57.91 డాలర్ల వద్ద, డబ్యూటీఐ క్రూడ్‌ 0.34 శాతం లాభపడి బారెల్‌ 52.63 డాలర్ల వద్ద ట్రేడవుతున్నాయి. కాగా

Most from this category