News


ఫ్లాట్‌గా ముగిసిన పసిడి

Saturday 23rd November 2019
Markets_main1574495034.png-29813

ప్రపంచమార్కెట్లో ఉదయం ఆర్జించిన లాభాలను కోల్పోయిన పసిడి ధర శుక్రవారం ఫ్లాట్‌గా ముగిసింది. అమెరికా ఆర్థిక గణాంకాలు అంచనాలకు మించిన నమోదుకావడంతో డాలర్‌ బలపడటం పసిడి ఫ్లాట్‌ ముగింపునకు కారణమైంది. అమెరికాలో డిసెంబర్‌ కాంటాక్టు ఔన్స్‌ పసిడి ధర క్రితం ముగింపుతో ఎలాంటి లాభనష్టాలు లేకుండా 1,463.30 డాలర్ల వద్ద స్థిరపడింది. రాత్రి అమెరికా మార్కెట్‌ ఉదయం సెషన్‌లో వాణిజ్య చర్చల ఆందోళనల నేపథ్యంలో పసిడి ఫ్యూచర్లు 10డాలర్ల వరకు లాభపడి 1,473.35 డాలర్లకు చేరుకుంది. అయితే వాణజ్య చర్చలపై అటు ట్రంప్‌, చైనాధ్యక్షుడు జింగ్‌పింగ్‌ సానుకూల వాఖ్యలు చేయడంతో పసిడి కొంతలాభాల్ని కోల్పోయింది. మరోవైపు అమెరికాకు చెందిన కొన్ని ఆర్థిక గణాంకాలు అంచనాలకు మించిన నమోదుకావడంతో డాలర్‌ ఇండెక్స్‌ బలపడింది. దీంతో పసిడి ఫ్యూచర్లు ఉదయం సెషన్‌లో ఆర్జించిన లాభాల్ని కోల్పోయి 1,463.30 డాలర్ల వద్ద ముగిసింది. ఈ వారం మొత్తం మీద పసిడి ధర 5డాలర్లు (0.3శాతం) నష్టపోయింది. 
రూ.38వేల దిగువున ముగిసిన పసిడి...
దేశీయ ఎంసీఎక్స్‌ మార్కెట్లో పసిడి ఫ్యూచర్స్‌ ధర శుక్రవారం రూ.38వేల దిగువును ముగిసింది.  అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ఫ్యూచర్లకు డిమాండ్‌ తగ్గడం ఇందుకు కారణమైంది. నిన్నరాత్రి ఎంసీఎక్స్‌లో డిసెంబర్‌ కాంటాక్టు 10గ్రాముల పసిడి ధర రూ.58లు నష్టపోయి రూ.37895.00 వద్ద స్థిరపడింది. దేశీయంగా వారం మొత్తం మీద 10గ్రాముల పసిడి ధర రూ.19లు నష్టపోయింది.
దేశీయంగా వివిధ నగరాల్లో స్పాట్‌ గోల్డ్‌(24 క్యారెట్లు) నిన్నటి(23-11-2019) ముగింపు ధర కోసం ఆయా నగరాలపై క్లిక్‌ చేయండి.

 



You may be interested

లాభాల కోసం కాంట్రా బెట్స్‌ బెటర్‌!

Saturday 23rd November 2019

జిమిత్‌మోదీ సూచన స్వల్పకాలానికి మార్కెట్లు పలు వార్తలకు అతిగా స్పందించే అవకాశం ఉందని, ఈ సమయంలో కాంట్రాబెట్స్‌ తీసుకోవడం మంచిదని సామ్‌కో సెక్యూరిటీస్‌ అనలిస్టు జిమిత్‌ మోదీ సూచిస్తున్నారు. నిఫ్టీ ఈ వారం 12100 పాయింట్లను దాటేందుకు గట్టి ప్రయత్నం చేసిందని, కానీ విఫలమైందని చెప్పారు. నిఫ్టీ స్మాల్‌క్యాప్‌ సూచీ ప్రస్తుత మార్కెట్‌ మూడ్‌ను ప్రతిబింబిస్తోందన్నారు. స్మాల్‌క్యాప్‌ సూచీ ప్రస్తుతం కరెక్టివ్‌ దశలో ఉంది. అయితే చార్టులను పరిశీలిస్తే భారీ అప్‌ట్రెండ్‌

ఆటుపోట్ల మార్కెట్లో అవలంబించాల్సిన సూత్రాలు!

Saturday 23rd November 2019

కొన్ని నెలలుగా దేశీయ మార్కెట్లు అటుఇటు ఊగిసలాడుతూ కొనసాగుతున్నాయి. మందగమనం, ఎన్‌బీఎఫ్‌సీ లిక్విడిటీ సంక్షోభం, ఐఐపీ క్షీణత లాంటి అంశాలు మార్కెట్‌ ప్రదర్శనపై ప్రభావం చూపుతున్నాయి. ప్రభుత్వం, ఆర్‌బీఐ ఎంత యత్నిస్తున్నా మార్కెట్లో సెంటిమెంట్‌ పూర్తి పాజిటివ్‌గా మారడం లేదు. ఈ నేపథ్యంలో రిటైల్‌ ఇన్వెస్టర్లు తప్పక పాటించాల్సిన సూత్రాలని నిపుణులు వివరిస్తున్నారు.  1. అనవసర పుకార్లను నమ్మొద్దు: మార్కెట్లో వినిపించే పుకార్లు ఇన్వెస్టర్‌కు ఒక్కోసారి అత్యాశను కలిగిస్తే ఒక్కోసారి హడలెత్తిస్తుంటాయి.

Most from this category