News


2నెలల గరిష్టానికి చేరువలో పసిడి

Thursday 26th December 2019
Markets_main1577333721.png-30447

క్రిస్మస్‌ పండుగ సందర్భంగా ప్రపంచమార్కెట్లో పసిడి ఫ్యూచర్ల ధర 2నెలల గరిష్టానికి చేరువులో ట్రేడ్‌ అవుతున్నాయి. ఆసియాలో మంగళవారం ఉదయం ట్రేడింగ్‌ సెషన్‌లో ఔన్స్‌ పసిడి ఫ్యూచర్స్‌ ధర 3.50డాలర్ల లాభంతో 1,508.45 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. వాణిజ్య చర్చల్లో భాగంగా ఇటీవల కుదిరిన తొలి ధపా ఒప్పందంపై అమెరికా, చైనా దేశాధ్యక్షుల అధికారిక సంతకాల కోసం ఇన్వెస్టర్లు ఎదురుచూస్తున్నారు. ఏడాదిన్నర కాలంగా చైనాతో కొనసాగుతున్న వాణిజ్య వివాదాలకు ముగింపు పలికే దిశగా ఇటీవల కుదిరిన ఒప్పందంపై త్వరలోనే ఇరు దేశాధ్యక్షులు ఒక వేదికపై సంతకాలు పెడుతామని అమెరికా ప్రెసిడెంట్‌ డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించారు. ఒప్పందం సంతకం చేసేందుకే చైనా ప్రభుత్వం మొగ్గు చూపుతున్నట్లు బీజింగ్‌ మీడియా వర్గాలు తెలిపాయి. ఈ అంశంపై యూఎస్‌ ట్రెజరీ సెక్రటరీ స్టీవెన్‌ ముచిన్‌ స్పందిస్తూ.. జనవరి మొదటి వారంలో ఒప్పందంపై సంతకాలు చేసే వీలున్నట్లు తెలియజేశారు. ఆర్థిక మాంద్య భయాలు వెంటాడటంతో పాటు ఈక్విటీ మార్కెట్లు గరిష్ట స్థాయిల వద్ద ట్రేడ్‌ తరుణంలో లాభాల స్వీకరణ జరగవచ్చనే అందోళనలతో పసిడి ఫ్యూచర్ల ధర అమెరికాలో మంగళవారం రాత్రి  1,504.80 డాలర్ల వద్ద ముగిసింది. నిన్న క్రిస్మస్‌ సందర్భంగా ప్రపంచ ఈక్విటీ మార్కెట్లకు సెలవు.
దేశీయంగా స్వల్ప లాభంతో ప్రారంభం:- 
క్రిస్మస్‌ సెలవు అనంతరం ట్రేడింగ్‌ను ప్రారంభించిన దేశీయ పసిడి ఫ్యూచర్లు స్వల్ప లాభాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి. నేటి ఉదయం ఎంసీఎక్స్‌ మార్కెట్లో ఫిబ్రవరి కాంటాక్టు 10గ్రాముల పసిడి ధర మంగళవారం ముగింపు ధర(రూ.38639)తో పోలిస్తే రూ.57.00ల లాభంతో రూ.38696.00 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇక పసిడి ధరపై ప్రభావాన్ని చూపే రూపాయి విలువ ఫ్లాట్‌గా 71.27 వద్ద ప్రారంభమైంది. మంగళవారం రాత్రి అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధర 15డాలర్లు లాభపడిన కారణంగా దేశీయ ఎంసీఎక్స్‌మార్కెట్లో సైతం రూ.382లు లాభపడి రూ.38639 వద్ద స్థిరపడింది. 



You may be interested

ఇన్ఫీబీమ్‌ హైజంప్‌- ఐఐఎఫ్‌ఎల్‌ కుదేల్‌

Thursday 26th December 2019

రెండు రోజుల పతనానికి ఇన్ఫీబీమ్‌ చెక్‌ 7వ రోజూ పతన బాటలో ఐఐఎఫ్‌ఎల్‌ వెల్త్‌ ఐఐఎఫ్‌ఎల్‌ వెల్త్‌ మేనేజ్‌మెంట్‌ గత కొద్ది రోజులుగా పతన బాటలో సాగుతున్న ఐఐఎఫ్‌ఎల్‌ వెల్త్‌ మేనేజ్‌మెంట్‌ కౌంటర్లో మరోసారి అమ్మకాలు ఊపందుకున్నాయి. దీంతో గురువారం ట్రేడింగ్‌ ప్రారంభంలో ఈ షేరు ఎన్‌ఎస్‌ఈలో 15 శాతం కుప్పకూలింది. రూ. 924 వద్ద 52 వారాల కనిష్టాన్ని తాకింది. తదుపరి అమ్మకాలు ఉపశమించడంతో రికవరీ వచ్చింది. 9.45 ప్రాంతంలో 2.5 శాతం

గురువారం యాక్టివ్‌ స్టాక్స్‌

Thursday 26th December 2019

దేశీ స్టాక్‌ మార్కెట్లలో గురువారం వార్తల ఆధారంగా కొన్ని స్టాక్స్‌ యాక్టివ్‌గా కదిలే వీలున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. తాజాగా వార్తలలో నిలిచిన ఆయా స్టాక్స్‌ వివరాలు చూద్దాం.. యస్‌ బ్యాంక్‌ బ్రిక్‌వర్క్‌ రేటింగ్స్‌ యస్‌ బ్యాంక్‌కు చెందిన లోయర్‌ టైర్‌-2 బాండ్లు, అప్పర్‌ టైర్‌-2 బాండ్లతోపాటు.. హైబ్రిడ్‌ టైర్‌-1 బాండ్ల రేటింగును డౌన్‌గ్రేడ్‌ చేసింది. లోయర్‌ టైర్‌-2 బాండ్ల రేటింగ్‌ను BWR AA- నుంచి BWR Aకు డౌన్‌గ్రేడ్‌ చేయగా.. అప్పర్‌ టైర్‌-2,

Most from this category