News


14నెలల గరిష్టం నుంచి వెనక్కి

Saturday 15th June 2019
Markets_main1560584563.png-26321

డాలర్‌ ఇండెక్స్‌ రికవరితో పసిడి ధర శుక్రవారం 14నెలల గరిష్టాన్ని తాకింది. అమెరికా మార్కెట్లో ఔన్స్‌ పసిడి ధర స్వల్పంగా 1డాలరు పెరిగి 1,344.50 వద్ద ముగిసింది. అమెరికా మార్కెట్లో ఉదయం ట్రేడింగ్‌ సెషన్స్‌లో పసిడి ధర 22డాలర్ల లాభపడి 1,362 డాలర్ల వద్ద 14నెలల గరిష్టస్థాయిని అందుకుంది. అయితే మిడ్‌సెషన్‌ నుంచి పసిడి ఫ్యూచర్లు తీవ్ర అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. గరిష్టస్థాయిల్లో పసిడి ఫ్యూచర్లలో లాభాల స్వీకరణ చోటు చేసుకోవడం, డాలర్‌ ఇండెక్స్‌ బలమైన రివకరి ఇందుకు కారణమయ్యాయి. చైనా బలహీన ఆర్థిక గణాంకాలు విడుదల చేయడంతో ఇన్వెస్టర్లలో అర్థికవృద్దిపై ఆందోళనలు రేకత్తాయి. అలాగే అమెరికా - ఇరాన్‌ దేశాల మధ్య నెలకొన్న రాజకీయ ఉద్రికత్తలతో  ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు నష్టాల బాట పట్టాయి. అంతర్జాతీయంగా అనిశ్చితి వాతావరణ పరిస్థితుల్లో క్రూడాయిల్‌ ధరలకు రెక్కలోచ్చాయి. ఫలితంగా ఆరు ప్రధాన కరెన్సీ విలువల్లో డాలర్‌ ఇండెక్స్‌ కనిష్టస్థాయి నుంచి బలమైన రికవరిని సాదించాయి. ఇదే వారంలో అమెరికా విడుదల చేసిన రీటైల్‌ అమ్మకాల గణాంకాలు ఆశించిన స్థాయిలో నమోదు కావడం కూడా అటు డాలర్‌, స్వల్పకాలికానికి ట్రెజరీ ఈల్డ్స్‌కు కలిసొచ్చింది. ఈ అనూహ్య పరిణామాలతో పసిడి ధర స్వల్ప లాభాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఈ వారంలో పసిడి ధర రెండుసార్లు 14 నెలల గరిష్టస్థాయిలను అందుకున్నప్పటికీ, వారం మొత్తం మీద కేవలం 5డాలర్లు మాత్రమే లాభపడింది.
దేశీయంగా స్వల్ప లాభాల ముగింపు:- 
అంతర్జాతీయ ట్రెండ్‌కు అనుగుణంగానే నిన్నటి ఎంసీక్స్‌ ట్రేడింగ్‌లో పసిడి ఫ్యూచర్లు తీవ్ర ఒడిడుదుకులకు లోనయ్యాయి. ఫారెక్స్‌ మార్కెట్లో డాలర్‌ మారకంలో రూపాయి 30 పైసలు బలహీనపడినప్పటికీ, దేశీయ ఎంసీఎక్స్‌ మార్కెట్లో శుక్రవారం పసిడి ఫ్యూచర్ల ధర స్వల్పంగా లాభపడ్డాయి. ఎంసీఎక్స్‌ మార్కెట్లో ఇంట్రాడేలో  10గ్రాముల పసిడి ధర రూ.86.00లు పెరిగి రూ.33045.00ల వద్ద ముగిసింది.  ఇంట్రాడేలో 32,980.00 - 33,344.00 రేంజ్‌లో కదలాడాయి. ఇక దేశీయంగా వారంపరంగా చూసినట్లైతే పసిడి ధర 109ల స్వల్ప లాభంతో సరిపెట్టుకుంది.



You may be interested

హెచ్‌డీఎఫ్‌సీ టార్గెట్‌ రేటింగ్‌ను పెంచిన హెచ్‌ఎస్‌బీసీ

Saturday 15th June 2019

 మార్కెట్‌ వాటాను పెంచుకునేందుకు హెచ్‌డీఎఫ్‌సీకి మంచి అవకాశం నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ సెక్టార్‌లో మందగమనమే కారణం: హెచ్‌ఎస్‌బీసీ హౌసింగ్‌ డెవలప్‌మెంట్‌ ఫైనాన్స్‌ కార్పోరేషన్‌(హచ్‌డీఎఫ్‌సీ) టార్గెట్‌ ధరను హాంకాంగ్‌, షాంఘై బ్యాంకింగ్‌ కార్పోరేషన్‌(హెచ్‌ఎస్‌బీసీ) రూ.2,195 నుంచి రూ. 2,500కు పెంచింది. ఇప్పుడున్న అనిశ్చితి పరిస్థితుల్లో కూడా హెచ్‌డీఎఫ్‌సీకి  మార్కెట్‌ షేరును పెంచుకునే సామర్ధ్యం ఉందని హెచ్‌ఎస్‌బీసీ అభిప్రాయపడింది.  నోమురా తాజాగా హెచ్‌డీఎఫ్‌సీ రేటింగ్‌ను తగ్గించిన విషయం తెలిసిందే. హెచ్‌డీఎఫ్‌సీకి రికవరి సామర్ధ్యం ఉందని, వాల్యుయేషన్‌

11800ల దిగువకు ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ

Saturday 15th June 2019

ఎస్‌జీఎక్స్‌ ఇండెక్స్‌ శుక్రవారం 11800ల దిగువన ముగిసింది.  సింగపూర్‌లో నిన్న రాత్రి 33 పాయింట్లు నష్టపోయి 11,797.50 వద్ద స్థిరపడింది. అంతర్జాతీయంగా నెలకొన్న రాజకీయ ఉద్రికత్తలు, ఇప్పటికీ ఓ కొలిక్కిరాని చైనా- అమెరికాల వాణిజ్య ఒప్పంద చర్చల నేపథ్యంలో అంతర్జాతీయ వృద్ధిపై ఆందోళనలు రేకెత్తడంతో ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలో అమ్మకాలు వెల్లువెత్తున్నాయి. నిన్న ఆసియా మొదలు యూరప్‌, అమెరికా మార్కెట్ల వరకు నష్టాల్లోనే ముగిశాయి. ఈ ప్రతికూల అంశాలకు తోడు, తాజాగా

Most from this category