News


డాలర్‌ ఎఫెక్ట్‌ : 8డాలర్లు నష్టపోయి పసిడి

Saturday 28th September 2019
Markets_main1569669836.png-28605

ప్రపంచ మార్కెట్లో పసిడి 8డాలర్లు నష్టపోయి 1,506.40 డాలర్ల వద్ద స్థిరపడింది. ఆరు ప్రధాన కరెన్సీ విలువల్లో డాలర్‌ ఇండెక్స్‌ రెండున్నరేళ్ల గరిష్టాన్ని అందుకోవడం ఇందుకు కారణమైంది. అమెరికా సెప్టెంబర్‌ ఆర్థిక గణాంకాలు మార్కెట్‌ వర్గాలను మెప్పించడంతో డాలర్‌ ఇండెక్స్‌ పుంజుకుని 0.60శాతం పెరిగింది. నిన్నరాత్రి ట్రేడింగ్‌లో డాలర్‌ ఇండెక్స్‌ అధిక స్థాయిలో ట్రేడ్‌ అవుతుండంతో పసిడి ధర క్రమంగా తగ్గుముఖం పడుతూ వచ్చింది. ఒక దశలో 1500 డాలర్ల స్థాయిని కోల్పోయి 1,493.30 వద్ద కనిష్టాన్ని తాకింది. అయితే... అమెరికా స్టాక్‌ ఎక్చ్సేంజీల నుంచి చైనా కంపెనీల డీలిస్టింగ్‌ అంశాన్ని ట్రంప్‌ ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారంతో అమెరికా ఈక్విటీ మార్కెట్లు నష్టాల బాట పట్టడంతో ట్రేడర్లు రక్షణాత్మకంగా పసిడి ఫ్యూచర్ల కొనుగోళ్లకు మొగ్గుచూపారు. ఫలితంగా పసడి ధర రికవరిబాట పట్టి పసిడి 1500డాలర్ల స్థాయిని అందుకుని 1,506.40 డాలర్ల వద్ద స్థిరపడింది. ఈ వారం మొత్తంలో పసిడి 9డాలర్లు(0.60శాతం) క్షీణించింది. 
దేశీయ మార్కెట్లో స్వల్ప తగ్గింపు:- 
అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధర భారీగా ఒడిదుడుకులకు లోనైప్పటికీ.., దేశీయంగా మాత్రం స్వల్ప నష్టంతో ముగిసింది. ఎంసీఎక్స్‌ మార్కెట్‌ శుక్రవారం రాత్రి ముగింపు సమయానికి అక్టోబర్‌ కాంటాక్టు 10గ్రాముల పసిడి ధర రూ.44.00ల నష్టంతో రూ.37750.00 వద్ద స్థిరపడింది. దేశీయంగా ఈ వారంలో పసిడి ధర రూ.53లు పెరిగింది. 



You may be interested

మిడ్‌క్యాప్స్‌లో చక్కని అవకాశాలు

Monday 30th September 2019

గత 13 ఏళ్లలో మిడ్‌క్యాప్‌ ఇండెక్స్‌ అన్నది ఒక ఏడాదికి మించి ఎక్కువ కాలం పాటు లార్జ్‌క్యాప్‌ ఇండెక్స్‌ కంటే పనితీరులో వెనుకబడిన సందర్భం లేదు. ఒకప్పుడు నిఫ్టీకి 50 శాతం ప్రీమియంగా నడిచిన మిడ్‌క్యాప్‌ 100 సూచీ ఇప్పుడు 20 శాతం డిస్కౌంట్‌తో ట్రేడవుతోంది. 2011 నాటి పరిస్థితులకు దగ్గరగా ఉంది. ఇది డౌన్‌సైడ్‌ విషయంలో​సౌకర్యవంతమైన పరిస్థితి అని విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు. నిఫ్టీ మిడ్‌క్యాప్‌ 100లోని స్టాక్స్‌లో మూడింట

టాటామోటర్స్‌ ఏడీఆర్‌ 2.50శాతం డౌన్‌

Saturday 28th September 2019

అమెరికా మార్కెట్లు రెండునెలల్లో అతిపెద్ధ నష్టాన్ని చవిచూసిన నేపథ్యంలో ఏడీఆర్‌లు తీవ్ర అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ఫలితంగా టాటామోటర్స్‌ ఏడీఆర్‌, విప్రో ఏడీఆర్‌, ఇన్ఫోసిస్‌ ఏడీఆర్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ఏడీఆర్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, డాక్టర్‌ రెడ్డీస్‌ ఏడీఆర్‌లు 2.50శాతం నుంచి అరశాతం నష్టపోయాయి. అత్యధికంగా టాటామోటర్‌ ఏడీఆర్‌ 2.50శాతం నష్టపోయింది. అలాగే హెచ్‌డీఎఫ్‌సీ ఏడీఆర్‌ 2శాతం, ఐసీఐసీఐ ఏడీఆర్‌ 1.50శాతం, డాక్టర్‌ రెడ్డీస్‌ ఏడీఆర్‌, విప్రో ఏడీఆర్‌ అరశాతం క్షీణించాయి.

Most from this category