News


1280 డాలర్ల వద్ద పసిడి

Friday 24th May 2019
Markets_main1558679047.png-25902

డాలర్‌ ఇండెక్స్‌ 2ఏళ్ల గరిష్టం నుంచి వెనక్కి రావడంతో ప్రపంచమార్కెట్లో పసిడి ధర 1280 డాలర్ల వద్ద స్థిరంగా ట్రేడ్‌ అవుతోంది. ఆసియాలో ఔన్స్‌ పసిడి ధర 1డాలరు స్వల్ప నష్టంతో 1284 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. అమెరికా నిన్న రాత్రి విడుదల చేసిన తయారీ రంగ గణాంకాలు పదేళ్ల కనిష్టానికి పతనమయ్యాయి. ఏప్రిల్‌లో హౌసింగ్‌ అమ్మకాల గణాంకాలు కూడా మార్కెట్‌ను నిరుత్సాహపరిచాయి. బలహీన ఆర్థిక గణాంకాల విడుదలైన నేపథ్యంలో రానున్న రోజుల్లో ఫెడ్‌ రిజర్వ్‌ వడ్డీ పెంపుపై సందేహాలు వ్యక్తమయ్యాయి. మరోవైపు అమెరికా - చైనాల రోజు రోజుకూ ముదురుతున్న వాణిజ్య యుద్ధంతో ఆర్థిక వ్యవస్థ కుదేలవుతున్న తరుణంలో ఫెడ్‌ రిజర్వ్‌ ఈ ఏడాది వడ్డీరేట్లపై కోత విధించవచ్చని మార్కెట్‌ వర్గాలు భావిస్తున్నాయి. ఫలితంగా ఆరు ప్రధాన కరెన్సీ విలువల్లో డాలర్‌ ఇండెక్స్‌ 2ఏళ్ల గరిష్టం నుంచి వెనకడుగు వేయడంతో రాత్రి అమెరికాలో పసిడి ధర 10డాలర్లు లాభపడి 1,285.40 డాలర్ల వద్ద స్థిరపడింది. వడ్డీరేట్ల కోత అంచనాలు పసిడి బలపడేందుకు దోహదపడే అంశం. పసిడిలో కొంత షార్ట్‌ కవరింగ్‌ జరిగింది. అలాగే 1290 డాలర్ల వద్ద పసిడికి బలమైన నిరోధ స్థాయిని కలిగి ఉంది. మార్కెట్లో ప్రస్తుత ట్రెండ్‌ కొనసాగితే డాలర్‌ బలంగా ఉన్నప్పటికి, పసిడి 1,290 - 1300 డాలర్ల స్థాయిని అధిగమిస్తుందని బులియన్‌ విశ్లేషకుడు పీటర్‌ ఫంగ్‌ అభిప్రాయపడ్డారు.
దేశీయంగా స్వల్ప పతనం:- 
ఫారెక్స్‌ మార్కెట్‌ రూపాయి బలపడంతో దేశీయ బులియన్‌ మార్కెట్లోనూ పసిడి ఫ్యూచర్ల నష్టాల్లోనే ట్రేడ్‌ అవుతున్నాయి. ఎంసీఎక్స్‌ మార్కెట్లో జూన్‌ కాంట్రాక్టు 10గ్రాముల పసిడి ధర రూ.50ల నష్టంతో రూ.31629.00ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. You may be interested

జీఐసీ రీ లాభం 20 శాతం డౌన్‌

Friday 24th May 2019

ఒక్కో షేర్‌కు రూ.6.75 డివిడెండ్‌ న్యూఢిల్లీ: జనరల్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (జీఐసీ రీ) నికర లాభం (స్డాండ్‌అలోన్‌) గత ఆర్థిక సంవత్సరం (2018-19) నాలుగో త్రైమాసిక కాలంలో 20 శాతం తగ్గింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం (2017-18) క్యూ4లో రూ.752 కోట్లుగా ఉన్న నికర లాభం గత క్యూ4లో రూ.603 కోట్లకు తగ్గిందని కంపెనీ తెలిపింది. స్థూల ప్రీమియమ్‌ వసూళ్లు రూ.8,525 కోట్ల నుంచి రూ.8,089 కోట్లకు

శుక్రవారం వార్తల్లోని షేర్లు

Friday 24th May 2019

వివిధ వార్తలకు అనుగుణంగా శుక్రవారం ప్రభావితమయ్యే షేర్ల వివరాలు  సిప్లా:- ఏఎంపీ సోలార్‌ సిస్టమ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌లో 26శాతం వాటా కొనుగోలు చేసేందుకు ఒప్పందాన్ని కుదుర్చుకుంది.  ఓమ్‌ మెటల్స్‌ ఇన్ఫ్రాప్రాజెక్ట్స్‌:- ప్యాకింగ్‌ విభాగాన్ని విక్రయించింది.  రాడికో ఖైతాన్‌:- గతంలో ఉత్తరప్రదేశ్‌ యూనిట్‌కు ఆదేశించిన మూసివేత ఆర్డర్లను పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు ఎత్తివేసింది.  హిందూస్థాన్‌ కాపర్‌:- మే 28న జరిగే బోర్డు సమావేశంలో కంపెనీ  రుణ సేకరణ మొత్తాన్ని పెంపుతో పాటు, షేర్‌ హోల్డర్లకు సెక్యూరిటీల జారీ,

Most from this category