1,500 డాలర్ల దిగువకు బంగారం!
By Sakshi

యుఎస్-చైనా ప్రతినిధుల మధ్య గురువారం ప్రారంభమైన వాణిజ్య చర్చలు బాగా జరిగాయని ట్రంప్ ట్వీట్ చేయడంతో శుక్రవారం ట్రేడింగ్‌లో బంగారం ధరలు తగ్గాయి. తక్షణ బంగారం 0.2 శాతం తగ్గి 1,491.12 డాలర్లకు చేరుకోగా, యుఎస్ గోల్డ్ ప్యూచర్స్ 0.2 శాతం నష్టపోయి 1,498.50 డాలర్లకు చేరుకుంది.
యుఎస్-చైనా మధ్య కొనసాగుతున్న వాణిజ్య చర్చలు బాగా జరిగాయని ట్రంప్ గురువారం ట్వీట్ చేశారు. ఫలితంగా ఇరు దేశాల మధ్య గత 15 నెలల నుంచి కొనసాగుతున్న యుఎస్-చైనా ట్రేడ్‌వార్ కొంత సరళతరం అయ్యే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. అంతేకాకుండా చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్న వస్తువులపై యుఎస్ అదనపు సుంకాల అమలు ఇంకొంత కాలం ఆలస్యం అవుతాయని అంచనావేస్తున్నాయి. యుఎస్-చైనా ప్రతినిధుల మధ్య వాణిజ్య చర్చలు బాగా జరిగాయని, ఇరుదేశాల ప్రతినిధులు కరెన్సీ, కాపీ రైట్ల రక్షణకు అంగీకరించారని యుఎస్ చాంబర్ ఆఫ్ కామర్స్ అధికారులు తెలిపారు.ఇరు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందానికి అవకాశాలు పెరగడంతో ఆసియా, యుఎస్ స్టాక్ మార్కెట్లు శుక్రవారం పాజిటివ్‌గా ట్రేడవుతున్నాయి. అంతేకాకుండా జపాన్ వెలుపల ఆసియా షేర్ల ఎంఎస్సీఐ(మోర్గాన్ స్టాన్లీ క్యాపిటల్ ఇండెక్స్) ఇండెక్స్ 0.4 శాతం పెరిగింది.
దీర్ఘకాలంగా కొనసాగుతున్న యుఎస్-చైనా ట్రేడ్ వార్ వలన యుఎస్ స్థూల ఆర్థిక డేటా బలహీనంగా ఉన్న విషయం తెలిసిందే. ఫలితంగా అక్టోబర్‌లో సమావేశం కానున్న ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ ఈ ఏడాది మూడవ సారి వడ్డీ రేట్లను తగ్గించే అవకాశం ఉంది. వీటితో పాటు అతి పెద్ద గోల్డ్ ఎక్సేంజ్ ట్రేడెడ్ ఫండ్ ఎస్పీడీఆర్ గోల్డ్ ట్రస్ట్ తన గొల్డ్ నిల్వలు 0.22 శాతం పడిపోయి 921.71 టన్నులకు చేరుకుందని గురువారం ప్రకటించింది. కాగా ఇది బుధవారం నాడు 923.76 టన్నులుగా ఉండడం గమనార్హం. ఈ ఏడాది చివరి నాటికి 2019 బంగారం ధర ఔన్సుకు 1,555 డాలర్లు, 2020లో 1,605 డాలర్లకు చేరుకుంటుందని హెచ్ఎస్బీసీ ఓ నివేదికలో తెలిపింది.
You may be interested
24 పైసలు బలపడిన రూపీ
Friday 11th October 2019దేశీయ కరెన్సీ రూపీ, డాలర్ మారకంలో శుక్రవారం ట్రేడింగ్‌లో 24 పైసలు బలపడి 70.83 వద్ద ప్రారంభమైంది. అంతేకాకుండా ప్రధాన కరెన్సీలతో పోలిస్తే డాలర్ బలహీనపడడంతో రూపీ డాలర్ మారకంలో 70.81 వద్ద ఒక వారం గరిష్ఠాన్ని తాకింది. కాగా గత సెషన్లో రూపీ డాలర్ మారకంలో 71.07 వద్ద ముగిసింది. యురోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ ఎక్సిట్ ఒప్పందంపై పురోగతి ఉండడంతో పాటు యుఎస్-చైనా మధ్య గురువారం ప్రారంభమైన
కియా తొలి ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభం
Friday 11th October 2019- బీట్ 360 పేరుతో గురుగ్రామ్‌లో ఏర్పాటు - సెప్టెంబర్ దేశీ అమ్మకాలు 7,554 యూనిట్లు గురుగ్రామ్: దక్షిణ కొరియా ఆటోమొబైల్ దిగ్గజం కియా మోటార్స్.. తాజాగా తన తొలి ఎక్స్పీరియన్స్ సెంటర్‌ను ప్రారంభించింది. ‘బీట్ 360’ పేరుతో 5,280 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ సెంటర్‌ను ఇక్కడ ఏర్పాటుచేసింది. ఈ సందర్భంగా సంస్థ ఎండీ, సీఈఓ కూక్ హున్ షిమ్ మాట్లాడుతూ.. ‘కియా భవిష్యత్ వ్యూహాలను ఈ సెంటర్ వివరిస్తుంది. భారత్‌లో