News


2వారాల కనిష్టానికి పసిడి

Tuesday 26th November 2019
Markets_main1574747846.png-29864

ప్రపంచమార్కెట్లో పసిడి ధర మంగళవారం 2వారాల కనిష్టానికి దిగివచ్చింది. అమెరికా చైనాల మధ్య మధ్యంతర వాణిజ్య చర్చలు త్వరలోనే సఫలం కాగలనే అంచనాలు ఇందుకు కారణమయ్యాయి. ఆసియాలో ఉదయం సెషన్‌లో ఔన్స్‌ పసిడి ధర 3డాలర్ల నష్టంతో  1,453.80డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. వాణిజ్య చర్చలు ఇప్పటికి సాజావుగా జరుగుతున్నాయి. అలాగే ఈ వారంలో మెరుగైన ఆర్థిక గణాంకాలు వెలువడే అవకాశం ఉంది. ఇవన్ని ఈక్విటీ మార్కెట్లలో పెట్టుబడులకు పురిగొల్పుతున్నాయి. ఫలితంగా పసిడి అమ్మకాల ఒత్తిడికి లోనవుతోంది. మరోవైపు పసిడికి వ్యతిరేకంగా ట్రేడయ్యే డాలర్‌ ఇండెక్స్‌ 2వారాల గరిష్టానికి చేరుకోవడం జరిగింది. ఇక నిన్నరాత్రి అమెరికా ఈక్విటీ మార్కెట్లు రికార్డు ముగింపు నేపథ్యంలో  అక్కడ ఔన్స్‌ పసిడి ధర 6.70 డాలర్లు నష్టపోయి 1,456.9 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. 
దేశీయంగా వరుసగా 6రోజూ నష్టాల్లోనే:- 
అంతర్జాతీయంగా పసిడి ధర 2వారాల కనిష్టస్థాయికి చేరుకున్న నేపథ్యంలో దేశీయంగా పసిడి పతనం కొనసాగుతుంది. వరుసగా 6రోజూ నష్టాల్లో ట్రేడ్‌ అవుతోంది. రూపాయి ఇంట్రాడేలో బలపడటం పసిడికి ప్రతికూలమైంది. ఫలితంగా దేశీయ ఎంసీఎక్స్‌ మార్కెట్లో డిసెంబర్‌ కాంటాక్టు 10గ్రాముల పసిడి ధర రూ.59లు బలపడి రూ.37664.00 వద్ద ట్రేడ్‌ అవుతోంది. నిన్నరాత్రి  రూ.172లు నష్టపోయి రూ.37,723 వద్ద ట్రేడ్‌ అవుతోంది. 



You may be interested

రిలయన్స్‌పై విశ్లేషకులు బుల్లిష్‌గా ఎందుకున్నారు?

Tuesday 26th November 2019

రిలయన్స్‌ జియో టారిఫ్‌లను పెంచేందుకు సిద్ధమవుతుండడంతో, గత కొన్ని సెషన్‌ల నుం‍చి గరిష్ఠ స్థాయిలో వద్ద ట్రేడవుతున్న రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేరు, మరింత పెరుగుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రిలయన్స్‌ ప్రధాన వ్యాపారం బలహీనంగా ఉన్నప్పటికి, వినియోగధారిత  రిటైల్‌, టెలికాం వ్యాపారాలు అంచనాలకు మించి రాణిస్తున్నాయి. ఇవి కంపెనీ స్టాక్‌ వాల్యుషన్లు పెరగడానికి ఉపయోగపడతాయని అభిప్రాయపడ్డారు. కాగా ఈ ఏడాది ప్రారంభం నుం‍చి ఇప్పటి వరకు గమనిస్తే, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేరు

టెల్కోల ఆశలపై నీళ్లు!

Tuesday 26th November 2019

కార్యదర్శుల కమిటీ రద్దు ఇంకా ఛాన్సులున్నాయంటున్న సీఓఏఐ టెలికం రంగానికి ఇవ్వాల్సిన ఉపశమన చర్యలను సిఫార్సు చేసేందుకు ఏర్పాటైన కార్యదర్శుల కమిటీ కధ ముగిసిందని ప్రభుత్వాధికారి ఒకరు చెప్పారు. దీంతో స్పెక్ట్రం చెల్లింపులపై రెండేళ్ల మారిటోరియం విధింపు అనే ఊరటతో టెలికంలు సరిపెట్టుకోవాల్సివచ్చే సూచనలు కనిపిస్తున్నాయి.  రెండేళ్ల మారిటోరియంతో కంపెనీలకు రూ. 42వేల కోట్ల లబ్ది చేకూరుతుందని సదరు అధికారి గుర్తుచేశారు. అందువల్ల ఇకపై ప్రభుత్వం నుంచి ఆశించడానికేమీ లేదన్న సంకేతాలిచ్చారు. అందుకే

Most from this category