News


వచ్చే డిసెంబర్‌కల్లా 1620 డాలర్లస్థాయికి పసిడి

Wednesday 25th December 2019
Markets_main1577262751.png-30430

వచ్చే ఏడాదిలో పసిడి ధర 1600 డాలర్ల పైన ట్రేడ్‌ అయ్యే అవకాశం ఏఎన్‌జెడ్‌ బ్యాంకింగ్‌ గ్రూప్‌ తన నివేదికలో తెలిపింది. ఈ ఏడాది మాదిరిగానే 2020లో పసిడి అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తుందని, ఇతర విలువైన కమోడిటీల కంటే 2020లో ఎక్కువ లాభాల్ని ఇన్వెస్టర్లకు పంచుతుందని బ్యాంకింగ్‌ గ్రూప్‌ అభిప్రాయపడింది. వచ్చే ప్రారంభం నుంచి పసిడి ధర క్రమంగా పెరుగుతూ ఏడాది చివరి నెల డిసెంబర్‌ నాటికి 1620 డాలర్ల వరకు ర్యాలీ చేస్తుందని ఏఎన్‌జెడ్‌ తెలిపింది.

‘‘మా అంచనా ప్రకారం వచ్చే ఏడాది ఔన్స్‌ పసిడి ధర 1600 డాలర్ల పైన ట్రేడ్‌ అవుతోంది. వాస్తవ వడ్డీరేట్లు, డాలరు, ద్రవ్యోల్యణ అంచనాలు పసిడి విలువను 1470డాలర్లగా నిర్ణంచాయి. డాలర్‌ కొద్దిగా బలహీనపడటం, బాండ్ల దిగుబడిలో మాత్రమే పెరుగుదల ఉన్నందున 2020లో పసిడి ధర 1600డాలర్లను తాకుతుందని అంచనా వేస్తున్నాము’’ ఏఎన్‌జెడ్‌ తెలిపింది. 

ప్రపంచవ్యాప్తంగా డీ-డాలరైజేషన్‌, భౌగోళిక అనిశ్చితులు రానున్న రోజుల్లో పసిడి ర్యాలీకి నడిపించే ప్రధాన కారకాలని ఏఎన్‌జెడ్‌ అవుట్‌లో పేర్కోంది. అమెరికా చైనా మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు, బ్రెగ్జిట్‌ లాంటి అంశాలు ఈ 2019లో మధ్యలో పసిడి ధర గరిష్ట స్థాయిని అందుకుంది. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, స్థూల ఆర్థిక అంశాలు పసిడి కీలకం కానున్నాయి. ఇటీవల జరుగుతున్న డీ-డాలరైజేషన్‌ పసిడికి మరింత డిమాండ్‌ను పెంచుతుంది. వచ్చే ఏడాది జరగనున్న యూఎస్‌ అధ్యక్ష ఎన్నికలు ఆర్థిక మార్కెట్లను ప్రత్యక్షంగా ప్రభావితం చేస్తున్నందున ఇన్వెస్టర్ల అప్రమత్తత పసిడికి కలిసొచ్చే అంశమని ఏఎన్‌జెడ్‌ పేర్కోంది. 

పలు దేశాల కేంద్ర బ్యాంకులు కీలక వడ్డీరేట్ల తగ్గింపు అంచనాలు, ప్రపంచవ్యాప్తంగా జనాభా పెరుగుదల బంగారం వినియోగం పెరగవచ్చనే ఆశావహన అంచనాలు ఇన్వెస్టర్ల పోర్ట్‌ఫోలియోలో పసిడికి చోటును కల్పిస్తాయని ఏఎన్‌జెడ్‌ తెలిపింది. 



You may be interested

కొత్త ఏడాదిలో కొనదగ్గ బ్లూచిప్స్‌

Wednesday 25th December 2019

టెలికంలో భారతీ ఎయిర్‌టెల్‌ డైవర్సిఫైడ్‌ విభాగంలో ఆర్‌ఐఎల్‌ ఐసీఐసీఐ, బజాజ్‌ ఫైనాన్స్‌ భేష్‌ ఈ ఏడాది ప్రారంభంలో దేశీ స్టాక్‌ మార్కెట్లు అటూఇటుగా ప్రారంభమైనప్పటికీ తదుపరి ఊపందుకున్నాయి. మధ్యలో తిరిగి భారీ ఒడిదొడుకులను ఎదుర్కొన్నాయి. చివరికి నిలదొక్కుకుని ర్యాలీ బాటలో సాగుతున్నాయి. ఎఫ్‌ఫీఐలపై ట్యాక్స్‌ సర్‌చార్జ్‌, దేశ జీడీపీ మందగమనం, ద్రవ్యలోటు వంటి అంశాలు దేశీయంగా సెంటిమెంటును బలహీనపరచగా.. రిజర్వ్‌ బ్యాంక్‌ వడ్డీ రేట్ల తగ్గింపు, ఎఫ్‌ఫీఐల ట్యాక్స్‌ సర్‌చార్జ్‌పై కేంద్రం వెనకడుగు,  కార్పొరేట్‌

బడ్జెట్‌లోపు నిఫ్టీ 13,000 పాయింట్లకు!

Wednesday 25th December 2019

బుల్లిష్‌ ధోరణి కొనసాగే వీలుంది ట్రేడింగ్‌ బెల్స్‌ సీఈవో అమిత్‌ గుప్తా అంచనా ప్రస్తుతం దేశీ స్టాక్‌ మార్కెట్లలో పటిష్ట బుల్‌రన్‌ కనిపిస్తోంది. సాంకేతికంగా ఈ బుల్లిష్‌ ధోరణి ఇకపైనా కొనసాగే అవకాశముందంటున్నారు ట్రేడింగ్‌బెల్స్‌ సహవ్యవస్థాపకులు, సీఈవో అమిత్‌ గుప్తా. ఒక ఆంగ్లఛానల్‌కు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో నిఫ్టీ కదలికలపై బుల్లిష్‌ అంచనాలు ప్రకటించారు. వివరాలు...... కన్సాలిడేషన్‌ దేశీ స్టాక్‌ మార్కెట్లలో పటిష్ట బుల్లిష్‌ మొమెంటమ్‌ నెలకొని ఉంది. దీంతో బడ్జెట్‌ కంటే ముందుగానే  ఎన్‌ఎస్‌ఈ ప్రధాన

Most from this category